Saturday, May 31, 2014

మహా భారత ప్రాశస్త్యం

ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని
యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని
కవివృషభుల్ మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికులితిహాసమనియు
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ
యంబని మహా గొనియాడుచుండ


వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు
డాదిముని పరాశరాత్మజుండు
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండ జేసె భారతంబు