Thursday, July 21, 2011

సహాయం చెయ్యగలరా?

ఆ మధ్య, అంటే ఎప్పుడో ఓ రెండు, మూడేళ్ల క్రితమైయ్యుంటుంది. ఏదో సోమాలియా కథలో అనో ఏదో ఓ కథ చదివా ఇక్కడ బ్లాగుల్లో, ఓ తండ్రి తన కొడుక్కి మనమేంచేసినా ప్రజలేదో ఒకటి అంటూనే ఉంటారనే విషయాన్ని ఎలా తెలియచెప్పాడో అనేది ఆ కథ. అది ఏ బ్లాగో, ఏ పొస్టో కొద్దిగా చెప్తారా?

~సూర్యుడు

6 comments:

Anonymous said...

నాకు తెలిసిన కధ చెబుతానండి. ..

ఒక పెద్ద వయసు తండ్రీ, ఒక చిన్న వయసు కొడుకు, ఒక ముసలి గుర్రం తమ దారిన తాము రహదారిలో వెళ్తుండగా..................

( గుర్రం బలహీనంగా ఉందని దాని పైన ఎవరూ కూర్చోరు .) ..................

ఈ దృశ్యాన్ని చూసి దారిన పొయ్యే దానయ్యలు నవ్వుతారు. గుర్రం ఉండగా నడిచివెళ్తున్నారు . ఎంత వెర్రివాళ్ళు ? అని ...............

అప్పుడు తండ్రి తన కొడుకును గుర్రం మీద కూర్చోపెడతాడు..........

అప్పుడేమో ఆ జనాలు ఏమంటారంటే, ఆ కొడుకు ఎంత పొగరుబోతో చూడండి. తండ్రిని ఈ పెద్దవయసులో అలా నడిపిస్తూ తాను మాత్రం దర్జాగా గుర్రంపైన కూర్చున్నాడు. అని నవ్వుతారు. ....................

ఇప్పుడు కొడుకు గుర్రం దిగి తండ్రిని ఎక్కమంటాడు................

అది చూసిన జనాలు ఏమంటారంటే, ఆ తండ్రిని చూడండి. చిన్న పిల్లవాడన్న జాలి లేకుండా వాడిని నడిపిస్తూ తాను గుర్రంపైన కూర్చున్నాడు. ఎంత దయలేని తండ్రి అంటారు.................

లోకరీతి ఇలా కూడా ఉంటుంది. .....

Anonymous said...

ఈ గోల భరించలేక తండ్రి ,కొడుకు గుర్రాన్ని అధిరోహిస్తారు.

అది చూసిన జనాలు వీళ్ళకు అస్సలు దయ లేదు. ఆ బక్క గుర్రం మీద అంత బరువు గల ఇద్దరు ఎక్కి వెళ్తున్నారు. అంటారు.

ఆ బరువు మొయ్యలేక గుర్రం చచ్చి ఊరుకుంటుంది.

అప్పుడు, తండ్రీ,కొడుకు వెర్రి మొహాలు వేస్కొని చూస్తుండగా జనాలు వాళ్ళను నోటికొచ్చినట్లు తిడతారు.

ఇదీ ముగింపు. ఇందాక రాయటం మర్చిపోయానండి..

Anonymous said...

ముగింపు బాగో లేదు. నే చెప్తా..

గుర్రం చచ్చేదానికి ముందు, తండ్రీకొడుకులు దిగి, గుర్రాన్ని తలోవైపూ భుజాల మీద వేసుకుని మోసుకెళుతూ వుంటే జనాలు అహా ఎంత భూతదయ అని మెచ్చుకుంటారు. కాని గుర్రం నను కిందికి దింపండి మొర్రో అని భాధతో సకిలించి, ఇహ తట్టుకోలేక చనిపోతుంది. అప్పుడు గుర్రాన్ని పొట్టనబెట్టుకున్నారు కదా అని జనాలు కర్రలతో తండ్రీకొడుకుల వెంట బడతారు. :))

Anonymous said...

ముగింపు బాగో లేదు. నే చెప్తా..
గుర్రం చచ్చేదానికి ముందు, తండ్రీకొడుకులు దిగి, గుర్రాన్ని తలోవైపూ భుజాల మీద వేసుకుని మోసుకెళుతూ వుంటే జనాలు అహా ఎంత భూతదయ అని మెచ్చుకుంటారు.

భూత దయ కోణం నుంచి చూస్తే మీరు ఇచ్చిన ముగింపు బ్రహ్మాండంగా ఉంది.

కానీ గుర్రాలను కొనుక్కునేది ........ వాటిని మనుష్యులు మొయ్యటానికి కాదేమో ! పోనీలెండి గుర్రం బక్కగా ఉంది కాబట్టి ఫరవాలేదు జాలి చూపించాలి. . కానీ చూసే జనాలు ఊరుకోరుగదా ! అప్పుడు ఏమంటారో ?.

Anonymous said...

పై కామెంట్ ను నేను హడావిడిగా బయటకు వెళ్ళేముందు రాశాను. అందువల్లనేమో నా భావాలను సరిగ్గా చెప్పలేకపోయానండి. తరువాత తీరిగ్గా చదివితే ..... పోసిటివ్ గా చెప్పబోయిన వ్యాఖ్యకు నెగిటివ్ టచ్ వచ్చిందేమో అనిపించింది. నా వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించమని కోరుతున్నానండి..ఇన్ని వ్యాఖ్యలు రాస్తున్నందుకు తప్పుగా అనుకోవద్దని బ్లాగ్ వారిని కోరుకుంటున్నాను..

సూర్యుడు said...

Thanks to all :). I vaguely remember the story. Now, I get to know some new touches to this story :)

I thought someone will point me to the original post.

Regds,
~సూర్యుడు