Saturday, December 8, 2018

మాయావి / మాయావిని సంక్షిప్త నవలలు

చాలారోజుల క్రిందట, అంటే చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లో ఉన్న పాత యువ పత్రికల్లో చదివిన నవలలు అంటే సంక్షిప్త నవలలు, మాయావి / మాయావిని. తర్వాత అవి ఎలాగో కనిపించకుండా పోయాయి. తర్వాత అంతర్జాలంలో ఎంత వెతికినా అవి కనిపించలేదు. ఈమధ్య ఎవరో మళ్ళీ ఆ నవలల గురించ్చి ప్రస్తావిస్తే మళ్ళీ వెతికితే ఎవరో పాత యువ పత్రికల్ని అంతర్జాలంలో పెడితే వాటిలో 1964 డిసెంబర్ పత్రికలో మాయావి కనిపిస్తే పొందిన ఆనందం ఇంతా అంతా కాదు :). దురదృష్టవశాత్తు మాయావిని ప్రచురింపబడ్డ 1965 జనవరి పత్రిక దొరకలేదు :(. మళ్ళీ ఒక సారి అరిందముడు, పూల్ సాహెబు, జుమీలియా, దేవేంద్ర విజయమిత్రుడిని పలకరించి పులకరించి ఇలా మీతో పంచుకోవాలనిపించి, అదీ సంగతి ...

మీకెవరికైనా 1965 జనవరి యువ పత్రిక దొరికితే దయచేసి తెలుపగలరు :)

~సూర్యుడు :-)

Friday, December 7, 2018

The Director / ద డైరెక్టర్

ద ప్రెసిడెంట్ ఈస్ మిస్సింగ్ నవల చదువుదామని మొదలుపెడితే ఎంతకీ ముందుకి కదలడంలేదు. సరే అని ద డైరెక్టర్ నవల మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఇంక ఆపాలనిపించలేదు. చాలా ఉత్కంఠంగా ఉండి బాగుంది. మొత్తంమీద చూస్తే చాలా రంధ్రాలున్నాయి కాని ఇలాంటి నవలల్లో అవన్నీ ఓకే :)


సైబర్ హ్యాకింగ్ ప్రధానాంశంగా చేసుకుని వ్రానసిన నవల. ముఖ్యంగా స్నోడెన్ వ్వవహారం, వికీలీక్స్  తర్వాత అలాంటివి జరిగే అవకాశాన్ని చెప్పటం ఈ నవల ప్రధాన ఇతివృత్తం. అసలు సి.ఐ.ఏ ఎలా ఉద్భవించింది దాని చరిత్ర కొంత.


సో, ఇంక సన్ కింగ్ ఒక్కటే మిగిలింది, David Ignatius నవలల్లో చదవటానికి. అదికూడా చదివేస్తే ఓ పనైపోతుంది :)

~సూర్యుడు :-)