Thursday, December 28, 2023

మసాగత్తు

 మసాగత్తు అంటే అర్థమేమిటి?

Sunday, December 17, 2023

కథనం

ప్రతి కుటుంబానికి ఒక కథ ఉంటుంది. ఎవరో తాతో ముత్తాతో లేదా అవ్వో ముత్తవ్వో ఆస్తులని సంపాదించారనో లేదా పాడుచేశారనో. రోజులు బాగుంటే ప్రతి తరం ముందు తరం కంటె బాగుండొచ్చు . అంతమాత్రాన అంతకుముందు తరం చేతకానివారని కాదు కదా. ఎవరికి చేతనైంది వారు చేస్తారు . టాటాలకు ఇప్పుడిన్ని ఆస్తులున్నాయంటే అవన్నీ రతన్ టాటానే సంపాదించారని కాదుకదా, అంతకుముందు జెఆర్డీ టాటా అంతకన్నాముందు జెంషెడ్జీ టాటా ఎవరికి కుదిరింది వారు చేసుంటారు. Sir Isaac Newton quote, If I have been able to see farther than others, it was because I stood on the shoulders of giants. అనుకోగలగడం గొప్ప. చేసేవాడు చేయించేవాడు వేరే ఉన్నాడు అని నమ్మినప్పుడు అంతా మనమే చేశామనుకోవడం సరికాదేమో? 

ప్రతి కుటుంబం మా పూర్వీకులేమీ చెయ్యలేదు, చేసిందంతా మేమే అని చెప్పుకుంటే ఆత్తర్వాత్తరం కూడా అలాగే చెప్పుకుంటుంది, ఆ కుటుంబ చరిత్ర అంతమాత్రమే. ఏతరమైనా ఇంకొంచం ముందుకెళ్ళి మా పూర్వీకులు అంతా చెత్తచేసారు అని చెప్పుకొని తిరిగితే ఇంక చెప్పక్కర్లేదు కదా. ఆ కుటుంబానికి చరిత్రేలేదు.

ప్రతి దేశానికి ఒక చరిత్ర / కథనం ఉంటుంది. దాని గతమేంటి, అది ఒడిదొడుకుల్ని ఎలా తట్టుకొంది మొదలైనవి. ఆ దేశం ఆ కథనానికనుగుణంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఉదాహరణకి అశోకుడి కాలాన్ని తీసుకుంటే, మనం చదువుకున్న కథలు, రహదార్లు వేయించెను, సత్రములు కట్టించెను, చెట్లు నాటించెను వగైరా, ఆతర్వాత రాజ్యాన్ని విస్తరించెను, చక్రవర్తి కదా. మరివన్నీ అశోకుడు ఒక్కడే చేసుండడు కదా, చాణక్యుడు లాంటి గురువుగారు, మంత్రులు, సేనాధిపతులు కలిసే చేసుంటారు. ఇప్పుడు ఇందులో అశోకుడి గొప్పేమి లేదు అతని సేనాధిపతుడొకడు మహావీరుడు, అతనివల్లే ఇదంతా అయ్యింది అని తిరగరాస్తే ఏమౌతుంది?

మన దేశానికి స్వాతంత్య్రం శాంతియుత పోరాటం వల్ల వచ్చింది అని చదువుకున్నాము. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సాధించడానికి సాయుధపోరాటం చేస్తే మనమేం చెప్తాము, ఆయుధపోరాటాలతో ఏదీ సాధించలేము, శాంతియుత పోరాటమే మార్గము అని కదా. అదే ఇప్పుడు మనకి స్వాతంత్య్రం సాయుధపోరాటంవల్లే వచ్చిందని కొత్త కథ చెప్తే సభ్యసమాజానికి ఏంసందేశమిస్తున్నట్లు? తుపాకులు పట్టుకుని ఏమైనా సాధించుకోవచ్చుననే కదా? అలాంటప్పుడు తుపాకులు పట్టుకునేవాళ్ళు ఏమవుతారు? స్వాతంత్య్ర సమరవీరులా? ఉగ్రవాదులా?

ఎవరిని వీరులు చెయ్యాలో ఎవరిని ప్రక్కనపెట్టాలో ఆలోచించుకుని చెయ్యాలి. ఎవరో మనకి నచ్చలేదని కాదు. 

 

 మీకర్ధమయ్యిందనుకుంటాను :)

 

~సూర్యుడు :-)

Thursday, November 30, 2023

ఏదైనా సులువుగా కొనుక్కోవడమెలా

 డబ్బులుండాలనుకోండి. కానీ పూర్వం ఆ వస్తువెక్కడదొరుకుతుందో తెలియడానికి సమయం పట్టేది. అలాంటివే ఇంకేమైనా ఉన్నాయేమో తెలిసేదికాదు. ఇప్పడలాకాదు, మనకేదైనా కావాలంటే దాని గురించి వెతికామో, దాన్ని కోనేవరకు ఈ ఆన్లైన్ అంగడ్లు వెబ్ లోనూ, మొబైళ్ళలోనూ వెంటబడి కొనిపించేస్తారు.

అదేలాఉన్నా మనక్కావలసిన వస్తువు కొనుక్కోవడం ఇప్పుడు చాలా సులువైంది. అంతేకాదు, అలాంటి వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా అని వెతికి అవన్నీ చూపిస్తాయి. అందులో మనకి నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు. అలాగే మనమేవైనా పుస్తకాలు కొనుక్కుంటే అదే రకమైన పుస్తకాలన్నీ చూపిస్తాయి. ఇందులో మనం అంతకుముందు చూడనివి మంచివి అనిపించిన పుస్తకాలు కొనుక్కోవచ్చు. అదే పుస్తకాల షాపులో అయితే అక్కడున్నవే చూడగలం, వాళ్లకి మనకి నచ్చే విషయాలు తెలియకపోవచ్చు.

కానీ ఇందులో కొంత అనర్థంకూడా ఉంది. ఒక్కోసారి మనకి బయటదొరికే ధరకన్నా ఎక్కువ చూపిస్తాయి. చూసుకొని కొనుక్కోవాలి. అమెజాన్ వాడైతే నువ్వు ఇంతకుముందు కొన్నావనికూడా చెప్తాడు, మనం మర్చిపోయి కొన్నవాటినే మళ్ళీ కొనేయకుండా. బాగుందికదా. నేను ఇంతకుముంది ఇలా కొన్నవే మళ్ళీ మళ్ళీ కొని ... 

కొన్నిరోజులకి మనకేం నచ్చుతాయో మనకన్నా ఈ అన్లైన్ అంగడ్లకే ఎక్కువగా తెలుస్తుంది  :)

అసలు కిటుకంతా మనకి ఎలా చెప్తే కొంటామో తెలుసుకోవడంలోనే ఉంది. ఎదో సినేమా డైలాగ్ లాగ, I will make an offer that s/he can't refuse అనే టైపులో కన్విన్స్ చేస్తాయి.

ఈ మధ్యకాలంలో మానసికశాస్త్రానికి విలువ బాగా పెరిగింది. ఒకవైపు ఆన్లైన్ అంగడ్లు ఇంకోవైపు సామాజిక ప్రసార మాధ్యమాలు జనాలని ఎలా ప్రభావితం చెయ్యాలని మానసికశాస్త్ర మెళకువలను వాడుకొని ప్రయత్నిస్తున్నాయి. 

 

మీకేమనిపిస్తోంది?

 

~సూర్యుడు :-)

Saturday, October 28, 2023

కొన్ని ఆలోచనలు

Random thoughts, అంటే ఏవో అలా అనుకోకుండా వచ్చే ఆలోచనలు. దీనిని తెలుగులో ఏమనాలో సమయానికి గుర్తురాక గూగులయ్యని (ఎప్పుడూ గూగులమ్మేనా అని, అయ్యవారిని అడిగా :)) అడిగితే యాదృఛ్చిక ఆలోచనలు అన్నాడు. సరే మరీ మక్కీ కి మక్కీ లా వుందని ఇలాంటి శీర్షిక. 

 ఇంతకీ  ఈ ఆలోచనలు దేనిగురించంటే, స్మార్ట్ ఫోన్స్ గురించి. మీకెప్పుడైనా మీరు మాట్లాడిన వాటికి సంబంధించిన SMSలు గాని mails గాని వచ్చాయా? అంటే, మీకెప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ మీ మాటలు వింటోందనిపించిందా?

నా అనుమానమేంటంటే అన్ని స్మార్ట్ ఫోన్లు ఎప్పుడూ  మన మాటలు వింటూనేఉంటాయని. మనం మాట్లాడుకునే విషయాల్లో పెద్దగా రహస్యాలేవీ ఉండవుకాబట్టి అవి విన్నా పర్వాలేదు కానీ ఎప్పుడైనా intimate విషయాలు మాట్లాడుకునేటప్పుడుకూడా అవి వినేస్తుంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఈ స్మార్ట్ ఫోన్లే అస్తమానము వింటుంటే మళ్ళీ ప్రత్యేకంగా Amazon Echoలు Google Homeలు అవసరమా?

ఇంట్లో ఎవరూ లేకుండా ఎవరైనా పెద్దవాళ్ళుంటే Amazon Echoలు Google Homeలు ఉపయోగపడతాయేమో కానీ అటుఇటు తిరుగుతుండే వాళ్ళకి అనవసరమేమో. 

మీకేమనిపిస్తోంది?


~సూర్యుడు :-)

Thursday, October 12, 2023

Lisbeth Salander - The Girl with the Dragon Tattoo

 ఎవరో బాగుందంటే The Girl with the Dragon Tattoo నవల కొని చదివాను. ఇది Swedish నవల, తర్వాత ఇంగ్లీష్ లోకి అనువాదం చెయ్యబడింది. నవల సాంతము ఉత్కంఠంగ వుండి బాగుంది. ఆ స్పూర్తితో ఆ నవలా రచయిత వ్రాసిన ఇంకో రెండు నవలలు, The Girl who played with Fire తర్వాత The Girl who kicked hornets' Nest చదివాను. ఇవికూడా బాగున్నాయి. ఈ నవలలు వ్రాసిన తర్వాత Stieg Larsson అకాల మరణం వల్ల అదే శైలిలో వేరే రచయిత వ్రాసిన నవలలు చూసాను కానీ వేరే వాళ్ళు వ్రాసిన Robert Ludlum నవలలు చదివిన అనుభవంతో వాటిజోలికి పోలేదు. 

ఈ నవలల్లో ఏంబాగుందంటే చెప్పడానికేమీలేదు, ఇంతకుముందు అనుకున్నట్లు, జర్నలిస్టులకు బాగా (చదివించేలా) వ్రాసే గుణం ఉంటుందేమో. మహిళల హక్కులు, వారి స్వేచ్ఛ వీటిమీద ఈ  రచయితకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నట్టున్నాయి, ఆయన వాటిని బాగా చెప్పడానికి ప్రయత్నించాడు.

ఈ నవలలు, ముఖ్యంగా రెండోది, మూడోది, చదువుతుంటుంటే డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో అర్ధమవుతుంది. 

The Girl who kicked hornets' Nest చదివిన తర్వాతఏమనిపించిందంటే, మనం బాగా నమ్మినవాళ్ళే మనల్ని మోసం చేస్తారేమోనని. సరే నమ్మితేనే మోసం చెయ్యడానికి సులువుగా ఉంటుంది కదా ;). ఏదో "నమ్మి చెడినవాడు లేదంటారు" కదా, దీని భావమేంటో :)

The Silent Patient అనే నవలోకటి కొన్నాను. సమయం చూసుకొని చదవాలి.

 ICC World Cup 2023 అనే రియాల్టీ షో చూస్తున్నారా లేదా? :)

~సూర్యుడు

“There are two motives for reading a book; one, that you enjoy it; the other, that you can boast about it.”

- Bertrand Russell

Friday, October 6, 2023

Congratulations on Dadasaheb Phalke Award


 

There is nothing either good or bad, ...

but thinking makes it so.

-Hamlet

I liked this quote, so ... :)

 

~సూర్యుడు :-)

Sunday, August 20, 2023

Saturday, August 19, 2023

సంగీత జ్ఞానము ...



Ranjani–Gayatri



Sudha Ragunathan



Mangalampalli Balamuralikrishna


Ranjani–Gayatri


ప. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా అ. భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులుపాసించే (సం) చ. న్యాయాన్యాయము తెలుసును జగములు మాయామయమని తెలుసును జగములు కాయజాది షడ్రిపుల జయించే కార్యము తెలుసును త్యాగరాజునికి (సం)

Sunday, August 13, 2023

ది కలెక్టర్

 కలెక్టర్ అంటే మన జిల్లా కలెక్టర్ కాదు కానీ డేనియల్ సిల్వా వ్రాసిన  ది కలెక్టర్ అనే క్రొత్త నవల. సరే గాబ్రియెల్ అలోన్ నవల కదా అని కొని చదివాను. నవల బాగుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో జరిగిన కాల్పనిక కథ. నవలానాయకుడు పురాతన చిత్తరువులు పునరుద్ధరించేవాడవడంవల్ల (ప్రస్తుత ఉద్యోగం) నవల ఒక ప్రాచుర్యమైన చిత్తరువు దోపిడీతో మొదలవుతుంది. ఇది ఇంతకుమునుపు నవలకన్నా చాలా బాగుంది. డేనియల్ సిల్వా నవలల్లో ఉండే పాత్రలన్నీ (అన్ని అంటే అన్ని అని కాదు, చాలా వరకు అని) కనిపించాయి ఇందులో. 

ఈ నవలలో ఒక క్రొత్త పాత్ర ఇంగ్రిడ్ అని, మంచి దొంగ, అంటే అన్ని రకాలుగా కూడా మంచి దొంగ. ఏదైనా, ఎవరిదగ్గరనుంచైనా దొంగతనం చెయ్యగలదు కానీ రాబిన్ హుడ్ లాగ దానాలు చేస్తుంటుంది. ఆసక్తికరమైన పాత్ర. 

ఆమధ్య ఇంకో పుస్తకం చదివాను, నిశ్శబ్దమైన తిరుగుబాటు (జోసి జోసెఫ్), భయంగా అనిపించింది, ఇది ఒకరకంగా "కంచే చేను మేస్తే" లాంటి అనుభూతి. ఎక్కువగా వ్రాయడానికి ఏమీలేదు, చదివి అర్ధంచేసుకోవడమే. 

ఆర్ ఏ డబ్ల్యు (యతీష్ యాదవ్) పుస్తకమొకటి కొన్నాను, చదవాలి. అలాగే జేవియర్ మరియాస్ వ్రాసిన థోమస్ నెవిన్సన్ నవలొకటి కొని చదవడం మొదలుపెట్టాను కానీ మరీ తాపీగా (నెమ్మదిగా :)) ఉంది. తీరికచేసుకుని చదవాలి :)

ఇంకా బోళ్ళు పుస్తకాలున్నాయి చదవడానికి.  ఏసమయానికి ఏది నచ్చునో ఎవరూహించెదరు అనుకుంటూ అన్ని కొద్దికొద్దిగా చదివితే ఏదో ఒకటి కదులుతుంది :)


~సూర్యుడు :-)


Sunday, April 2, 2023

నీడల్లో నడచిన జీవితం

  ఏ ఎస్ దులాత్ వ్రాసిన ఏ లైఫ్ ఇన్ ది షాడోస్ పుస్తకం చదివాను. బాగానే అనిపించింది కానీ నాకతను అంత గొప్ప గూఢచారి అనిపించలేదు. ఐబి వాళ్ళను గూఢచారులంటారా? సరే, ఆయన ఆర్ ఏ డబ్ల్యూ లోకూడా పనిచేశారు. ఆయన వెళ్ళినదగ్గరల్లా ఏదో సమస్య వచ్చినట్లనిపించింది. వాళ్ళు చెప్పుకున్నట్లు, వాళ్ళు పరాజయాలతోనే ప్రాముఖ్యతలోకొస్తారు, అంటే, they are known by their failures.


ఇతను వ్రాసిందే ఇంకో పుస్తకం కూడా కొన్నట్టు గుర్తు కానీ చదవలేదు, చదవాలి. చదవాలన్న ఆసక్తి తగ్గిపోతోంది :)


రాబిన్ కుక్ నైట్ షిఫ్ట్, జాన్ గ్రిషం ది బాయ్స్ ఫ్రొం బిలాక్సి కొన్నాను, ఇవికూడా చదవాలి. 

The woods are lovely, dark and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

Robert Frost


Rather, so many books to read before I sleep (for eternity) :)

~సూర్యుడు :-)

Friday, February 17, 2023

Monday, February 6, 2023

Tuesday, January 3, 2023

Monday, January 2, 2023

Happy New Year!

 Wish you all 

a very happy, healthy, 

wealthy and prosperous new year, 2023