Saturday, October 18, 2008

ఆలోచనా శైలి

మనమందరం ఒక్కోరకంగా ఆలోచిస్తుంటాము కాని ఒక్కోసారి వేరే వాళ్లు ఏదైనా వ్యక్తీకరించినప్పుడు, నాకూ ఇలానే అనిపించిదనో, లేకపోతే వీళ్లుకూడా మనలాగే ఆలోచిస్తున్నారనో అనిపిస్తుంటుంది. అలా తరచుగా అనిపిస్తే, వారి వారి ఆలోచనా శైలులు ఒకరకంగా ఉన్నాయనుకోవచ్చేమో. ఇలా ఒకేరకమైన ఆలోచనా విధానం ఉన్నవాళ్లు కలసి పనిచేయడానికి బాగుంటుంది కాని, అంత ఉపయోగకరమైనది కాకపోవచ్చు, ఎందుకంటే, ఆ రకమైన ఆలోచనలో ఉండే తప్పొప్పులు కనిపెట్టడం కష్టం కావచ్చు. అందుకే బహుళజాతీయ సంస్థలలో భిన్నత్వం ముఖ్యమైనదిగా భావిస్తారు (అందుకు వేరే కారణాలు కూడా ఉంటే ఉండొచ్చుగాక). మరిలా వేరు వేరు ఆలోచనా విధానం కలవారు ఎలా కలిసి పని చేయగలరనేది ఓ ప్రశ్న, వైరుధ్యాలు తలెత్తుతుంటాయి కాని వాటిని పరిష్కరించాల్సిన భాద్యత పై అధికారుల పైన ఉంటుంది.

ఇలానే ఒక్కోసారి సమావేశాల్లో, ఎవరైనా ఏదైనా వివరిస్తున్నప్పుడో, ఏదైనా ప్రశ్న అడిగినప్పుడో, అది అందరికీ ఒకే రకంగా అర్ధమవ్వదు. కొంతమందికి అది వెంటనే అర్ధమయ్యి, అడిగినదానికి సరిగ్గా సమాధానాలు చెప్తారు, కొంతమందికి మళ్లీ విడమర్చి చెప్తేకాని అర్ధం కాదు. ఎందుకిలా జరుగుతుంటుంది?

No comments: