Saturday, December 8, 2018

మాయావి / మాయావిని సంక్షిప్త నవలలు

చాలారోజుల క్రిందట, అంటే చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లో ఉన్న పాత యువ పత్రికల్లో చదివిన నవలలు అంటే సంక్షిప్త నవలలు, మాయావి / మాయావిని. తర్వాత అవి ఎలాగో కనిపించకుండా పోయాయి. తర్వాత అంతర్జాలంలో ఎంత వెతికినా అవి కనిపించలేదు. ఈమధ్య ఎవరో మళ్ళీ ఆ నవలల గురించ్చి ప్రస్తావిస్తే మళ్ళీ వెతికితే ఎవరో పాత యువ పత్రికల్ని అంతర్జాలంలో పెడితే వాటిలో 1964 డిసెంబర్ పత్రికలో మాయావి కనిపిస్తే పొందిన ఆనందం ఇంతా అంతా కాదు :). దురదృష్టవశాత్తు మాయావిని ప్రచురింపబడ్డ 1965 జనవరి పత్రిక దొరకలేదు :(. మళ్ళీ ఒక సారి అరిందముడు, పూల్ సాహెబు, జుమీలియా, దేవేంద్ర విజయమిత్రుడిని పలకరించి పులకరించి ఇలా మీతో పంచుకోవాలనిపించి, అదీ సంగతి ...

మీకెవరికైనా 1965 జనవరి యువ పత్రిక దొరికితే దయచేసి తెలుపగలరు :)

~సూర్యుడు :-)

Friday, December 7, 2018

The Director / ద డైరెక్టర్

ద ప్రెసిడెంట్ ఈస్ మిస్సింగ్ నవల చదువుదామని మొదలుపెడితే ఎంతకీ ముందుకి కదలడంలేదు. సరే అని ద డైరెక్టర్ నవల మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఇంక ఆపాలనిపించలేదు. చాలా ఉత్కంఠంగా ఉండి బాగుంది. మొత్తంమీద చూస్తే చాలా రంధ్రాలున్నాయి కాని ఇలాంటి నవలల్లో అవన్నీ ఓకే :)


సైబర్ హ్యాకింగ్ ప్రధానాంశంగా చేసుకుని వ్రానసిన నవల. ముఖ్యంగా స్నోడెన్ వ్వవహారం, వికీలీక్స్  తర్వాత అలాంటివి జరిగే అవకాశాన్ని చెప్పటం ఈ నవల ప్రధాన ఇతివృత్తం. అసలు సి.ఐ.ఏ ఎలా ఉద్భవించింది దాని చరిత్ర కొంత.


సో, ఇంక సన్ కింగ్ ఒక్కటే మిగిలింది, David Ignatius నవలల్లో చదవటానికి. అదికూడా చదివేస్తే ఓ పనైపోతుంది :)

~సూర్యుడు :-)

Friday, November 23, 2018

Mughal-E-Azam - Teri Mehfil Mein






Thursday, November 15, 2018

ద ఇంక్రిమెంట్

మొత్తానికి ద ఇంక్రిమెంట్ నవల పూర్తిచేసాను. చాలా బాగుంది.  ఇప్పటిదాకా చదివిన David Ignatius నవలల్లో ఇదే బెస్టేమో. నవల చాలా ఉత్కంఠంగా ఉండి ఎక్కడా విసుగనిపించదు. Daniel Silva నవలల్లో వస్తుంటుంది, ఇరాన్ సీక్రెట్ సర్వీస్  Taqiyya (I think it is used in the sense of deception) సూత్రం ఆధారంగా పనిచేస్తుందని కానీ ఈ నవలలో, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డెసెప్షన్ వాడి ఇరాన్ న్యూక్లియర్ పోగ్రామ్ ని ఎలా సబొటాజ్ చేసిందో వివరించే కథే ఈ ద ఇంక్రిమెంట్ నవల.

ఈ క్రింద నవలలు చదవడం పూర్తయ్యింది:

  1.  Agents of Innocence
  2.  Bloodmoney
  3.  The Bank of Fear
  4.  A Firing Offense
  5.  Siro
  6.  Body of Lies
  7.  The Quantum Spy
  8.  The Increment

ఇవి ఇంకా చదవాలి:

  1.  The Director
  2.  The Sun King

Thursday, October 18, 2018

మహర్నవమి మరియు విజయదశమి శుభాకాంక్షలు!!

మీకు మీ కుటుంబ సభ్యులకు -

మహర్నవమి మరియు విజయదశమి పండుగ శుభాకాంక్షలు!!

హ్యాపీ దసరా

~సూర్యుడు :-)

Sunday, October 14, 2018

నక్క (The Fox)

 అలన్ ఫర్స్ట్ నవలా కాదు జాన్ లె కారి నవలా కాదు కాని ఫెడ్రిక్ ఫోర్సిత్ నవల ద ఫాక్స్ చదివాను. ఇది సైబర్ వార్ఫేర్ మీద ఆధారపడ్డ నవల. బాగానే ఉంది. Asperger's syndrome తో బాధపడుతున్న Luke అనే పద్దెనిమిది సంవత్సరాల UK కుర్రాడు NSA డేటాబేస్ ని హ్యాక్ చెయ్యడంతో మొదలవుతుంది. మామూలుగానే అమెరికా కుర్రాడిని అమెరికాకి అప్పచెప్పమంటుంది కానీ ఒక UK రిటైర్డ్ స్పై అధికారి (Adrian Weston), ప్రస్తుత బ్రిటిష్ ప్రధానికి సలహాదారు, చాకచక్యంగా అమెరికన్లను ఒప్పించి Luke ని ఉపయోగించుకుని ఎలా రష్యన్, ఇరాన్, నార్త్ కొరియాల కంప్యూటర్స్ ని హ్యాక్ చేసి బ్రిటిష్, అమెరికాల ప్రయోజనాలని కాపాడారో అని చెప్పే కథే ఈ నవల ఇతివృత్తం లేదా సారాంశము.

కాకపొతే ఈ నవల ఊహాజనితమే అయినా ఇలా జరిగే అవకాశాలున్నాయని తెలిస్తే మన దేశ రహస్యాలు కానీ మన ప్రజల సంపద (బ్యాంకుల్లో దాచుకున్నది) ఎంతవరకు భద్రమన్నది ఒక ప్రశ్న. పూర్వం దేశ రక్షణకి ఆయుధాలు కొంటే సరిపోయేది. ఇకముందలా కాదేమో. ఆయుధాలతోపాటుగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని లేదా సమాచారాన్ని కాపాడుకోవడానికి వేరే రక్షణ ఉపకారణాలని కొనుక్కోవలసి ఉంటుంది. ఇదొక క్రొత్తరకమైన (Digital) కోలనైజేషన్ :)

రఘురామ్ రాజన్ వ్రాసిన ఐ డు వాట్ ఐ డు పుస్తకం మొదలుపెట్టాను, చూడాలి ఎప్పటికి పూర్తవవుతుందో ...

~సూర్యుడు :-)

Sunday, September 23, 2018

ద అదర్ వుమన్

డానియల్ సిల్వా ద అదర్ వుమన్ చదవడం పూర్తయింది. ఇది ఇంతకుముందొచ్చిన డానియల్ సిల్వా రెండు నవలలుకన్నా బాగుంది. రష్యన్ ఆపరేషన్ నవలల్లో ఇది మూడోదేమో. ఇంటరెస్టింగ్ ప్లాట్. చాలావరకు తెలిసి పాత్రలే :)

ఇంతకుముందే ఎక్కడో అన్నట్టు డానియల్ సిల్వా నవలల్లో నాకు నచ్చే అంశం వ్రాసే విధానం. అయన మొదట్లో విలేఖరి కాబట్టి, విలేఖర్లకు వ్రాసేవిధానమే ముఖ్యం కాబట్టి అయన బాగా వ్రాయడంలో ఆశ్చర్యమేమీ లేకపోవచ్చు. మొన్న చదివిన ద ఆక్సిడెంటల్ ప్రిమినిస్టర్ పుస్తకం కూడా అలానే అనిపించింది. సంజయ బారు కూడా సంపాదకుడిగా పనిచేసిన అనుభవం ఆసక్తికరంగా వ్రాయడానికి పనికొస్తుందేమో.

నవలైనా మరేదైనా పుస్తకమైనా ఆసక్తికరంగా ఉండాలంటే ఉపోద్ఘాతం ముఖ్యమేమో. కొన్ని పుస్తకాలు మొదలు అంత గొప్పగాలేకపోయినా చదవగా చదవగా బానే అనిపిస్తాయి. అంటే ఈ రచయితలకు స్టార్టింగ్ ప్రాబ్లమేమో ...

హెచ్ బి ఆర్ గైడ్ టు బెటర్ బిజినెస్ రైటింగ్ పుస్తకంలో ఏమంటాడంటే ఏవిషయమైనా క్లుప్తంగా (నాట్ ఏ వర్డ్ మోర్ నాట్ ఏ వర్డ్ లెస్ లైక్ నాట్ ఏ పెన్నీ మోర్ నాట్ ఆ పెన్నీ లెస్ టైప్) అర్థమయ్యేటట్లు వ్రాయాలని. నాఅభిప్రాయమేమంటే డానియల్ సిల్వా వ్రాసేవిధానం సరిగ్గాలనే ఉంటుందని.

ఇప్పుడేం మొదలుపెట్టాలో ద స్పైస్ ఆఫ్ వార్సా నా లేక ఎనీ ఆఫ్ దోజ్ జాన్ లె కారి నవలా ..

Sunday, September 16, 2018

విదేశీ విలేఖరి

అదే ద ఫారెన్ కరెస్పాండెంట్ అని ఒక నవల చదివాను. నా మొదటి Alan Furst నవల, పూర్తిగా చదివినది. ఇంతకుముందు ద స్పైస్ ఆఫ్ వార్సా మొదలుపెట్టాను కాని పూర్తిచెయ్యలేదు. ద ఫారెన్ కరెస్పాండెంట్ నవల బాగుంది. ముస్సోలిని ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కొంతమంది ఇటలీ పౌరులు ఫ్రాన్స్ ఇటలీలనుండి నడిపించిన వ్యతిరేక ఉద్యమ కథ. ఇది 1938 నుండి 1939 మద్యలో జరిగిన సంఘటనలు, కల్పనా అయ్యుండొచ్చు లేదా నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకొని రాసినదయ్యుండొచ్చు. ఒక నవల చదివి Alan Furst రచనా విధానం గురించి చెప్పడం కష్టం.

ఏదేశంలోనైనా ఏకాలంలోనైనా కొంతమందే తమకు నచ్చని విధానాలని వ్యతిరేకించి పోరాడతారు, మిగిలినవారు తటస్థంగానైనా ఉంటారు లేదా సమర్థిస్తారు. ఈపోరాడేవారు ఎన్ని కష్టనష్టాలను భరించి తాము నమ్మిన సిద్దాంతాలకోసం తమ ప్రాణాలను ఫణంగాపెట్టి పనిచేస్తారన్న విషయం ఈనవలలో కనిపిస్తుంది. డానియల్ సిల్వా నవలల్లోలాగ ఎక్కువ యాక్షన్ లేదు కానీ బాగుంది. ద స్పైస్ ఆఫ్ వార్సా మళ్ళీ మొదలుపెట్టాను, చూడాలి ఎప్పుడు పూర్తవుతుందో.

ఈలోగా ఏదో రైలుప్రయాణంకోసం కొన్న ద ఏక్సిడెంటల్ ప్రెమినిస్టర్ పుస్తకం మొదలుపెట్టినప్పటినుండి ఆపకుండా చదివేసాను. సంజయ బారు బాగా ఆకట్టుకొనేవిధంగా వ్రాసారు. ఈపుస్తకం వ్రాయడానికి శ్రీ మన్మోహన్ సింగ్ గారి అనుమతి తీసుకున్నారో లేదో తెలియదు (ఏదో ఇంటర్వ్యూలో సంజయ బారు తీసుకోలేదు అని చెప్పారని చదివినట్టు గుర్తు) కాని చాలా అంతర్గతమైన విషయాలను ప్రస్తావించారు ఈపుస్తకంలో. ఇది చదివిన తర్వాత అర్దమైయిందేమిటంటే పత్రికల్లో వచ్చే వార్తలు ఎలా పుట్టుకొస్తాయా అని :). ఆ తర్వాత శ్రీ మన్మోహన్ సింగ్ గారి రాజకీయ పరిణతి. ఈ పుస్తకంలో ఎవరో చెప్పినట్లుగా అయన ఓవర్ రేటెడ్ ఎకనామిస్ట్ అవునోకాదో కానీ తప్పకుండా అండర్ రేటెడ్ పొలిటీషియన్ అని మాత్రం అర్ధమవుతుంది.

నాకర్ధంకాని ఒకవిషయం సంజయ బారు ఎందుకు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో దూరం పెంచుదామనుకున్నారో నాకర్ధం కాలేదు. తాను ప్రధానమంత్రికాగలిగి కూడా శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసిన శ్రీమతి సోనియా గాంధీకి వ్యతిరేకంగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఎందుకు ప్రవర్తిస్తారనుకున్నారో కూడా నాకర్ధంకాలేదు. అంతేకాకుండా సంజయ బారు తిన్నగా ప్రధానమంత్రికి రిపోర్ట్ చేయడంవలన, ప్రధానమంత్రిగారి ప్రధాన కార్యదర్శికి ప్రధానమంత్రిగారి మీడియా అడ్వైసర్ కి మధ్యలో బాధ్యతలు ఓవర్లాప్ అయ్యి రెండు పవర్ సెంటర్స్ అయినట్లనిపించింది. చివర్లో శ్రీ మన్మోహన్ సింగ్ గారు రెండు పవర్ సెంటర్స్ ఉండకూడదు శ్రీమతి సోనియా గాంధీగారే పవర్ సెంటర్ అని చెప్పినప్పుడు అదెందుకో ప్రధానమంత్రిగారి ప్రధాన కార్యదర్శికి ప్రధానమంత్రిగారి మీడియా అడ్వైసర్ కి కూడా వర్తించేలా చెప్పారేమో అనిపించింది. ఓవరాల్ ఒక ఆసక్తికరమైన పుస్తకం, పేజ్ టర్నర్ కూడా ...

మన తెలుగువారు సంజయ బారు శ్రీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో అంత కీలకమైన పాత్ర పోషిండమన్నది మనమందరం గర్వించవలసిన విషయం 

ప్రస్తుతం డానియల్ సిల్వా ద అదర్ వుమన్ మొదలుపెట్టాను సో ఫార్ సో గుడ్.

~సూర్యుడు :-)


Friday, June 15, 2018

The Fallen - David Baldacci

ఆమద్యంతా గూఢచారి నవలలు చదివి చదివి విసుగొచ్చి అపరాధ పరిశోధన నవల చదవాలని నిర్ణయించి "ద ఫాలెన్ " నవల కొన్నాను. నవల బాగుంది. సమకాలీన అమెరికా సమాజానికి అద్దం పట్టిందోలేదో నాకు తెలీదు కాని దగ్గరగా ఉండొచ్చేమో.

అమెరికాలో ప్రజలు ఎలా ఓపియాయిడ్ బారిన పడుతున్నారో అన్న ఇతివృత్తమ్మీద ఆధారపడిన నవల. పనిలోపనిగా ఆటోమేషన్ వల్ల ప్రజలెలా జీవనోపాధి కోల్పోతున్నారా కూడా చర్చించాడు రచయిత. అసలు జీవనోపాధి కోల్పోవడమే ప్రజలు మాదకద్రవ్యాలకి బానిసలవడానికి కారణమని రచయిత అభిప్రాయమనుకుంటా.

In a Fulfillment Center (it is an inventory place for online shopping business) the following conversation takes place:

"So you're saying one day this place will have just robots?"

"Business don't give a crap about creating jobs. They care about making money. With robots, you'll just need some tech guys to maintain and repair them."

"But if people don't have jobs to make money, who's going to buy all the stuff on those shelves?"

this is the precise question I had for a long time but gave up, I am not a business person to understand that thought process ;)

Overall this novel is a page turner.

~సూర్యుడు

Sunday, March 18, 2018

విళంబి ఉగాది శుభాకాంక్షలు



మీకు, మీ కుటుంబ సభ్యులకు
శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

మీ అందరికి ఆయురారోగ్యఐశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటూ


~(ఉగాది) సూర్యుడు :-)

Sunday, February 25, 2018

ఇంకొన్ని నవలలు

బాడీ అఫ్ లైస్ పూర్తైన తర్వాత "ద ఇంక్రిమెంట్" మొదలుపెట్టాను కానీ అది ముందుకు వెళ్ళడం   లేదు. ఈ మధ్య క్రొత్త పుస్తకాలకోసం వెతుకుతుంటే Alex Berenson అనే క్రొత్త రచయిత కనపడ్డాడు. Alex Berenson వ్రాసిన "ద ఫెయిత్ ఫుల్ స్పై" చదివాను. బాగానే వుంది. డానియల్ సిల్వా, డేవిడ్ ఇగ్నేషియస్ లతో పోలిస్తే వ్రాసే విధానం కొంచం భిన్నంగా వుండి బాగుంది. ఈ ముగ్గురిలో డానియల్ సిల్వా నాకు బాగా నచ్చాడు , ఆతర్వాత ఇద్దరు ఇంచుమించుగా ఒకే రకంగా అనిపించింది.

ఇప్పుడు "ద ఘోస్ట్ వార్", "ద ఇంక్రిమెంట్" చదవాలి. చూడాలి ఏది ముందు పూర్తవుతుందో. డానియల్ సిల్వా క్రొత్త నవల "ద అదర్ వుమన్" రాబోతోంది, చూడాలి అదెలా ఉంటుందో.

మీఎవరైనా Alex Berenson చదివితే, మీ అభిప్రాయమేంటి?

~సూర్యుడు :-)

Friday, January 19, 2018

బాడీ ఆఫ్ లైస్

మొత్తానికి బాడీ ఆఫ్ లైస్ నవల పూర్తిచేశాను. నవల బాగుంది. ఇప్పుడు ద ఇంక్రిమెంట్ మొదలుపెట్టాను, చూడాలి ఎలా ఉంటుందో. డానియల్ సిల్వా, డేవిడ్ ఇగ్నేషియస్ లు తూర్పు పడమరలు. ఒకరు ఇజ్రాయిల్ ను సప్పోర్ట్ చేస్తే ఇంకొకరు ఆరబ్బులని సప్పోర్ట్ చేస్తారు. రాసే విధానం డానియల్ సిల్వా ది  బాగుంటుంది, డేవిడ్ ఇగ్నేషియస్ ఇతివృత్తాలు, వ్యూహాలు కొద్దిగ సింపుల్ గా ఉంటాయి. మొత్తానికి ఇద్దరూ బాగానే వ్రాస్తారు.

ద ఇంక్రిమెంట్ చదవడం పూర్తయ్యాక ఎలా ఉందో వ్రాస్తా .

~సూర్యుడు :-)

Monday, January 1, 2018

Happy New Year 2018!!





Wish You A Very Happy New Year 2018!!