Showing posts with label ఆలోచనలు. Show all posts
Showing posts with label ఆలోచనలు. Show all posts

Sunday, November 17, 2019

ఆలోచనలు - నాణ్యమైన పని

ఇదేమి కొత్తగా కనిపెట్టిందేమీకాదు, అందరికి తెలిసిందే. పూర్వం జరిగిన పనులు అంటే కట్టడాలు, అవేమైనా అయ్యుండొచ్చు, నదులమీద వంతెనలు, ఆనకట్టలు, గుడులు, గోపురాలు. అవి ఎన్నిరోజులు నిలిచిఉన్నాయంటే మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కడుతున్న కట్టడాలు ఎన్నిరోజులు నిలబడతాయో చెప్పడం కష్టం, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. దీనికి ప్రధానకారణం పనిలో నాణ్యత లోపించడం. ఏరంగంలో చూసినా పాత తరంకన్నా కొత్తతరం పనితనంతో వెనకపడుతున్నారేమో అనిపిస్తుంది, చేతకాక కాదు, నాణ్యతమీద శ్రద్ధలేక. ఈమాత్రం చాల్లే అనే నిర్లక్ష్యం వల్ల.

బెంగళూరులో ఓ పది సంవత్సరాల క్రితం కట్టిన మెట్రో అప్పుడే బీటలువారుతొంది అంటున్నారు, కారణాలు ఏవైనా కావచ్చు. అలాగే ఓ ఫ్లఐఓవర్ వంతెన కట్టి ఐదుసంవత్సరాలైనా కాకుండా సిమెంట్ అంతా ఊడిపోయి జల్లెడలా తయారైంది. ఇలాంటి ఉదాహరణలు మనదేశంలో బోళ్ళన్ని. కడుతూకడుతుండగానే కూలిపోయినవే బోళ్ళున్నాయి. మరి రహదారుల సంగతి చెప్పనక్కర్లేదు, వేసివెయ్యంగానే తవ్వేసేవారు కొందరు, వర్షాలు గట్టిగా పడితే కొట్టుకుపోయేవి కొన్ని. ఎంత పెద్ద ఊరైనా గతుకులులేని రహదారులు కనపడటం కష్టం.

ఇప్పుడు కొత్తగా వృద్ధిచెందుతున్న software రంగంలో కూడా అభివృద్ధి చేసే ఉత్పత్తిలో నాణ్యత అంతంత మాత్రమే.

ఏపనిలోనైనా నాణ్యత లోపిస్తే జరిగేది ఆర్ధిక నష్టం, కాల నష్టం. చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మరి కొత్తపనులెప్పుడు చేస్తాం, కదా?

ఈ విషయంలో నా అభిప్రాయమేమంటే, దేశవ్యాప్తంగా చేసేపనిలో నాణ్యత పెంచాలనే ఆలోచన ఒక ఉద్యమంలా వస్తేతప్ప నాణ్యతలో మార్పు రాదని. ఒక దేశం అభివృద్ధి పధంలో ముందుకు వెళ్లాలంటే చేసే పనుల్లో నాణ్యత చాలా ముఖ్యమని నాఉద్దేశ్యం. మీరేమంటారు?

~సూర్యుడు :-)

Wednesday, October 2, 2019

నదులు - నీళ్ళు - సముద్రాలు - 3

వర్షాలు విపరీతంగా పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక సమస్యగా అనిపించకపోవచ్చు కానీ నదుల్లో నీళ్లు తగ్గిపోతున్నాయనే విషయం మాత్రం నిజం. ఈ క్రింద 'చిత్రాలు' (శ్లేషింటెండెడ్ ) చూడండి, మీకిదేమైనా నది అనిపిస్తోందా




~సూర్యుడు


Saturday, February 16, 2019

నదులు - నీళ్ళు - సముద్రాలు - 2

కృష్ణా నది :




గోదావరి నది:




Sunday, January 13, 2019

నదులు - నీళ్ళు - సముద్రాలు

ఈమద్య అటుఇటు తిరుగుతున్నప్పుడు గమనించిందేమంటే మన నదుల్లో నీళ్ళు తగ్గిపోతున్నాయి. పూర్వం రైల్లో వెళ్తుంటే గోదావరిలో బోళ్ళు నీళ్లుండేవి, అలాగే ఇంచుమించుగా కృష్ణాలో కూడా. ఇప్పుడు ఈ నదుల్లో, అంటే రైలు వంతెనల క్రింద నీళ్లు పారడంలేదు, మహా అయితే కొన్ని నీటి గుంటలు / మడుగులు. ఒక కారణం వర్షాలు తగ్గడం కావచ్చు లేదా ఆనకట్టల వల్ల నీళ్లు అంతకుముందే ఎక్కడో నిలువచేయబడివుండొచ్చు. ఇందువల్ల మనం నదుల నీటిని బాగా ఉపయోగించుకుంటున్నామేమో కాని ప్రకృతిసిద్ధమైన నదులు, సముద్రాలు, వర్షాల క్రమాన్ని దెబ్బతీస్తున్నామేమో అనిపిస్తోంది. కాల క్రమేణా వర్షాలు తగ్గిపోతున్నాయి. నీటి వనరులు తగ్గుతున్నాయి. ఇలాగే ఇంకొన్నాళ్ళు జరిగితే పర్యావరణమెలా (పర్యవసానం కూడా) ఉంటుందో :(

~సూర్యుడు

Sunday, August 28, 2016

ఆలోచనలు - 2

ఓ ఐదు సంవత్సరాల క్రిందట ఈ టపా వ్రాసాను. ఎందుకు కొంతమంది విజయాలను సాధిస్తారు ఇంకొంతమంది ఎక్కువ విజయాలు సాధించలేక వెనకపడతారు అని. ఈ మధ్య ఓ పుస్తకం చదివాను, No Excuses! by Brian Tracy. ఈ పుస్తకం కూడా ఇదే ఆలోచన గురించి . ఈ పుస్తకానికి మూలాధారమైన విషయమేమంటే, క్రమశిక్షణ (the subtitle of the book, The power of self-discipline) . తేజస్వి అని ఎవరో నా పాత టపాలో ఇదే కామెంటు పెట్టారు.

ఈ పుస్తకం ప్లేటో quote "The first and best victory is to conquer self" తో మొదలవుతుంది, ఆలోచనాత్మకంగా ఉంది కదా. I think this is very difficult task. Even our philosophy says the same, I mean, conquering the self is ultimate thing. Irrespective of whatever one does, he will be successful only when he conquers the self :)


~సూర్యుడు (in pursuit of self-discipline) :-)


Sunday, October 13, 2013

మనిషి మనసు

మనసు

మనసు అంటే ఏంటో? మనసు మీద మన తెలుగు సినేమాల్లో బోల్డు పాటలున్నాయి (మన'సుకవి' గారి ధర్మమా అని). మిగిలిన పాటలన్నీ ఎలాఉన్నా బాలమురళీకృష్ణ గారు పాడిన "మౌనమె నీ భాష ఓ మూగ మనసా" (సరే ఈ పాట ఎవరు వ్రాసారో తెలీదు) పాట భలే అనిపిస్తుంది, అంటే మనసుని చాల చక్కగ వర్ణించిందేమో అనిపిస్తుంది. అది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మా స్నేహిడొకడనేవాడు, డాగ్ బిజీ అని, అంటే ఏమిటంటే, కుక్కకి పని ఉన్నా లేకున్నా ఎప్పుడూ పరిగెట్టి వెళ్తుంటుంది అని :-) అలాగే అవసరమున్నా లేకున్నా, మనసు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ఎందుకో ?

ఉదాహరణకి, తెలంగాణా వస్తుందా? రాదా? (వచ్చినా, రాకపోయినా తనకి పెద్దగా తేడాఏమీ లేకపోవచ్చు, కాని మనసు ఊరుకోదు), ఇండియా ఈసారి ఆస్ట్రేలియా మీద (క్రికెట్టులో) గెలుస్తుందా? గెలవదా?, మనకి తేడా ఏమైనా ఉంటుందా, ఏమీలేదు అయినా సరే, మనసు ఊరుకోదు.

పూర్వం, అంటే ఇంటర్నెట్ లేని అజ్ఞానంధకార యుగంలో వార్తా పత్రికల్లో ఏదైనా వార్త చదివినప్పుడు, నచ్చకపోతే (అంటే, మనసుకు నచ్చకపోతే అని తీసుకోవాలి) ఆ పేపర్‌వాడిని కొంత తిట్టుకొని ఊరుకునేవాళ్ళం, ఇప్పుడలాకాదు, మన బ్లాగుల్లోనో, ఫేసుబుక్కుల్లోనో, ఆ పేపర్‌వాడి (లేకపోతే న్యూస్ చానెల్ వాడి) తాట తీస్తాం కదా. కాని అదే వార్త వేరొకరికి చాల సంతోషంగా అనిపించొచ్చు, అంటే ఏదైనా సరే ప్రపంచంలో కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని కాని నచ్చకూడదనికాని లేదు మరి అలాంటప్పుడు నచ్చనివాటిమీదపడి చావకొట్టాల్సిన అవసరముందంటారా?

కన్యాశుల్కం‌లో కరకట శాస్త్రి శిష్యుడు ఏదో తెలుగు పద్యం/కవిత్వం చదివి (ఆ పద్యంలో కవిగారికి ఏదో పువ్వు ఇష్టం లేదని వర్ణన) వళ్ళు మండి, మా గురువుగారికి దొండకాయలంటే ఇష్టం ఉండదు కాని ఇంట్లో దొండపాదుందని వాళ్ళావిడ రోజూ దొండకాయ కూరే చేస్తారు, బ్రతికిన వాళ్ళిష్టాఇష్టాలే ఇలా ఏడుస్తుంటే చచ్చిన వాళ్ళిష్టాఇష్టాలతో ఏమిపని అని అనుకుంటాడు. అసలు సంగతేంటంటే, మనకు నచ్చనివి కనిపించినప్పుడల్లా, మన అభిప్రాయాల్ని చెప్పేయాలా? ఈ భూపెపంచకమ్మీద మనకి నచ్చనవి బొచ్చెడుంటాయి, వాటన్నిటినీ ఎంతకన్న వ్యతిరేకిస్తూ మన అభిప్రాయాల్ని వ్యక్తీకరించగలుగుతాం? కాని మనసు మాత్రం రగిలిపోతుంటుంది, అదీ సంగతి, దీనివల్ల రక్తపోటు పెరుగుతుందేమో కాని ప్రపంచమేమీ మారిపోదుకదా మనకోసం.

అందువల్ల నేచెప్పొచ్చేదేంటంటే, ఊరుకున్నంత ఉత్తమం లేదు; బోడిగుండంత సుఖం లేదు అని :)

ఈమద్య బ్లాగులు చదివి ఉండబట్ట/ఊరుకోలేక ఇలా ఇక్కడ, మీరుకూడా ఇది చదివింతర్వాత మామూలుగ మీకు నచ్చనివాటిని ఉతికారేసే కార్యక్రమంలో ఉంటారని ఆశిస్తూ ... ;)

~సూర్యుడు :-)

Saturday, September 8, 2012

ఆర్టీసీ బస్సులో ప్రయాణం ...

మీరెప్పుడైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని చూశారా/చదివారా?

 నేనీమద్య రోజూ చూస్తున్నాను, ఆఫీసుకెళ్ళే త్రోవలో ఎదో ఒక ఎపియస్ ఆర్టిసి బస్సు వెనకాల పడి.

ఆర్టిసి బస్సులో ప్రయాణం సురక్షితం అంటే సరే, 98% ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఈమద్య ఆర్టిసి బస్సుల ప్రమాదాల శాతం తక్కువగా ఉంటోంది కాబట్టి. సుఖమయం అంటే ఎంతవరకు ఒప్పుకోవచ్చో తెలీదు, కాని గరుడ బస్సులు వోల్వో వాళ్లవి కాబట్టి అదీ 60 శాతం ఒప్పుకోవచ్చు, అన్నీ వోల్వోలు కావుకదా :)

కానీ, ఆర్టీసి బస్సులో ప్రయాణం శుభప్రదమెందుకవుతుందో అర్ధం కాలేదు, మీకెవ్వరికైనా తెలిస్తే ... :)

మీరెవరైనా బెంగళూరులో ఉండేవారైతే, ఎఫ్‌ఎం రేడియో శ్రోతలైతే, 100.1 MHz,  భారతీయ శాస్త్రీయ సంగీత వాహిని, అమృత వర్షిణి ఉదయం, 7:30 నుండి 8:00 వరకు, కొన్ని కొన్ని రోజుల్లో (ఈ శుక్రవారమొచ్చింది) రాగ రస చింతన, లక్ష్య లక్షణ అనే కార్యక్రమమొకటి వస్తుంది, వ్యాఖ్యాత, శ్రీ ఆర్. విశ్వేస్వరన్. చాలా బాగుంటుంది, వినండి :)

~సూర్యుడు :-)

Sunday, August 14, 2011

మీరు గమనించారా?

మీరు ఏదైనా క్రొత్తగా ఆలోచిస్తున్నాము అనిపించినప్పుడు, అది ఇదివరకెవరైనా అప్పుడే కనిపెట్టేసారా లేదా అని చూడ్డానికి ఏంచేస్తారు? గూగుల్‌ని అడుగుతారు, ఇది నీకేమైనా తెలుసా అని, అది ఉహూ అందనుకోండి, అంటే మీ ఆలోచన ఇంతవరకెవరికీ రాలేదన్నమాట కదా? కానీ, మరి మీఆలోచన్ని గూగుల్‌కి చెప్పేసారే, గూగుల్‌కి కూడా మీ ఆలోచన బాగుందనిపించిందనుకోండి, మరి వాళ్లు దాన్ని వాడుకోకుండా వదిలేస్తారా? ఏమో? :)

సరే, నేను చదువుకుంటున్న రోజుల్లో ఓ సిటీ బస్సు కండక్టర్ ఏమన్నాడంటే, ఇంట్లో పెళ్లామ్మీదలిగినా సిటీ బస్సుమీద రాళ్లేసేస్తారని, అలాగే, ఇప్పుడు మనింట్లో బల్లరిచినా బ్లాగుల్లో రాసేయాలి, మరి ఈ రాతలన్నీ ఎక్కడ నిలవౌతున్నాయి / పేరుకుపోతున్నాయి? ఎక్కడో గూగుల్ సర్వర్లలోనో, లేక వేరే బ్లాగు సర్వీసు ప్రొవైడర్ సర్వర్లలోనో కదా. డాటా ఎనలైటిక్స్ సాఫ్ట్‌వేర్లనుపయోగించి ఇవన్నీ గాలిస్తే, మనింట్లో బల్లరిచిన విషయం తెలియకుండా ఉంటుందా? ఈ మధ్యనే ఎవరో ఓ గోల పెట్టేస్తున్నారు, మన ఆధార్ డాటా అంతా ఎక్కడికో వెళ్లిపోతోందని. ఊరికే కూర్చుని బ్లాగుల్లో మన బుర్రలో ఆలోచనల్ని రాసేస్తుంటే, ఇంకా ఆధార్ డాటా ఎందుకు, ఇక్కడే మన పల్స్ తెలియటంలా? ఉదాహరణకి, మన తెలంగాణా విషయమే తీసుకోండి, మన బ్లాగురాతలు, మన ప్రాంతీయ బేధాలని బయటకు చెప్పట్లేదా?


సరే, మన విషయాలన్నీ బ్లాగుల్లో వ్రాసేయాలా?

Saturday, August 6, 2011

అదీ సంగతి ...

ఈమధ్య మా ఆఫీసుకి వెళ్లే ప్రయాణ సమయంలో ముసురుకొనే ఆలోచన్లను కాస్త మీతోకూడా పంచుకుందామని, ఇలా :)

మీరెప్పుడైనా క్యూల్లో నుంచున్నట్లైతే, ఎప్పుడూ, మన ప్రక్క క్యూ మన క్యూ కన్నా ఫాస్ట్ గా కదులుతున్నట్టనిపిస్తుంటుంది కదా :), ఇది రోడ్డుమీద వాహనాల క్యూలక్కూడా వర్తిస్తుంది. ఇండియాలో డ్రైవింగు, లేన్ డిసిప్లేన్ అనేవి ఆక్సీమోరన్ లాంటివని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా కదా, సరే మనమేళ్లే లేన్ ఫాస్ట్ గా కదలకపోతే, ప్రక్క లేన్ లోకి దూకు అనేది మనలాజిక్కు, అదీ కదలకపోతే ఆ ప్రక్కలేన్లోకో లేకపోతే ఈప్రక్క లేన్లోకో దూకుతూ దూకుతూ ఎలాగోలా ఆఫీసుకి టైంకి చేరామా లేదా అనేదే ప్రశ్న. ఇలా దూకడంలో అప్పుడప్పుడూ ఈప్రక్కవాడినో ఆప్రక్కవాడినో ముద్దెట్టేసుకుని వాడితో ఓ నాలుగనిపించుకుని భలే మజా వస్తూంటుంది :)

ఇలా దూకుతూ దూకుతూ వెళ్తూండగా, లేటుగా అయినా లేటెస్టుగా కనిపెట్టిందేమంటే, ట్రాఫిక్కు సిగ్న్ల్సనేవి నార్మలైజేషన్ పాయింట్లు. మనమెంత కంగారుగా వెళ్దామన్నా, వేరే ఎవరైనా వెళ్లిపోదామనుకున్నా, ట్రాఫిక్కు సిగ్నల్దగ్గరో, జాంలోనో ఇటూ అటూ చూస్తే మళ్ళీ వారే :). సో, ఎంత కంగారుపడినా, మళ్లీ అక్కడే, అదీ సంగతి ... (ఈ మూడు చుక్కలగురుంచొకసారి చెప్పుకోవాలి, పిట్టకథ: చిన్నప్పుడు పరీక్షల్లో ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పడానికి ఈ చుక్కలు పెట్టేవాళ్లం కదా, పరీక్ష పేపర్ ఇంకా సరిగ్గా నిండటంలేదని అనుమానమొచ్చినప్పుడు, ఈ చుక్కల సంఖ్య పెరిగిపోతుండేది :), అంటే ఓ పది పదిహేను చుక్కలు, ప్లేసు సరిపోకపోతే ఓ రెండు చుక్కలు, ఈ టైపులో నడిపించుకొచ్చేస్తుంటే, ఓ క్రొత్త క్లాసులో ఓ క్రొత్త మాష్టారొచ్చి, ఈ చుక్కల సూత్రం చెప్పారన్నమాట, మీ ఓపిక్కొద్దీ చుక్కలుకాదు, ఎప్పుడైనా మూడే చుక్కలుపెట్టాలని, అంతే, అక్కడనుండి, మన పరీక్ష పేపర్ సైజ్ రిక్వైర్‌మెంట్ తగ్గిపోయింది, చుక్కలతోపాటుగా :))

ఇలా లేన్లు దూకినట్టే కొంతమంది కంపెనీలే దూకేస్తుంటారు, కెరీర్ గ్రోత్తో, సాలరీ గ్రోత్తో, ఇంకేదో గ్రోత్తో అనుకుంటూ, గోతిలో పడుతూంటారు, ఈ నార్మలైజేషన్ టెక్నిక్కులు అర్ధంచేసుకోలేక :), ఇది నాఅపోహ లేక నిజమేనా, మీకేమనిపిస్తోంది?


Sunday, March 27, 2011

ఆలోచనలు ...

ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళడానికి ఓ గంటన్నర పడుతుంది రోజూ. ఆ పిచ్చి ట్రాఫిక్కులో చెయ్యగలిగేదేముంటుంది, ఆలోచించడం తప్ప :)

కాకపోతే, ఎఫ్.ఎమ్ రేడియో ఉంటుంది, ఆ మధ్య రేడియో సిటీ, ఫీవర్ మొదలైనవి విని విని బోర్‌కొట్టి విన్డం మానేసా, ఈ మధ్యనే 100.1. 101.3 చానల్స్ వింటూన్నాను. మొదటిది, భారతీయ శాస్త్రీయ సంగీత వాహిని, అమృత వర్షిణి, పొద్దున్న 7:30 నుండి 8:00 వరకు మళ్లీ 8:30 నుండి 9:30 వరకు కర్నాటక శాస్త్రీయ సంగీతం వస్తుంది, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటున్నాయి. అలాగే 101.3 (ఆకాశవాణి) రైన్‌బో చానెల్. ఇందులోకూడా కొన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి, కన్నడలో వస్తాయనుకోండి, అర్ధంచేసుకోగలిగితే బాగుంటాయి.

ఇవి వింటూకూడా ఆలోచనల్లోకి వెళిపోతుంటాను. ఈ మధ్య తరచుగా వస్తున్న ఆలోచనేమంటే, రోడ్డుమీడ ఇంతమంది వెళ్తుంటారు కదా, అందులో కారుల్లో వెళ్లేవారినే తీసుకుంటే, అందులో మళ్ళీ ఒకే వయస్సు కలిగిన వాళ్లని తీసుకుంటే కొందరు ఏదో చిన్న మారుతి కారులో వెళ్తుంటే ఇంకొంతమంది హోండా సివిక్‌లో వెళ్లిపోతుంటారు, ఎందువల్ల, ఎందుకు కొంతమంది ఇలా, ఇంకొంతమంది అలా. సరే, వాళ్ళు చదివిన చదువులు వేరే వేరే అయ్యుండొచ్చు, పనిచేసే కార్యాలయాలు వేరే వేరే ఉండొండచ్చు కాబట్టి వీళ్ళనొదిలేసి, ఒకే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను, అందులో ఒకే వయసు కలిగిన వాళ్ళను తీసుకుంటే, కొంతమంది మేనేజర్లై ఉండొచ్చు, ఇంకొంతమంది, ఇంకా ఏ సీనియర్ ఇంజనీరో అయ్యుండొచ్చు, ఎందుకిలా?

ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?

మా కన్నడ మితృడొకడు ఎప్పుడు ఓ కన్నడ సీరియల్ (ముక్త) లో ఓ డయలాగ్ కోట్ చేస్తుంటాడు, అందులో ఓ జడ్జ్ ఓ డబ్బున్నవాడిని ఇలా అడుగుతాడు "ఆ బీదవాడు కూడా కష్టపడి పని చేస్తున్నాడు, వాడికి నీలా ఎందుకు డబ్బులెక్కువ రావట్లేదు" అని. నాకెందుకో ఈ ప్రశ్న అంత అర్ధవంతమైన దానిలా అనిపించలేదు, ఇక్కడ వాళ్లు సృష్టించే విలువలో తేడాలుండొచ్చు, అందువల్ల ఇలా కంపేర్ చెయ్యడం కుదరదు, అసలు కంపేర్ చెయ్యకూడదు (ఆపిల్ కి ఆరెంజ్ కి పోలికా).

సో, ఐ రిపీట్ మై క్వశ్చన్,
ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?

మిగిలిన ఆలోచన్లు మళ్ళీ ఇంకోసారి ...

~సూర్యుడు