Wednesday, September 16, 2026

Ransom

దీన్ని తెలుగులో ఏమంటారో తెలీదు. గూగుల్ లో వెతికితే కనిపించింది నచ్చలేదు. నష్టపరిహారమని కనిపించింది. Ransom నష్టపరిహారమెలా అవుతుంది?

 Daniel Silva ఇంకొక గాబ్రియేల్ అలాన్ నవల. ఇదేదో ఆవూ చెట్టు కథలాంటిది. మొత్తం కథంతా డిటెక్టివ్ కథలాంటిది. చివర్లో దాన్ని తీసుకెళ్ళి ఒక రష్యన్ స్పై ఏజెన్సీకి లింకు పెట్టి దీన్ని ఒక స్పై నవల అనుకోవాలి :)

 ఏమైనా ఈ నవలకు కూడా చదివించే లక్షణముంది.

 

ఎలా అయితే  ప్రోగ్రామర్లుకు ప్రోగ్రామ్స్ వ్రాసే అవసరం తగ్గిపోతోందో, ఈ స్పైస్ కూడా ఫీల్డ్ వర్క్ తగ్గిపోతున్నట్టుంది. అంతా టెక్కింటే ;)

 

David McCloskey ది పెర్షియన్ నవల కొన్నాను. చదవాలి ఎలాఉంటుందో.

 Josy Joseph ది బర్త్ అఫ్ ఆ నేషన్, Gillian Flyn Gone Girl , Thomas Harris The  Silence of the Lambs, Vijay Ghokale China's Wars ఇంకా ఏవో కొన్ని పుస్తకాలు కొన్నాను. చదవడానికి అసలు సమయం దొరకడం లేదని తెలిసి కూడా ఇవన్నీ కొనుక్కొచ్చాను. చూడాలి ఎప్పటికి కుదురుతుందో.

కాగ్ - ఎప్పుడో విన్నట్టుంది. ఈ డిపార్ట్మెంట్ ఇంకా ఉందా, చెత్త కాగితంలా చింపి పడేశారా  ;)

 ~సూర్యుడు :-) 

No comments: