Sunday, January 14, 2024

మనతోనే ఉండే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం

అంటే ఇదేమీ కొత్తకాదుగానీ, మనమేదైనా కంప్యూటర్ వాడుకోవాలంటే ఒక సిస్టం అందులో ఆపరేటింగ్ సిస్టం కావలికదా. లినక్సు లాంటి ఆపరేటింగ్ సిస్టం ఇంతకుముందు డీవీడీ రైటర్ వాడి ఇన్స్టాల్ చేసేవారు . ఆతర్వాత USB స్టిక్స్ వాడి చేస్తున్నారు. అదే లైవ్ ఇమేజ్ ఐతే, ఇన్స్టాల్ చెయ్యకుండా బూట్ చేసి వాడుకున్నంతసేపు వాడుకుని తర్వాత సిస్టం నుంచి తీసేసుకోవచ్చు. ఈ  USB స్టిక్ ని ఎక్కడికి కావాలంటే అక్కడకు తీసుకెళ్లవచ్చు. మనక్కావలసిందల్లా ఒక సిస్టం, బూట్ చెయ్యడానికి (USB స్లాట్ ఉండాలనుకోండి). 

కానీ ఇక్కడో చిక్కుంది. సిస్టం లో అయితే ఆపరేటింగ్ సిస్టం ని అప్డేట్ చేస్తూ ఉండొచ్చు కానీ USB స్టిక్ లో ఇమేజ్ ని అప్డేట్ చెయ్యడానికి లేదు. బూట్ అయిన ఇమేజ్ ని అప్డేట్ చేసినా అది నడుస్తున్నంతవరకే పనికొస్తుంది కానీ మళ్ళీ బూట్ చెస్తే పాత ఇమేజ్ బూట్ అవుతుంది. ఏమైనా కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా అది USB స్టిక్ ఇమేజ్ లో అప్డేట్ అవ్వదు. 

కానీ ఈ ఆపరేటింగ్ సిస్టం వాళ్ళు ఒక ఫీచర్ ఆడ్ చేస్తే, అంటే లైవ్ ఇమేజ్ ని USB  స్టిక్ నుండి బూట్ చేసి దాన్ని అప్డేట్ చేసినా, కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా, షట్ డౌన్ చేసేటప్పుడు ఈ కొత్త ఇమేజ్ ని USB స్టిక్ లోకి వ్రాసేయమంటావా అని అడిగి, వ్రాసేయ్ అంటే USB స్టిక్ లో కొత్త ఇమేజ్ ని వ్రాసేస్తే, నెక్స్ట్ టైం ఆ USB స్టిక్ వాడి బూట్ చేస్తే , కొత్త ఇమేజ్, అంటే అప్డేటెడ్ సాఫ్ట్వేర్ కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ వస్తే ఇంకా బాగుంటుంది. బాగుంటుందనేకన్నా సౌకర్యంగా ఉంటుంది :)

 

~సూర్యుడు :-)



Thursday, January 11, 2024

ప్రజాస్వామ్యము - ఓటు హక్కు వినియోగము

ఎన్నికలు వస్తున్నాయనగానే పత్రికల్లోనూ, ప్రచారసాధనాల్లోనూ అందరూ హోరెత్తించేమాట, ఓటుహక్కు ఉన్నవాళ్ళందరూ తప్పకుండా ఓటు వెయ్యాలని. అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని. ఎన్నికలు పూర్తయి ప్రభుత్వ ఏర్పాటు అవ్వకముందునుంచే అవతలి పక్ష ప్రజా (?) ప్రతినిధుల్ని ఎలా కొనేయాలని అన్ని రాజకియపక్షాలు ప్రయత్నిస్తుంటే, ధనానికో మరొకదానికో ఆశపడి ప్రజా ప్రతినిధులు వేరే పక్షానికి దూకేస్తుంటే అది ప్రజాస్వామ్యమని ఎలా అనిపించుకుంటుంది?

ప్రజలు ఒక పక్షానికిచెందిన అభ్యర్థిని గెలిపించినప్పుడు, వారి అభిప్రాయాన్ని కాదని ఆ అభ్యర్థి వేరే పక్షానికి దూకేస్తే అతనికి ఓట్లేసినవారి పరిస్థితేమిటి? వారి ఓటుకున్న విలువేంటి? ఆమాత్రందానికి అందరు ఓటు వెయ్యాలని చెప్పడం దేనికి? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా దాని సంగతే ఎవరు మాట్లాడడం లేదు. ప్రజాస్వామ్యానికే అమ్మలాంటి ప్రజాస్వామ్యమంటే ఇదేనా?

ఇంతకుముందు ఇలా జరగలేదా అని ప్రశ్నించొచ్చు కానీ ఇంతకుముందు జరిగిన తప్పులే మళ్ళీ చేస్తుంటే ఇంక తేడా ఏముంది, పురోగతేముంది?

ఒక్క ఓటుతో గెలిచినా పూర్తికాలం అభ్యర్థిగా కొనసాగే హక్కెలాఉంటుందో ఒక్క సీటు మెజారిటీతో గెలిచినా ఆ పక్షానికి పూర్తి కాలం పరిపాలించే హక్కుండాలి.


మీరేమంటారు?


~సూర్యుడు :-)

Wednesday, January 10, 2024

Problem in commenting on a post in blogspot

Recently, I had a problem in commenting on a post in http://kasthephali.blogspot.com blog. On googling, I found the following link that might be useful to others facing the same problem -


https://support.google.com/blogger/thread/163549939/comments-on-blogger-with-the-sign-in-with-google-button?hl=en


Of course, when you follow the advice, you know what you are doing ;)


~సూర్యుడు :-)

Saturday, January 6, 2024

నూతన సంవత్సరం - ఆశాజీవి

వాట్సాప్ లో ఎవరో ఓ meme పంపించారు - "నూతన సంవత్సరం అయిపోయిందా, ఏమైనా దొరికిందా, ఏమైనా మారిందా" అని. నిజమేకదా, సంవత్సరం సంఖ్య మారుతుంది కానీ డిసెంబర్ 31 నుండి జనవరి 1, ఇంకొక రోజు, మిగతా రోజులు మారినట్టే. సంవత్సరం మారితే ఏం మారుతుంది, మనం మారితే ఏదైనా మారుతుంది కానీ. 

కాని, జనవరి 1 అంటే అదొక ప్రత్యేకం.  అవును మనకి ఉగాదికూడా ప్రత్యేకమే. సంవత్సరం మారగానే మన జీవితాల్లో ఏదో మార్పు వస్తుందని ఏదో ఆశ. ఆశ అనేదే లేకపోతే జీవనం కష్టం కదా. 

కానీ జీవితంలో ఎదో మార్పు వస్తుందని డిసెంబర్ 31 వరకు ఎందుకు ఆగాలి? రేపే మన జీవితంలో మార్పు వస్తుందని  ఎందుకు అనుకోకూడదు? అలా రోజూ అనుకుంటే, అలాంటి మార్పుకోసం రోజూ ప్రయత్నిస్తే, జీవితం / రోజులు ఎందుకు మారవు?


~సూర్యుడు :-)

Monday, January 1, 2024

Happy New Year!

 Wish you all A Very Happy New Year 2024!

May God bless you with everything you need.