ఎలాగో ఈ స్పైస్ అఫ్ వార్సా నవల పూర్తి చేసాను. మొదట్లో అంత గొప్పగా అనిపించకపోయినా తర్వాత్తర్వాత ఆసక్తికరంగా అనిపించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం మొదలవటానికి ముందు కథ. ఫ్రాన్స్, పోలాండ్ జెర్మనీను ఎదుర్కోవడానికి (ఒకవేళ యుద్ధం వస్తే, తప్పకుండా వస్తుందన్నది అప్పటి ప్రజల అనుమానం) ఎలా సహాయం చేసింది అన్న ఇతివృత్తం మీద ఆధారపడిన కథ. కొంత మొదటి ప్రపంచ యుద్ధం ప్రస్తావనలుకూడా ఉన్నాయి.
కథ పెద్దగాలేకపోయినా వ్రాసిన విధానం బాగుంది. ఇది చదివిన తర్వాత స్పైస్ అఫ్ బాల్కన్స్ చదువుదామనుకున్నాను కానీ ఎందుకో నైట్ సోల్జర్స్ చదువుదామనిపించింది, చదువుతున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. ఇది అలాన్ ఫర్స్ట్ కు మొదటి నవల అనుకుంటా.
ఇది వ్రాస్తుంటే అనిపించిందేమంటే బ్లాగ్స్పాట్ లో గూగుల్ ట్రాన్స్లిటరేటర్ చాల బాగా మెరుగుపడిందని :-)
గూగుల్ లో ఎడ్ల బండి చక్రం అని వెతికితే ఈ పైనున్న బొమ్మ ఒకటి నేను చూసినవాటికి దగ్గరగా అనిపించి ఇక్కడ పెడుతున్నాను. మీఎవరైనా ఇలాంటి ఎడ్ల బళ్ళు చూశారా? మీకెవరికైనా ఈ చక్రంలో ఉండే వివిధ భాగాలు, వాటి పేర్లు తెలుసా?
~సూర్యుడు :-)