Monday, April 9, 2012

ఈ పదానికి అర్ధమేమిటి?

కళ్లం లేదా కళ్ళం లేదా కల్లం.

మీకు తెలిసిన నానార్ధాలు చెప్పండి, మీ మీ మాండలీకాల్లో.

~సూర్యుడు :-)

Sunday, April 1, 2012

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఈరోజు మళ్లీ శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాన్ని (భద్రాచలం నుండి) దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడ్డం జరిగింది. ప్రతి సంవత్సరం చూడ్డం కుదరదు, ఆఫీసుకి సెలవు లేకపోతే. ఎప్పుడు అనుకునేదే కాకపోతే ఈసారి చాల ఎక్కువగా అనిపించిందేమంటే, ఈ టివి ప్రత్యక్ష ప్రాసారాలొచ్చి వ్యాఖ్యానాల క్వాలిటీ పడిపోయిందేమోనని. నా చిన్నప్పుడు మొదట్లో విజయవాడ ఆకాశవాణి వారు, ఆ తర్వాత భద్రాచలం ఆకాశవాణి వారు ప్రత్యక్ష ప్రాసారం చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉండొచ్చు. అప్పుడు అది వింటుంటే అదొకరకమైన ఎక్సైట్‌మెంట్ ఉండేది. దానికి కారణం అప్పటి వ్యాఖ్యాతలే. ప్రతి అంశాన్ని చాల వివరంగా చెప్పేవారు, వాటిగురించి వివరాలు కాని ఇప్పుడలా అనిపించట్లేదు :( (the same goes to Cricket commentary also, it was a thrill listening to Narottam Puri in those days, now the whole game became a farce anyways)


ఇదిగో భద్రాద్రి ... 






నగుమోము గలవాని ...