ఈ మధ్య నేనో మూడు నవలలు చదివా, The Matarese Circle, The Matarese
Countdown మరియు The Cobra. మొదటి రెండు, Ludlum మార్కు నవలలు,
చదువుతున్నంతసేపు బాగుంటాయి, గుర్తుపెట్టుకోడానికేమీ ఉండదు. ద కోబ్రా,
ఫోర్సిత్ క్రొత్త నవల. డ్రగ్ వ్యాపారం మీద ఓ మాదిరి పరిశోధన చేసి
వ్రాసినట్లనిపించింది. అమెరికా అద్యక్షుడు ఓ సంఘటన వల్ల, మొత్తం కొకైన్ వ్యాపారాన్నే నాశనం చెయ్యాలని ఓ పాత సి.ఐ.ఎ ఏజెంటుని అడుగుతాడు, దానికి అతను (పాల్, ద కోబ్రా) కొన్ని నిబందనలు పెట్టి ఒప్పుకుంటాడు
ఇందులో ఓ డైలాగుంటుంది, "ఐ యాం డిమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ డెలిబరేట్ డిస్‌ఇన్ఫర్మేషన్" అని.
ఇందులో ఓ డైలాగుంటుంది, "ఐ యాం డిమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ డెలిబరేట్ డిస్‌ఇన్ఫర్మేషన్" అని.
No comments:
Post a Comment