మనిషి కి చిన్నప్పటినుండీ నేర్చుకోవడం తెలియకుండా వచ్చేస్తుంది. చిన్నప్పుడు
పిల్లలు (బాగా నిశిత పరిశీలనతో) అనుకరించి నేర్చుకుంటారు, పాఠశాలల్లో కి వెళ్లడం
మొదలుపెట్టిన తర్వాత, చెప్పింది విని, చూసి, తమంత తాముగా చేసి నేర్చుకుంటుంటారు.
అయితే ఎవరు ఎలా నేర్చుకుంటే బాగా నేర్చుకో గలుగుతారనేది తెలుసుకోవడం కొద్దిగా
కష్టమైన విషయం.
ఈ మధ్యనే Peter F. Drucker గారి పుస్తకమేదో చదువుతుంటే,
అందులో ఆయనంటారు, అందరు ఒకలాగ నేర్చుకోరు, ఒక్కొక్కరు ఒక్కోరకంగా నేర్చుకుంటారని.
దీనికి ఆయనేవో ఉదాహరణలిచ్చారు. నాకూ దీనిమీద ఎప్పటినుండో సంశయముండేది, నాకైతే ఏదైనా
చదివితే బాగా అర్ధమవుతుంది, చెప్తున్నప్పుడు వింటే అంత బాగా అర్ధం కాదు. ఎవరైనా
ఏదైనా చెప్తుంటే నా ఆలోచన్లు, ఏదో ఓ అంశం దగ్గర ఆగిపోతాయి, తర్వాత చెప్పేవారు
చెప్పుకుపోయినా, అవి నా చెవుల్లో పడే అవకాశం తక్కువ ;)
పిల్లలు
పాఠశాలల్లో సరిగ్గా చదువుకోలేకపోతున్నటైతే, వాళ్లు ఎలా నేర్చుకుంటే బాగా
నేర్చుకోగలుగుతారో ఎలా కనిపెట్టడం? సాధారణంగా, పాఠశాలల్లో తరగతుల్ని ఎలా
వర్గీకరిస్తారంటే, బాగా చదివే వాళ్లని మొదటి Section లో పెట్టి, ఆఖరువాళ్లని ఆఖరు
Section లో పడేస్తారు, ఇలా కాకుండా, వారి వారి నేర్చుకునే పద్దతుల్ని బట్టి వారిని
వేరు వేరు sections క్రింద విడకొడితే, వాళ్లకి చదువు నేర్పించేటప్పుడు, వాళ్ల వాళ్ల
నేర్చుకునే గుణాలకనుకూలంగా నేర్పిస్తే వారికి బాగా ఉపయోగకరమేమో అని నా
అభిప్రాయం.
~సూర్యుడు :-)
1 comment:
nice thought
Post a Comment