గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనమెంత హననీయమైన (vulnerable, ref:http://www.aksharamala.com/telugu/e2t/search.php) స్థితిలోనున్నామో అర్ధమౌతుంది. చాలా బ్లాగుల్లో ఎవరో మనల్ని విడదీసేస్తున్నారని గొడవపెడుతున్నారు, కొద్దిగా నిదానించి ఆలోచిస్తే అర్ధమఔతుంది మనల్నెవరూ విడదీయక్కర్లేదని, మన మనసులు ఇప్పటికే ముక్కలయ్యాయని :(
ఈ మధ్యనే మూడు క్రొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఏమాత్రం గొడవలు లేకుండా, మనం మటుకు అలా ఉండలేమా? నా ఉద్దేశ్యంలో వాళ్లు తెలివైన వాళ్లు. వాళ్లు రాష్ట్రాలుగా విడిపోయినా మానసికంగా కలిసే ఉన్నారు, మనం ఒకే రాష్ట్రంగా కలిసున్నా, మానసికంగా విడిపోయి, ఏహ్యభావాలతో ఉన్నాము. ఒక ప్రాంతం వాళ్లంటే వేరొకరికి గౌరవంలేదు, అభిమానం అంతకంటే లేదు. విచిత్రమేమంటే, స్వార్ధపరులైన రాజకీయనాయకుల చేతుల్లో సామాన్యప్రజలు కీలు బొమ్మలు. ఇలాంటి సున్నితమైన అంశాలను తీసుకుని ప్రజల ఉద్వేగాలతో ఆడుకుంటున్నారు.
విచిత్రమేంటంటే ఈ విషయాలు అందరికీ తెలిసినా ఉద్వేగం ముందు తర్కం నిలవదు కదా, ఎంత విచారకరమైన పరిస్థితి :-(
~సూర్యుడు
1 comment:
ఏమనుకున్నా లాభం లేదు ఈ రాజకీయ నాటకాలు అందరికి తెలిసినా వారినే అనుసరరించి రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటున్నాము. మన ప్రజలకు ఆలోచించే శక్తి ఉన్నా అది ఉపయోగించరు.
Post a Comment