తెలుగులో ఆలోచించండి « Rayraj Reviews
పై బ్లాగులో రేరాజు గారు ఆలోచన్లు, తెలుగు భాష మీద ఓ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. నావి కూడా ఇంచుమించుగా అవే ఆలోచన్లు కాని కాని కొంతమంది ఆలోచన్లకి భాషేంటి, అలోచన్లు భాషకంటే పురాతనమైనవి అని, అంటే భాషలేనప్పుడు, మానవుడు ఆలోచించాడు కాబట్టి ఆలోచన్లకి భాషేంటి అన్నారు.
నా అభిప్రాయం:
ఆలోచన్లకి భాషుంటుంది. ఉదాహరణకి, ఆ వ్యాఖ్యలు చదవంగానే నాకు ఆలోచన్లు ఇలా వచ్చాయి, "అదేంటి ఆలోచన్లుకి భాషలేదంటారు, నేను రోజూ ఇంటినుండి ఆఫీసుకి, ఆఫీసునుండి ఇంటికి వెళ్లేటప్పుడు, ఏదో ఒక భాషలోనే ఆలోచిస్తుంటాను కదా అని" ఇవి నా యధాతధ ఆలోచన్లు. ఆలోచించే విషయాన్ని బట్టి, సందర్బాన్ని బట్టి, ఆలోచన్ల భాష మారిపోతుంటుంది :-)
వేరే సందర్బంలో చెప్పినా ఎవరో కవిగారిలా అన్నారు : "మనసుమూగదేకాని బాసుంటది దానికి ..." అని ;)
ఎవరో పార్లమెంటులో ఎప్పుడో నెహ్రూ గారిని విమర్శిస్తూ ఇలా అన్నారుట, "నెహ్రూ గారు కలలుకూడా ఇంగ్లీషులోనే కంటారని" (మళ్లీ గాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించకండి ;)). అంటే సబ్కాన్షియస్ మైండ్‌కికూడా ఓ భాషుంటుంది. నెహ్రూ గారి (అన్నట్లు ఈ మధ్యనే నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియా కొన్నాను, సమయం చూసుకుని చదవాలి) సంగతెలాఉన్నా, మా చిన్నమ్మమ్మగారు టాటా (జెంషెడ్పూర్)లో స్థిరపడి అప్పుడప్పుడు మాఇంటికొచ్చినప్పుడు రాత్రుళ్లు హిందీలో పలవరించేవారు :-)
నా ఉద్దేశ్యంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ కి, మన నాచురల్ లాంగ్వేజస్ కి పెద్దగా తేడాలేదు. ఒకటి కంప్యూటర్‌కి అర్ధమవ్వడంకోసమైతే ఇంకొకటి మనుషులకర్ధమవ్వడానికి.
మరి, కంప్యూటర్ లాంగ్వేజస్‌ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుంటారు, అలాగే ఇంగ్లీష్‌నికూడా, నిన్ననే ఎవరో చెప్పారు, ఇప్పుడు హిందీ "అచ్చా" ని ఇంగ్లీష్ పదంకింద ఏదో డిక్షనరీలో కలిపారని (గూగుల్లో వెతికా కాని దొరకలేదు). అలా తెలుగునెప్పుడైనా ఆధునీకరించారా? ఏమైనా క్రొత్త తెలుగు పదాలు జతచేస్తున్నారా?
కొన్ని శంకలు:
మాఁవ సరైనదా లేక మావఁ సరైనదా? అలాగే సీఁవ లేక సీవఁ? అరసున్న ప్రావీణ్యులెవరైనా కొద్దిగ సరిచేస్తారా?
మొత్తానికి వాతావరణశాఖవారు చెప్పినట్లు ఋతుపవనాలు బెంగళూరులోకి ప్రవేసించాయి :-) చెట్లన్నీ (మాఇంట్లో చెట్లు, నేనుకూడా అనుకోండి) మోదంతో ఋతుపవనాల్ని ఆహ్వానించేశాయి :-)
~సూర్యుడు :-)

No comments:
Post a Comment