Friday, October 25, 2024

ఇంకో మూడు నవలలు

 ఈ మధ్య ఓ మూడు నవలలు కొన్నాను చదువుదామని. ఫాంటమ్ ఆర్బిట్, మాస్కో X ఆ తర్వాత ఏ డెత్ ఇన్ కాన్వాల్. మొదటి రెండిట్లో ఏది మొదలుపెడమా అని ఆలోచిస్తూ సీషన్డ్ రచయిత వ్రాసిన ఫాంటమ్ ఆర్బిట్ మొదలుపెట్టాను. ఇదేదో సైన్స్ స్పై ఫిక్షన్ లా అనిపించింది. నవల చాల బాగుంది. మౌలికంగా GPS సమాచారం చెడిపోతే ఎలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి లేదా సంభవించే అవకాశాలున్నాయన్నదే ఈ నవల ఇతివృత్తం. మన దేశంలో విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయా అన్నదే ప్రశ్న. అంటే GPS  లేదా స్పేస్ గురించే అవ్వక్కర్లేదు కానీ దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జరిపే పరిశోధనలు లాంటివి.

ఆ తర్వాత డేనియల్ సిల్వా ఏ డెత్ ఇన్ కాన్వాల్ నవల వచ్చింది. నవల బాగుంది. యూకే లో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా వ్రాసిన నవల. ఇందులో ప్రధాన పాత్రలైన ప్రధాన మంత్రి, అతని భార్య పేర్లు ఇంగ్లీషువైనా అవెందుకో ప్రస్తుత ప్రధానమంత్రికి ముందున్న ప్రధాని గురించేమో అనిపించింది.

ఇప్పుడు డేనియల్ సిల్వా కథ నాయకుడు గురించి చెప్పుకోవాలి. అదే గాబ్రియేల్ అల్లోన్. ఇతని లెజెండ్ ఏమిటంటే, మ్యూనిక్ ఒలింపిక్స్ లో ఇజ్రాయెల్ ఫుట్బాల్ టీం ను చంపిన వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకున్న టీమ్ కు నాయకుడుగా ఎలా విజయం సాధించాడన్నది. ఇలా కథానాయకులకు ఒక నిర్ణిత సమయంలో జరిగిన సంఘటనతో ముడిపెడితే వచ్చే ఇబ్బందేమంటే ఆ కథానాయకుడి వయస్సు సుమారుగా స్థిరీకరించబడి కొన్నేళ్ళకు ముసలితనం వచ్ఛేస్తుంది :)

నా లెక్క ప్రకారం ప్రస్తుతం గాబ్రియేల్ కు సుమారుగా ఓ 74 సవత్సరాలుండాలి. ఈ వయస్సులో తుపాకులు పట్టుకుని పరిగెత్తడం కష్టమే :)

ఈ నవలలో ఏదో సంభాషణ ఉంటుంది దాని అర్థం స్థూలంగా డబ్బులవల్ల అధికారం ఆ తర్వాత అధికారం వాళ్ళ ధనం వస్తాయని. సరే, అందరికి తెలిసిన విషయమే. 

ఆ తర్వాత మాస్కో X మొదలుపెట్టాను. ఎంతకీ ముందుకు కదలదే. మొత్తానికి పూర్తయ్యింది. మొదటి 200 పేజీలు ఎందుకున్నాయో  అర్ధం కాలేదు. పోగా పోగా బాగుంది. వాస్తవానికి దగ్గరగావుండే గూఢచారి కథలు ఇలాగే  ఉంటాయేమో :)


ఇప్పుడు ఏ జెంటిల్మన్ ఇన్ మాస్కో, ఏ కాలమిటీ అఫ్ సోల్స్, ది స్పై అండ్ ది ట్రైటర్ పుస్తకాలూ కొన్నాను. సమయం చూసుకొని చదవాలి.


~సూర్యుడు :-)

No comments: