Random thoughts, అంటే ఏవో అలా అనుకోకుండా వచ్చే ఆలోచనలు. దీనిని తెలుగులో ఏమనాలో సమయానికి గుర్తురాక గూగులయ్యని (ఎప్పుడూ గూగులమ్మేనా అని, అయ్యవారిని అడిగా :)) అడిగితే యాదృఛ్చిక ఆలోచనలు అన్నాడు. సరే మరీ మక్కీ కి మక్కీ లా వుందని ఇలాంటి శీర్షిక.
ఇంతకీ ఈ ఆలోచనలు దేనిగురించంటే, స్మార్ట్ ఫోన్స్ గురించి.
మీకెప్పుడైనా మీరు మాట్లాడిన వాటికి సంబంధించిన SMSలు గాని mails గాని వచ్చాయా?
అంటే, మీకెప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ మీ మాటలు వింటోందనిపించిందా?
నా అనుమానమేంటంటే అన్ని స్మార్ట్ ఫోన్లు ఎప్పుడూ మన మాటలు వింటూనేఉంటాయని. మనం మాట్లాడుకునే విషయాల్లో పెద్దగా రహస్యాలేవీ ఉండవుకాబట్టి అవి విన్నా పర్వాలేదు కానీ ఎప్పుడైనా intimate విషయాలు మాట్లాడుకునేటప్పుడుకూడా అవి వినేస్తుంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఈ స్మార్ట్ ఫోన్లే అస్తమానము వింటుంటే మళ్ళీ ప్రత్యేకంగా Amazon Echoలు Google Homeలు అవసరమా?
ఇంట్లో ఎవరూ లేకుండా ఎవరైనా పెద్దవాళ్ళుంటే Amazon Echoలు Google Homeలు ఉపయోగపడతాయేమో కానీ అటుఇటు తిరుగుతుండే వాళ్ళకి అనవసరమేమో.
మీకేమనిపిస్తోంది?
~సూర్యుడు :-)