Sunday, December 31, 2017

ద క్వాంటం స్పై - పురావలోకనము

ద క్వాంటం స్పై నవలలో ఒక పాత్ర ఇలా అంటుంది:

"Ludwig Wittgenstein. A philosopher of language. I wrote a paper about him in college. One of his precepts was that if you can't say something, then you can't whistle it, either."

"Nice, " said Flanagan. "What does it mean?"

"It means that a thought doesn't exist apart from the language that expresses it. If you follow me."

నేను ఈ Ludwig Wittgenstein గురించి ఇంతకు ముందెప్పుడు చదవలేదు వినలేదు కాని ఇలాంటి విషయం మీద ఇంతకుముందెప్పుడో తెలుగు బ్లాగుల్లో చర్చలు జరిగినట్టు గుర్తొచ్చి వెతికితే ఓ ఎనిమిది సంవత్సరాలక్రితం వ్రాసిన ఈ టపా (ఆలోచన్లకి భాషుంటుందా?)కనపడింది. నాకు ఈ భాషా పరిశోధనలు గురించి తెలియకపోయినా నేననుకున్నది, అదే, మనం ఏదోఒక భాషలోనే ఆలోచిస్తామనేది ఇంతకుముందే ఎవరో చెప్పేసారు, లేకపోతే అది నేనే కనిపెట్టేవాణ్ణి, ఛ మంచి అవకాశం తప్పిపోయింది  :-)

నా స్వోత్కర్ష ఇంతటితో ముగించి ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పటానికి వెళ్తాను :)

~సూర్యుడు :-)

Saturday, December 30, 2017

ద క్వాంటం స్పై

ద క్వాంటం స్పై నవల చదవడం పూర్తయ్యింది. నవల బాగుంది. ఐప్పుడు బాడీ ఆఫ్ లైస్ మళ్ళీ మొదలుపెట్టాను . చూడాలి ఎప్పటికి పూర్తవుతుందో .

ఈమద్య అటుఇటు తిరుగుతుంటే ఏవో కొన్ని క్లిక్కులు క్లిక్కాను, చూడండి :)









Saturday, December 9, 2017

ఈమద్య చదివిన నవల "సిరో"

David Ignatius క్రొత్త నవల The Quantum Spy కొనే కార్యక్రమంలో సిరో అనే నవల కనపడింది. సిరో చదవడం పూర్తయ్యింది. నవల బాగుంది. మనకు తెలిసిన వ్యూహమే. స్ట్రాటజీ అంటే వ్యూహమే కదా :)

ఒక చిన్న అంశాన్ని ఒక పెద్ద నవలగా ఎలా చెప్పొచ్చో ఈ నవల చదివాక అర్ధమైంది  :)

ఇప్పుడు The Quantum Spy, చదవడం మొదలుపెట్టాను. చూడాలి ఇది ఎలా ఉంటుందో .