జాసన్ మాత్యుస్ వ్రాసిన క్రెమ్లిన్స్ కాండిడేట్ చదవడం పూర్తయ్యింది . విషాదకర ముగింపు వలన, ముగింపు నచ్చలేదు కాని నిజజీవితంలో అలాగేఉంటుందేమో. నవలలు, ఎఱ్ఱ పిచ్చుక, ప్యాలెస్ ఆఫ్ ట్రీసన్ మరియు క్రేమిన్స్ కాండిడేట్ మూడు నవలలు చాల బాగున్నాయి.
ఈ మధ్య డానియల్ సిల్వా పోట్రైట్ ఆఫ్ ఏఎన్ అన్నోన్ ఉమన్ చదివాను. ఇంతకు ముందు గాబ్రియల్ అలన్ నవలలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంది. బాగానే ఉంది కానీ ఇది స్పై థ్రిల్లర్ కాదు. ఎదో సామెత ఉంది, చేతిలో సుత్తి ఉంటే అన్ని మేకుల్లానే కనిపిస్తాయని, అలాగే, ఎంత నకిలీ చిత్రాలు వెదికే పనైనా, క్రిష్టోఫర్స్ కోర్సికన్ విల్లాలోకూడా నకిలీ చిత్రాలే కనిపిస్తున్నాయంటే చాదస్తం ఎక్కువైందన్నమాట ;)
~సూర్యుడు :-)