నాకెందుకో డప్పు వాయిద్యమంటే భలే ఇష్టం. దాని రిథమిక్ శబ్దం అంటే చాలా ఇష్టం. నాకు
అ వాయిద్యంలో ఉండే సంగీత వివరాలు తెలీవనుకోండి. ప్రస్తుత నా గొడవేంటంటే, డప్పు
శబ్దాన్ని అక్షరాల్లో ఎలా పెట్టాలి అని. అంటే సంగీతకారుల సింబాలిక్ లాంగ్వేజ్‌లో
కాదు, మామూలు, తెలుగు పదాలతో డప్పు శబ్దాన్ని ఎలా వ్యక్తపరచాలని. ఉదాహరణకి, డడ్డనక
డడ్డనక డణ్, ఇలా అనుకోండి, అది చదువుతుంటే మన చెవుల్లో ఆ డప్పు శబ్దం హోరు
వినిపించాలి, అదెలా?
2 comments:
డప్పు అన్నది రకరకాల సంధర్భాల్లో వాడతారు కనుక.. ఉదా: పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఆఖరుకి శవయాత్ర. ఒక్క విధంగా ఆ స్వరాన్ని చెప్పలేమేమోనండి. నిజానికి, మీ ప్రశ్నకి ముందుగా గుర్తుకి వచ్చింది డప్పు వాయిద్యం స్త్రీ కొడుతుంటే, కొరడాతో కొట్టుకుంటూ, బీభత్సంగా కనపడే ఒక రకపు కళాకారుడు. అలాగే డప్పు హోరుకి తగ్గట్లు తీగె మీద అడుగులు వేసే దొమ్మరాటగాళ్ళు [ఎక్కువగా స్త్రీలు]. ఇంకా వెనక్కి పోతే పల్లెటూర్లలో పంచాయితీ వార్తలు డప్పుతో దండోరా వేసి మరీ చెప్పేవారు. గుళ్ళలో, వేడుకల్లో, ఊరేగింపుల్లో.. కనుక "డుం డుం డుం" "డిమ్, డమ్, ఢమ్, ఢిమ్" "డూ డూ డూ" "ఢమా ఢమ్ ఢమా డండం" "జజ్జనకరి జనారే" గట్రా ఎన్నో! :)
@ఉష:
:-)
మీరు చెప్పినట్టు డప్పు రకరకాల సందర్బాల్లో వాడతారు కాని, నాకు నచ్చేది వేడుకల్లో వాయించేదే :)
సరే, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం ...
~సూర్యుడు :-)
Post a Comment