Friday, July 17, 2015

గాబ్రియల్ అలన్ రెండో సారి

మాస్కో రూల్స్, ద డిఫెక్టర్ చదవడం పూర్తయ్యాయి, రెండు నవలలు చాలా బాగున్నాయి. మొదట్లో మాస్కో రూల్స్ నచ్చకపోయినా, కొద్దిగ మొందుకెళ్ళిన తర్వాత చాలా బాగుంది. ద డిఫెక్టర్ కూడ చాలా బాగుంది. ఫ్రస్తుతం The Rembrandt Affair చదువుతున్నాను, ఇదికూడా బాగానే ఉంది, ఇప్పటిదాకా.

ఇంతకు ముందు వ్రాసినట్లు, ఈ నవలలు చదువుతుంటే, మధుబాబు, షాడో నవలలు కొద్దికొద్దిగ గుర్తుకొస్తుంటాయి, సరే పాత్రల బిహేవియర్‌లలో చాలా తేడాలున్నాయనుకోండి. గాబ్రియల్ అలన్, అరి షమ్రన్, ఎలి లావన్, ఛియారా, యుజి నావట్ (ఈ పేర్లు ఎలా పలకాలో సరిగ్గా తెలీదు), దినా, రిమోనా, యాకోవ్, మిఖాయిల్, అలన్ కార్టర్, గ్రహమ్ సేయ్మర్ పాత్రలన్నీ బాగా పరిచయమైన వాళ్ళలా అనిపిస్తారు (మధుబాబు నవలల్లో, గంగారాం, కులకర్ణి, బిందు, ముఖేష్, శ్రీకర్, వాసు, చంద్ర, సులోచన, బెట్టీ ల్లా).


మీకెవరికైనా పత్తేదారు సాహిత్యమంటే మక్కువుంటే ఈ నవలలు చదివి, మీ అభిప్రాయాల్ని పంచుకోండి :)


No comments: