Sunday, January 13, 2019

నదులు - నీళ్ళు - సముద్రాలు

ఈమద్య అటుఇటు తిరుగుతున్నప్పుడు గమనించిందేమంటే మన నదుల్లో నీళ్ళు తగ్గిపోతున్నాయి. పూర్వం రైల్లో వెళ్తుంటే గోదావరిలో బోళ్ళు నీళ్లుండేవి, అలాగే ఇంచుమించుగా కృష్ణాలో కూడా. ఇప్పుడు ఈ నదుల్లో, అంటే రైలు వంతెనల క్రింద నీళ్లు పారడంలేదు, మహా అయితే కొన్ని నీటి గుంటలు / మడుగులు. ఒక కారణం వర్షాలు తగ్గడం కావచ్చు లేదా ఆనకట్టల వల్ల నీళ్లు అంతకుముందే ఎక్కడో నిలువచేయబడివుండొచ్చు. ఇందువల్ల మనం నదుల నీటిని బాగా ఉపయోగించుకుంటున్నామేమో కాని ప్రకృతిసిద్ధమైన నదులు, సముద్రాలు, వర్షాల క్రమాన్ని దెబ్బతీస్తున్నామేమో అనిపిస్తోంది. కాల క్రమేణా వర్షాలు తగ్గిపోతున్నాయి. నీటి వనరులు తగ్గుతున్నాయి. ఇలాగే ఇంకొన్నాళ్ళు జరిగితే పర్యావరణమెలా (పర్యవసానం కూడా) ఉంటుందో :(

~సూర్యుడు

Saturday, January 5, 2019

Happy New Year 2019



Wish you all a very happy, healthy and prosperous new year 2019

రాబోయే సంవత్సరమంతా మీఅందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలను కలుగచేయాలని కోరుకుంటూ ... 

~సూర్యుడు :-)