డబ్బులుండాలనుకోండి. కానీ పూర్వం ఆ వస్తువెక్కడదొరుకుతుందో తెలియడానికి సమయం పట్టేది. అలాంటివే ఇంకేమైనా ఉన్నాయేమో తెలిసేదికాదు. ఇప్పడలాకాదు, మనకేదైనా కావాలంటే దాని గురించి వెతికామో, దాన్ని కోనేవరకు ఈ ఆన్లైన్ అంగడ్లు వెబ్ లోనూ, మొబైళ్ళలోనూ వెంటబడి కొనిపించేస్తారు.
అదేలాఉన్నా మనక్కావలసిన వస్తువు కొనుక్కోవడం ఇప్పుడు చాలా సులువైంది. అంతేకాదు, అలాంటి వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా అని వెతికి అవన్నీ చూపిస్తాయి. అందులో మనకి నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు. అలాగే మనమేవైనా పుస్తకాలు కొనుక్కుంటే అదే రకమైన పుస్తకాలన్నీ చూపిస్తాయి. ఇందులో మనం అంతకుముందు చూడనివి మంచివి అనిపించిన పుస్తకాలు కొనుక్కోవచ్చు. అదే పుస్తకాల షాపులో అయితే అక్కడున్నవే చూడగలం, వాళ్లకి మనకి నచ్చే విషయాలు తెలియకపోవచ్చు.
కానీ ఇందులో కొంత అనర్థంకూడా ఉంది. ఒక్కోసారి మనకి బయటదొరికే ధరకన్నా ఎక్కువ చూపిస్తాయి. చూసుకొని కొనుక్కోవాలి. అమెజాన్ వాడైతే నువ్వు ఇంతకుముందు కొన్నావనికూడా చెప్తాడు, మనం మర్చిపోయి కొన్నవాటినే మళ్ళీ కొనేయకుండా. బాగుందికదా. నేను ఇంతకుముంది ఇలా కొన్నవే మళ్ళీ మళ్ళీ కొని ...
కొన్నిరోజులకి మనకేం నచ్చుతాయో మనకన్నా ఈ అన్లైన్ అంగడ్లకే ఎక్కువగా తెలుస్తుంది :)
అసలు కిటుకంతా మనకి ఎలా చెప్తే కొంటామో తెలుసుకోవడంలోనే ఉంది. ఎదో సినేమా డైలాగ్ లాగ, I will make an offer that s/he can't refuse అనే టైపులో కన్విన్స్ చేస్తాయి.
ఈ మధ్యకాలంలో మానసికశాస్త్రానికి విలువ బాగా పెరిగింది. ఒకవైపు ఆన్లైన్ అంగడ్లు ఇంకోవైపు సామాజిక ప్రసార మాధ్యమాలు జనాలని ఎలా ప్రభావితం చెయ్యాలని మానసికశాస్త్ర మెళకువలను వాడుకొని ప్రయత్నిస్తున్నాయి.
మీకేమనిపిస్తోంది?
~సూర్యుడు :-)