Sunday, August 25, 2013

ముచ్చట్లు ...

ఈ మద్య ద లాస్ట్ స్నో అన్న ఓ నవల చదివా, పరమ బోరు, ఓపిక ఉన్నవాళ్ళు ప్రయత్నిచ్చొచ్చు.

పశ్చిమ తీరంలో ఓ జలాంతర్గామి గోవిందా అయ్యింది, ఇప్పుడు తూర్పుతీరంలో చమురుశుద్ధి కర్మాగారంలో పేలుళ్ళు, హేఁవిటో, ఏదో కిరి కిరి ఉందనిపిస్తోంది.

మెడ్రాస్ కెఫె సినేమా చూశాను, గొప్పగాలేకపోయినా బాగానే ఉంది. కొన్ని సీన్లు మ్యూనిక్ నుండి కాపీ కొట్టినట్టనిపించాయి. జాన్ అబ్రహాం బాగా నటించాడు, నర్గీస్ ఫఖ్రి కూడా పర్వాలేదు, ఇంకొంతమంది పేరుతెలియని వాళ్ళు బాగానే చేసారు. రామ్‌గోపాల్ వర్మ లేక మణిరత్నమైతే ఇంకా బాగా (ఎక్కువ ఇంటెన్సిటీతో) తీసేవారేమో అన్పించింది.

ఈ మద్య ఎ బయాస్ ఫర్ యాక్షన్ పుస్తకం చదువుతున్నా, చాలా బాగుంది, ఇంకా ముందు చదివుంటే ఇంకా బాగుండేది (నువ్వు చదవవలసిన పుస్తకం ఓ ఉద్యోగకాలం లేటు :) (విత్ డ్యు క్రెడిట్స్ టు ద అన్‌నోన్))

ద హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ నవల మొదలుపెట్టి చాలా రోజులయ్యింది కాని ఇంకా పూర్తవ్వలేదు, టాం క్లాన్సీ ఈజ్ టూ స్లో ఫర్ మి, ఎనీ వేజ్, దిస్ హ్యాజ్ టు వెయిట్ ఫర్ సం మోర్ టైం.

ద ఉటోపియా ఎక్స్పెరిమెంట్ చదువుదామని తీసా, అదీ అలాగే ఉంది :(

రెండు ప్రాంతాలు విడిపోవడానికి ఇంత గొడవ ఎందుకు జరుగుతోంది, ఇంతకుమునుపు మూడు కొత్త రాష్త్రాలు ఏర్పడినప్పుడు ఇలాంటి గొడవలు ఎందుకు జరగలేదు? ఎందుకు మనము ఇలాంటివి నేర్చుకోలేకపోతున్నాము?

హైదరాబాదులో ఉన్న డబ్బులకోసం కలిసుండాలి అన్నదాంట్లో ఏమైనా అర్ధముందా? డబ్బులే ముఖ్యమైతే అదే కావాలని అడగాలి, దానికోసం కలిసుండక్కర్లేదు కదా :) ఓ ఇరవయ్యేళ్ళపాటు హైదరాబాదుమీద వచ్చే డబ్బుల్లో కొంత వాటా కొత్త ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని అడిగితే సరి :) ఇదేదో భరణం టైపులా అనిపిస్తోందా ;)


~సూర్యుడు :-)


Saturday, August 10, 2013

చెలువములన్నీ చిత్ర రచనలే ...

"చెలువములన్నీ చిత్ర రచనలే" అంటే ఏమిటో తెలిసింది :) Thanks to బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు.

ఈ చరణం మాయా బజార్ లో చూపులు కలసిన శుభవేళ పాటలోది. ఈ చరణాన్ని సరిగ్గా వ్రాసానో లేదో, పాట విన్నప్పుడల్లా అలా వినిపిస్తుంటుంది :)


~సూర్యుడు :-)