చాలా రోజుల తరవాత మొత్తానికి ట్రినిటీ సిక్స్ నవల చదవడం పూర్తి చేశాను. మొదట్లో
విసుగనిపించినా తర్వాత కొద్దిగా పరవాలేదనిపించింది. ఈ రచయిత నవల్లో లోపమో లేక నా
ఆలోచనా లోపమో తెలియదు కాని నాకు పెద్దగా నచ్చటంలేదు.
కేంబ్రిడ్జి గూఢచారుల గుంపులో, బయటపడని ఆరో వ్యక్తి ఉన్నాడనే ఊహతో వ్రాసిన నవల.
నాకైతే బోళ్ళు రంధ్రాలు కనిపించాయి, నా చదవడం (ఊహా శక్తి) లోనే లోపం
ఉండుంటుంది
ఏదేమైనా ఈ నవలని పూర్తిచేసి ఇదే రచయితది, టైఫూన్ మొదలుపెట్టాను, చూడాలి ఎలా
ఉంటుందో.
డానియల్ సిల్వా క్రొత్త నవల, ది ఆర్డర్ వచ్చింది, కొని చదవాలి.
ఆ మద్య ఎప్పుడో ఓ టపా
ఆసక్తికరమైన ప్రసంగం. అప్పుడు ఆసక్తికరమైన చర్చ అని వ్రాసినట్టు గుర్తు కాని అది YouTube లంకె
అయ్యుంటుంది, ఆ తర్వాత YouTube లంకె కనిపించకుండా పోవడంతో ఇక్కడకూడా కనిపించకుండా
పోయింది. ఇప్పుడు Ted లంకె ఇచ్చాను. వీలైతే చూడండి.
~సూర్యుడు :-)