Sunday, December 25, 2016

A tribute to Dr. Mangalampalli Balamuralikrishna

I just love his songs, especially Ramadasu keerthanas and Pancharathna Krithis. The Karnatic music world will miss him sorely. May his soul rest in peace.



పలుకే బంగారమాయెనా




పంచరత్న కృతులు

Saturday, December 3, 2016

ఇంకొన్ని నవలలు

The Parsifal Mosaic చదవడం పూర్తయింది, బాగుంది. The Agents of Innocence (by David Ignatius) చదవడం కూడా పూర్తయింది. David Ignatius నవలలు చదవడం ఇదే మొదటిసారి. ఈ నవల బాగుంది. Daniel Silva నవలలు కన్నా కొద్దిగ భిన్నంగా ఉంది. వీలైతే మిగిలిన నవలలు చదవాలి.

John le Carré నవల, ది పర్ఫెక్ట్ మర్డర్ మొదలుపెట్టాను కాని ఎంతకీ పూర్తవడం లేదు :(

అలాగే డేనియల్ సిల్వా నవల ది అన్లైక్లి స్పై కూడా ముందుకి / ముందుకు (ఈ క గుణింతము తో చాలా కష్టంగా ఉంది :() వెళ్లడంలేదు.

ఇప్పుడు Frederick Forsyth's The Outsider మొదలుపెట్టాను, చూడాలి ఇదెలా నడుస్తుందో. సాధారణంగా నాకు ఆత్మకథలంత నచ్చవు.

Sunday, October 23, 2016

ఈ మద్య చదివిన / చదువుతున్న పుస్తకాలు

డానియల్ సిల్వ ద బ్లాక్ విడో చదవడం పూర్తయ్యింది, ఓ మాదిరిగా అనిపించింది, ఇంతకుముందు నవలలతో పోలిస్తే మరీ అంత గొప్పగా లేదు, పర్వాలేదు, ఓ సారి చదవొచ్చు.

ఇప్పుడు రాబర్ట్ లుడ్లమ్ ద పార్సిఫాల్ మొసాఇక్ (The Parsifal Mosaic) మొదలుపెట్టాను, చూడాలి ఎప్పటికి పూర్తవుతుందో. ఈ నవలలో, రెండో చాప్టర్ లో ఈ క్రింద పంక్తులు నాకు నచ్చాయి :)

Time was the true narcotic for pain. Either the pain disappeared when it ran its course or a person learned to live with it.

Superb, isn't it :-)


Sunday, August 28, 2016

ఆలోచనలు - 2

ఓ ఐదు సంవత్సరాల క్రిందట ఈ టపా వ్రాసాను. ఎందుకు కొంతమంది విజయాలను సాధిస్తారు ఇంకొంతమంది ఎక్కువ విజయాలు సాధించలేక వెనకపడతారు అని. ఈ మధ్య ఓ పుస్తకం చదివాను, No Excuses! by Brian Tracy. ఈ పుస్తకం కూడా ఇదే ఆలోచన గురించి . ఈ పుస్తకానికి మూలాధారమైన విషయమేమంటే, క్రమశిక్షణ (the subtitle of the book, The power of self-discipline) . తేజస్వి అని ఎవరో నా పాత టపాలో ఇదే కామెంటు పెట్టారు.

ఈ పుస్తకం ప్లేటో quote "The first and best victory is to conquer self" తో మొదలవుతుంది, ఆలోచనాత్మకంగా ఉంది కదా. I think this is very difficult task. Even our philosophy says the same, I mean, conquering the self is ultimate thing. Irrespective of whatever one does, he will be successful only when he conquers the self :)


~సూర్యుడు (in pursuit of self-discipline) :-)


Sunday, April 10, 2016

ఉగాది శుభాకాంక్షలు

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!

ఈ సంవత్సరమంతా మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ ...


~సూర్యుడు :-)

Sunday, February 21, 2016

ద మార్చింగ్ సీజన్

మొత్తానికి "ద మార్చింగ్ సీజన్" నవల చదవడం పూర్తయ్యింది. ఇది ద మార్క్ ఆఫ్ ఏన్ ఎస్సాసిన్ కన్నా బాగుంది. మైఖేల్ ఆస్బొర్న్ కధానాయకుడిగా ఇది రెండో నవల (ఇప్పటికి వరకు చివరిది కూడా).

డానియల్ సిల్వా నవలలో "ద అన్‌లైక్లీ స్పై" మిగిలింది, చదవడం మొదలుపెట్టాను చూడాలి ఎప్పటికి పూర్తవుతుందో. ద పెర్ఫెక్ట్ మర్డర్ ఇంకా పూర్తికాలేదు :(

బేసిక్‌గా నవలలు చదవడానికి టైం దొరకడం లేద.

సరే మరి, ఇప్పటికింతే సంగతులు :-)

Friday, January 1, 2016

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు!!







Wish You All A Very Happy New Year 2016