Sunday, November 11, 2007

సూర్యశక్తి

హమ్మయ్య, మొత్తానికి నాకు కూడ వొక బ్లాగ్ స్పేసు వచ్చేసింది. ఇప్పుడు ఏమిటి వ్రాయాలి, కొద్దిగ ఆలోచించల్సిదే. ఆలోచించడానికేమీలేదు, నా పేరు మీదే రాసేస్తే?

నాకెప్పటినుండో వొక కోరిక, సూర్యశక్తిని ఉపయోగించి ఇంటికి ఏఇర్ కండిషనింగ్ పెట్టించుకొంటే ఎలా ఉంటుందని. అంటే నా ఉద్దేశ్యం, మన డిసెడ్వాంటేజ్ నే ఎడ్వాంటేజ్ గ మార్చుకుంటే ఎలా ఉంటుందని. మన దేశం లో సూర్యశక్తి కి కొదవ లేదు, దాన్ని ఊరికే ఎందుకు వ్రుధా చెయ్యడమని. ఇప్పుడు అక్కడక్కడ సూర్యశక్తి తో వీధి దీపాలు వెలిగిస్తున్నా మనం ఇంకా చాల ఎక్కువగా దీన్ని (సూర్యశక్తిని) ఉపయొగించుకోవచ్చని నా ప్రగాఢాభిప్రాయం.

ఇంకా చాలా వ్రాయాలని ఉంది కాని, సమయాభావం వల్ల ఇక్కడితో ఆపేస్తాను. మళ్ళీ ఇంకోసారి ఈ విషయమ్మీద చర్చించుకుందాం. ఈ మద్యకాలంలో ఈ విషయంపై ఏమైనా అభిప్రాయాలుంటే పంచుకోవలసిందిగా మనవి


మీ భవదీయుడు,

1 comment:

రాధిక said...

మా అత్తగారు వాళ్ళు ఊరిలో కరెంటు బిల్లు లు చూసి విసుగు చెంది చిన్న చిన్న పనుల కోసం[వేడినీటి కోసం,లైట్ల కోసం]సోలార్ వ్యవస్థని పెట్టించుకుందామని అనుకున్నారు.కానీ అది చాలా చాలా డబ్బుతో కూడు కున్న పని అని మరియు అది పెట్టించాలంటే ప్రభుత్వం వారి రకరకాల అనుమతులు తీసుకోవాలని,అదంతా తలనొప్పి వ్యవహారమని వదిలేసారు.మా చుట్టుపక్కల ఊరిలో చాలామందికి ఈ ఆలోచనలు వచ్చినా ఈ తలనొప్పులు భరించలేక ఆదిలోనే ఆలోచనలను తుంచివేసారు.మరి ప్రభుత్వం ప్రజలనయితే జాగృతం చేయగలిగింది గానీ విధానాలను సరళతరం చెయ్యలేకపోయింది. ఈ సోలార్ వ్యవస్థ వైపుగా ప్రభుత్వం,ప్రజలు ఆలోచించగలిగితే దేశం కొంత ముందుకువెళుతుంది.
అన్నట్టు మీ బ్లాగు కూడలిలో లేనట్టుంది.
koodali.org