Sunday, February 13, 2011

బెంగళూరు ఏరో ఇండియా - 2011

మొత్తానికి నిన్న ఏరో ఇండియా చూసే అవకాశం కలిగింది. 2 గంటలనుండి 4 గంటలవరకు చూశాము, పనిలో పనిగా షాహిద్ కాపుర్‌ని కూడా. మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన LCA, తేజస్ విన్యాసాలు బాగా ఆకట్టుకున్నాయి. F16, F18, అదే కోవకు చెందిన మరికొన్ని విన్యాసాల్లో పాల్గొన్నాయి. నాకైతే, తేజస్, F16, F18 విన్యాసాలు బాగా నచ్చాయి. చివర్లో సూర్యకిరణ్‌లు కూడా తమ ప్రతాపాల్ని చూపించాయి :)

అసలే నా ఫొటోగ్రఫీ పరిజ్ఞానమంతంతమాత్రం, ఎప్పుడు నొక్కితే అవి మన ఫొటోలోకొస్తాయో కనిపెట్టేసరికే పుణ్యకాలం గడిచిపోయింది :). ఇందులో కనిపించేవే F16లు, F18లు, లేకపోతే, మీకేవి నచ్చితే వాటిపేరు పెట్టేసుకోండి ...


3 comments:

  1. సిమ్యులేటర్లవీ చూశారా? ఈసారి వాటిని ప్రదర్శనకు పెట్టారా?

    ReplyDelete
  2. రవి గారు,

    సిమ్యులేటర్స్ ప్రదర్శనకుపెట్టారు కాని, నాకు చూడ్డానికవ్వలేదండి, వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ చూసింతర్వాత, ఎంతవేగిరంగా బయటపడదామా అని, సూర్యకిరణ్‌లు విన్యాసాలు నడుస్తున్నప్పుడే నేను జంప్ :)

    ~సూర్యుడు

    ReplyDelete
  3. man that was a good one..really

    ReplyDelete