ఎవరో బాగుందంటే The Girl with the Dragon Tattoo నవల కొని చదివాను. ఇది Swedish నవల, తర్వాత ఇంగ్లీష్ లోకి అనువాదం చెయ్యబడింది. నవల సాంతము ఉత్కంఠంగ వుండి బాగుంది. ఆ స్పూర్తితో ఆ నవలా రచయిత వ్రాసిన ఇంకో రెండు నవలలు, The Girl who played with Fire తర్వాత The Girl who kicked hornets' Nest చదివాను. ఇవికూడా బాగున్నాయి. ఈ నవలలు వ్రాసిన తర్వాత Stieg Larsson అకాల మరణం వల్ల అదే శైలిలో వేరే రచయిత వ్రాసిన నవలలు చూసాను కానీ వేరే వాళ్ళు వ్రాసిన Robert Ludlum నవలలు చదివిన అనుభవంతో వాటిజోలికి పోలేదు.
ఈ నవలల్లో ఏంబాగుందంటే చెప్పడానికేమీలేదు, ఇంతకుముందు అనుకున్నట్లు, జర్నలిస్టులకు బాగా (చదివించేలా) వ్రాసే గుణం ఉంటుందేమో. మహిళల హక్కులు, వారి స్వేచ్ఛ వీటిమీద ఈ రచయితకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నట్టున్నాయి, ఆయన వాటిని బాగా చెప్పడానికి ప్రయత్నించాడు.
ఈ నవలలు, ముఖ్యంగా రెండోది, మూడోది, చదువుతుంటుంటే డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో
అర్ధమవుతుంది.
The Girl who kicked hornets' Nest చదివిన తర్వాతఏమనిపించిందంటే, మనం బాగా నమ్మినవాళ్ళే మనల్ని మోసం చేస్తారేమోనని. సరే నమ్మితేనే మోసం చెయ్యడానికి సులువుగా ఉంటుంది కదా ;). ఏదో "నమ్మి చెడినవాడు లేదంటారు" కదా, దీని భావమేంటో :)
The Silent Patient అనే నవలోకటి కొన్నాను. సమయం చూసుకొని చదవాలి.
ICC World Cup 2023 అనే రియాల్టీ షో చూస్తున్నారా లేదా? :)
~సూర్యుడు
“There are two motives for reading a book; one, that you enjoy it; the other, that you can boast about it.”
No comments:
Post a Comment