అక్కడనుండి చిక్కమగళూరు మీదుగా పశ్చిమకనుమలలోకి బయలుదేరాము. దారికిరువైపులా కొబ్బరి తోటలు, పోక తోటలు భలేఉన్నాయి. ఇంకొంచం ముందుకెళ్లేసరికి దట్టమైన అడవి మొదలయ్యింది. దారి అస్సలు బాగోలేదు. ముందు బాబా బుడాన్‌గిరి వెళ్లి అక్కడనుండి కెమ్మనగుండి వెళ్లాము.
నిజానికి ఈ దారి కొద్దిగా చుట్టూ తిరిగి అయినా ఇవన్నీ చూసుకుంటూ వెళ్లాము కాబట్టి పెద్దగా విసుగనిపించలేదు. కెమ్మనగుండి వెళ్లేసరికి చీకటిపడింది, అక్కడే కృష్ణ రాజేంద్ర వసతిగృహంలో బసచేసి
మర్నాడు ఉదయం హెబ్బె జలపాతాన్ని చూడ్డానికి వెళ్లాము, ఆ దారి చాలా దారుణంగా ఉంది,
వెళ్తే నడిచి వెళ్లాలి లేదా జీపులో వెళ్లాలి, వేరే రకంగా వెళ్లే అవకాశమే లేదు.
అది 13 kms దూరమేకాని, ఓ నలభై కి.మీ దూరంలా అనిపించింది :)
బాబా బుడాన్‌గిరి, కెమ్మనగుండి ప్రదేశాల్లో, కాఫీ, మిరియాలు, ఏలకులు, వెనీలా, వక్కలు, అల్లం బాగా పండిస్తారు.
No comments:
Post a Comment