కలెక్టర్ అంటే మన జిల్లా కలెక్టర్ కాదు కానీ డేనియల్ సిల్వా వ్రాసిన ది కలెక్టర్ అనే క్రొత్త నవల. సరే గాబ్రియెల్ అలోన్ నవల కదా అని కొని చదివాను. నవల బాగుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో జరిగిన కాల్పనిక కథ. నవలానాయకుడు పురాతన చిత్తరువులు పునరుద్ధరించేవాడవడంవల్ల (ప్రస్తుత ఉద్యోగం) నవల ఒక ప్రాచుర్యమైన చిత్తరువు దోపిడీతో మొదలవుతుంది. ఇది ఇంతకుమునుపు నవలకన్నా చాలా బాగుంది. డేనియల్ సిల్వా నవలల్లో ఉండే పాత్రలన్నీ (అన్ని అంటే అన్ని అని కాదు, చాలా వరకు అని) కనిపించాయి ఇందులో.
ఈ నవలలో ఒక క్రొత్త పాత్ర ఇంగ్రిడ్ అని, మంచి దొంగ, అంటే అన్ని రకాలుగా కూడా మంచి దొంగ. ఏదైనా, ఎవరిదగ్గరనుంచైనా దొంగతనం చెయ్యగలదు కానీ రాబిన్ హుడ్ లాగ దానాలు చేస్తుంటుంది. ఆసక్తికరమైన పాత్ర.
ఆమధ్య ఇంకో పుస్తకం చదివాను, నిశ్శబ్దమైన తిరుగుబాటు (జోసి జోసెఫ్), భయంగా అనిపించింది, ఇది ఒకరకంగా "కంచే చేను మేస్తే" లాంటి అనుభూతి. ఎక్కువగా వ్రాయడానికి ఏమీలేదు, చదివి అర్ధంచేసుకోవడమే.
ఆర్ ఏ డబ్ల్యు (యతీష్ యాదవ్) పుస్తకమొకటి కొన్నాను, చదవాలి. అలాగే జేవియర్ మరియాస్ వ్రాసిన థోమస్ నెవిన్సన్ నవలొకటి కొని చదవడం మొదలుపెట్టాను కానీ మరీ తాపీగా (నెమ్మదిగా :)) ఉంది. తీరికచేసుకుని చదవాలి :)
ఇంకా బోళ్ళు పుస్తకాలున్నాయి చదవడానికి. ఏసమయానికి ఏది నచ్చునో ఎవరూహించెదరు అనుకుంటూ అన్ని కొద్దికొద్దిగా చదివితే ఏదో ఒకటి కదులుతుంది :)
~సూర్యుడు :-)
2 comments:
ఏమో నండీ ఏదేదో చదివి పారేస్తున్నారు
ఒక్క ముక్కా అర్థం కావటంలేదుస్మీ :)
@ Zilebi:
Thanks for your comment. After long time :)
Haven't read much in the recent past, a few books/novels.
As I am not able to find the right choice of words in Telugu, I can understand your point :-)
BTW, now I am reading The Girl with the Dragon Tattoo. Somehow, I thought it may not be an interesting one but someone suggested recently. So far so good. A different style.
Post a Comment