గూగుల్ కళ్లజోడు గురించి తెలియకపోతే ఓ సారి ఇక్కడ చూడండి. కొన్నిరోజుల క్రితం GNOME ఆర్ట్ వర్క్ నుండి కొన్ని వాల్‌పేపర్లు డౌన్‌లోడ్ చేసుకుంటుంటే ఓ కొండ (కొండేనా?) బొమ్మ దొరికింది కాని అదెక్కడిదో దాని విశేషాలేమిటో తెలీలేదు, బ్లాగు జనాభాని అడిగినా సమాధానం లేదు. కాని గూగుల్ కళ్లజోడు లాంటి ఫీచర్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ గా దొరికితే, ఏ జెపిజి లాంటి బొమ్మలమీద రైట్ క్లిక్ చేసి దీని చరిత్ర చెప్పు అంటే చెప్పేలా ఉంటే ఎలా ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది, కదా? :)
అలాగే, సెమాంటిక్ వెబ్ కాన్సెప్ట్ పూర్తై, మనకి ఏది కావాలో మరింత సులువుగా వెతుక్కునేట్టు ఉంటే, ఎలాగంటే, మాయల ఫకీర్ ఏదో అద్దం దగ్గర నిల్చుని ఈ ప్రపంచంలోకెల్లా అందమైన రాజకుమారిని చూపించు అంటే చూపించినట్టు, గూగుల్ సెర్చ్ బార్‌లో, ప్రపంచంలో అందమైన అమ్మాయిని చూపించు అంటే, మాయల ఫకీర్ కి కనిపించినట్టు ఒక భారతీయ అమ్మాయిలే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరికన్న అందమైన అమ్మాయి బొమ్మ చూపిస్తే ఎలా ఉంటుంది, మస్త్ కదా :)
సరే ఇవన్నీ ఎప్పుడొస్తాయో, నా కొండ బొమ్మ ఎక్కడిదో ఇప్పటిదాకా తెలియలేదు :-(
1 comment:
I posted the information on the image in your previous post. Hope that helped.
Post a Comment