చాలా రోజుల తర్వాత మళ్ళీ గాబ్రియల్ అలన్ నవల ది చెలస్ట్ (The Cellist) చదివాను. ఇంతకు ముందు Daniel Silva నవలల్లాగే ఇదికూడా బాగుంది. ఒక రష్యన్ సంపన్నుడు ఇంగ్లాండ్ లో హత్యకు గురికావడంతో మొదలవుతుంది ఈ నవల. ఈ రష్యన్ గాబ్రియల్ అలన్ కు స్నేహితుడు కావడంతో ఆ హత్యకు కారణమైన వాళ్ళపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ఈ నవల.
చివర్లో, అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు, వాటి ఫలితాలు, ఆ తర్వాత జరిగిన గొడవలు, రచయిత యొక్క రాజకీయ అభిప్రాయాలు ప్రస్తావించబడ్డాయి. ఇంతకుముందునుండి అనుకుంటున్నదే కానీ ఇది చదివిన తర్వాత మళ్ళీ అనిపించిందేమంటే, ప్రజలను ఎక్కువగా పోలరైజ్ (దీనికి తెలుగులో ఏ పదం వాడాలి?) చేసేయ్యకూడదు. ఇది మితిమీరితే ఒకే దేశంలో రెండు దేశాలు ఉన్నట్లుంటుంది. రాజకీయ పక్షాలకు, వాటి నాయకులకు పరిణతి లేకపోతే వచ్చే చిక్కే ఇది. ఇంతకు ముందు మనదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఓ రెండు చాలవా అనిపించింది కానీ బాగా ఆలోచిస్తే ఎక్కువ ఉండడమే మంచిదనిపిస్తోంది.
ఈ నవల తర్వాత ఎప్పటినుండో ఆగిపోయిన టైఫూన్ నవల పూర్తిచేసేసాను. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా తర్వాత తర్వాత చాలా బాగుంది. చార్లెస్ కమ్మింగ్ నవలల్లో ఇదే బెస్టేమో. హాంగ్ కాంగ్ ను బ్రిటిష్ రూలింగ్ నుండి చైనా కు అప్పచెప్పే సమయంలో జరిగిన కథ ఇది. నాకు చాలా నచ్చింది.
ఇంతకుమునుపెప్పుడు Stephen King నవలలు చదవలేదు కానీ ఈమధ్యనే Billy Summers కొన్నాను. చదవాలి, ఎలా ఉంటుందో ...
~సూర్యుడు :-)
No comments:
Post a Comment