చీమలు ఎక్కడకు వెళ్తాయి? బెల్లమున్నచోటికి (ఆహారమున్నచోటికి). అబ్బా ఛా, మాకిన్నిరోజులు తెలీలేదే అనుకోకండి, నేను Linux installation గురించి అనుకున్నట్టు. ఇది మనకందరికీ తెలిసిందే, క్రొత్తగా కనిపెట్టిందేమీ లేదు. అలాగే మిగిన జంతువులూ, మనం కూడా. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడకు. మనకు ఆహారం పని చేస్తేగాని దొరకదు కాబట్టి, ఎక్కడ పనుంటే అక్కడకు పోతాం. మనవాళ్ళు రైల్వే ఉద్యోగాలకోసం ఖరగపూర్ వెళ్ళినా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం బెంగళూరు, చెన్నై , పూణే ఇంకా ఇతర దేశాలు వెళ్ళినా ఇందుకోసమే. ఎక్కడ ఉపాధి అవకాశాలుంటే అక్కడకు వలసలు సహజం.
బ్రిటిష్ పరిపాలనలో చాలా మంది వ్యవసాయ కూలీలుగా ఇతరదేశాలకు వలసవెళ్ళినట్లు చదువుకుంటుంటాము కదా. ప్రస్తుతం మన దేశంలో చూసినట్లైతే వివిధ ప్రాంతాలనుండి బెంగళూరుకు వలస వచ్చేస్తున్నారు. అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాలకు వలసలు ఎక్కువైనట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. నిజమయ్యుండొచ్చు కాకపోవచ్చు.
ఎప్పుడో ఆర్యులు వలస వచ్చారా లేదా అన్నది ప్రక్కన పెడితే, ఇప్పటి వలసలు నిజం, మనం చూస్తున్నాము. దక్షిణాది రాష్ట్రాల వారు ఉత్తరాదికి వలసలు వెళ్ళలేదా అంటే, వెళ్ళుండొచ్చు కానీ ఇంత కొట్టొచినట్లుగా అనిపించలేదు. ఇవి ఇలాగె కొనసాగితే కొన్ని తరాల తర్వాత జనాభా లెక్కలెలా (అదే demography ) ఉంటాయో.
మీకేమనిపిస్తోంది?
~సూర్యుడు :-)
No comments:
Post a Comment