Monday, July 15, 2024

కాలక్షేపం కబుర్లు

 Paulo Coelho's The Alchemist మళ్ళీ చదువుదామనుకున్నాను కానీ కుదర్లేదు. పనెక్కువైపోయింది :)

సరే క్రొత్త నవలలు చదువుదామని వెతికితే David McCloskey's Mascow X కనపడింది. ఇతనిదే ఇంతకుముందేదో చదివినట్టనిపించి కొన్నాను. అలాగే David Ignatius' Phantom Orbit కొన్నాను. వీటిగురించి goodreads లో చదువుతుంటే Paul Vidich's నవల Beirut  Station బాగుందన్నాడు. దాంతో అదికూడా కొనేసి ఓ పనయ్యందనిపించాను. ప్రస్తుతం Beirut  Station చదువుతున్నాను. సో ఫార్ సో గుడ్. Daniel Silva's A Death in Cornwall నవల రాబోతోంది, వచ్చాక కొని చదవాలి.

ఈ మధ్యనే Safe House సినిమా చూసాను. ఇంతకుముందు కూడా చూసాను కానీ మొత్తం పూర్తిగా చూడలేదు. ఈ సారి కుదిరింది. మీరు చూడకపోతే తప్పుకుండా చూడండి . నాకు నచ్చింది, మంచి సినిమా. 

 ఈ మధ్య BMTC బస్సులో వెళుతుంటే నాకు ప్రక్క స్టాపులో సీటు దొరికింది. ఇంకొంత దూరం వెళ్ళాక ఓ పెద్దాయన బస్సెక్కారు. నేను లేచి సీటు ఇద్దామా వద్ద అని ఆలోచించేలోగా వెనుక సీటులో కూర్చున్న ఓ చిన్నబ్బాయి, బహుశ నాలుగో క్లాసో ఐదో క్లాసో చదువుతుండొచ్చు, లేచి ఆ పెద్దాయనకు సీటిచ్చాడు. పెద్దవాళ్ళే ఆలోచిస్తున్నప్పుడు అంత చిన్నవాడు అలాచెయ్యడం నాకు చాల ఆశ్చర్యమనిపించింది, సంతోషం కూడా వేసింది. ఇంట్లో, బడిలో మంచి విలువలు నేర్పిస్తున్నారనిపించింది. 

చివరాఖరిగా ఇవాళ వార్తా పత్రికల గురించి చెప్పుకోవాలి. నాకు టైమ్స్ అఫ్ ఇండియా అంటే చిరాకు కానీ ఎవరో subscribe చేసుకోండి అని బుఱ్ఱ తినేస్తుంటే సరే అని మొదలు పెట్టాను. ఈ రోజు మొదటి పేజీలో డోనాల్డ్ ట్రంప్ డెత్ అని శీర్షిక. ఏమైనా అర్ధముందా. సెన్సేషనలైజషన్ కి పరాకాష్ట. అదే వార్తని ది హిందూ లో వేరే రకంగా వేశారు, బహుశ, అసాసినేషన్ ఆట్టెంప్ట్ ఆన్ డోనాల్డ్ ట్రంప్ అని అనుకుంట. ఎప్పుడో చిన్నప్పుడు వార్త పత్రికలు - విలువలు అని అనుకుంటా ఓ పాఠం చదువుకున్నాను. అందులో చదువుకున్నదేంటంటే, గాంధీ గారు చనిపోయినప్పుడు ది హిందు  న్యూస్ పేపర్లో, గాంధీ ఈస్ డెడ్ అని సింగల్ కాలమ్ న్యూస్ గా వేశారని. ఇప్పడు వార్తలంటే కాదు వార్తాపత్రికలంటేనే చిరాకొస్తోంది :). సరే TV న్యూస్ చానెల్స్, వెబ్ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ అంతకంటే గొప్పగా ఏమి లేవు. వాట్సాప్ గ్రూపుల గురించి చెప్పక్కర్లేదు కదా, ఎక్కడలేని చెత్తంతా అక్కడే. ఫేసుబుక్ వాళ్ళనుండి అంతకన్నా ఏం ఆశించగలం  కదా :)

 

~సూర్యుడు :-)

4 comments:

Zilebi said...

సూర్యుడు నిదుర లేచెను :)

Anonymous said...

Usage of Trump (here in this heading) mean "tricking or defeating" - like Donald trump (defeat) death.

Anonymous said...

The headline reads 'Donald Trumps Death.' clever play of words. MSM can't hide it's dislike for Trump.

సూర్యుడు said...

@Zilebi

Thanks for your comment :)


Thank you @Anons. I didn't observe that keenly. For me, the title sounded something else.