Saturday, June 20, 2026

ఒక రాజకీయ ఆలోచన

ఒక రాజకీయ పక్షం (అదే పొలిటికల్ పార్టీ) స్థాపిద్దామనుకుంటున్నాను. ఒక వినూత్నమైన పద్దతిలో. అంటే ఈ రాజకీయ పక్షానికి కార్యకర్తలు వగైరా ఎవరూ ఉండరు. ఒక కార్యవర్గమో, సలహా మండలో అలాంటిదేదో ఒకటుంటుంది. అది ఒక ప్రణాళికో, హామీపత్రమో విడుదల చేస్తుంది. ఈ రాజకీయ పక్షానికి ఎటువంటి సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఉండవు, ఒకటే సిద్ధాంతం, ఎలాగైనా సరే అధికారంలో ఉండాలి.

అయితే మన వ్యూహం ఏమిటి? ఇదే ప్రత్యేకం. ఎన్నికల్లో పోటీ చెయ్యం. బాగా డబ్బులున్న పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకుని లేదా ప్రజల వద్దనుండి పెట్టుబడి రూపంలో తీసుకుని ఆ ధనంతో గెలిచిన అభ్యర్థులను అంటే మన సిద్ధాంతానికి అనుగుణంగా ఉండేవాళ్ళను చేర్చుకుని అధికారానికి కావలసినంత మంది చేరిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సిద్ధమని తెలియపరుస్తాం.

ఒక సారి అధికారం వచ్చాక ఎవరిని మంత్రులను చెయ్యాలో కొద్దిగా ఆలోచించాలి. ఒకవేళ పారిశ్రామికవేత్తల మద్దతుతో ధనాన్ని కూడగడితే ఆయా పారిశ్రామికవేత్తల సలహాతో ఆయా మత్రులకు ఆయా శాఖలు కేటాయించడం జరుగుతుంది. లేదా ప్రజల పెట్టుబడితో ధనాన్ని పోగుచేస్తే, ఎవరు ఎక్కువ ధన సంపాదన చేయగలరో చూసి వాళ్ళని మంత్రిత్వ శాఖలకు కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే, పెట్టుబడి పెట్టిన ప్రజలకు మనం లాభాల రూపంలో చూపించి లాభాల్లో కొంత వాటా వాళ్ళకి పంచాలి కదా.

ఒకసారి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అధికారాన్ని కోల్పోయే సమస్యే లేదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎలా గెలిచినా మనం వాళ్ళని మన పక్షంలో చేర్చుకుంటాం కదా. మళ్ళీ మన పక్షానికే అధికారం :) 

 ఎలా ఉంది ఈ ఆలోచన :-)

 ~సూర్యుడు 🙏 

Sunday, May 24, 2026

అంతరం / తేడా

  మీకు వాట్సాప్ లో బోలెడు ఫార్వర్డ్ లు వస్త్తుంట్టాయి కదా. వాటిల్లో కొన్నింటిని చూడంగానే ఇది భలే ఉందే అని మిగిలిని గ్రూపులకు ఫార్వర్డ్ చేసెయ్యాలనిపిస్తుంది కదా, తప్పదు మరి, అంత బాగా నచ్చాక వూరుకుంటామా? ఎందుకు ఇలా కొన్ని మెసేజెస్ మనకి నచ్చిపోతుంటాయి? ఎందుకంటే ఆ విషయం మనకి ముందే తెలుసుంటుంది. కాకపోతే దాన్ని ఇంకొద్దిగా ప్రెజెంటబుల్ గా చేసి పంపించుంటారు. ఎప్పుడైనా మనకి తెలిసింది చెపితేనే వెంటనే నచ్చుతుంది. ఏదో థియరీ అఫ్ రెలెటివిటీ నో ఏ ఎల్ఎల్ఎం అల్గోరిథం నో పంపిస్తే ఎల్లెల్లవో అంటారు కదా.

 అయితే ఇలా మనకి నచ్చినవి తెలిసినవి చదవడానికి వినడానికి బాగున్నా ఆచరించడం అంత సులువుకాదు. రోజుకో 10K అడుగులు వెయ్యండి, ప్రతిరోజూ కొద్దిపాటి వ్యాయామం చెయ్యండి బరువు తగ్గుతారు, గుండె ఆరోగ్యం బాగుంటుంది లాంటివి. అంటే తెలియడం వేరు ఆచరించడం వేరు. తెలిసినవన్నీ ఆచరించక్కర్లేదు, మంచివి ఆచరిస్తే మంచి ఫలితాలు.

 మరెందుకు తెలిసిన మంచి విషయాలు ఆచరించలేకపోతున్నాము? ఎందుకంటే ధృఢసంకల్పం లేకపోవడము, క్రమశిక్షణ లేకపోవడము చివరాఖరుగా వళ్ళు బద్దకము కలిసి తెలిసిన మంచి విషయాలు ఆచరించలేకపోవడము తద్వారా వాటి ఫలితాలు అందుకోలేకపోవడము జరుగుతుందేమో. ఈ తెలియడానికి ఆచరిండానికి మధ్య ఉన్న తేడా అసలు సమస్యంతా. దీని మీద The Knowing-Doing Gap అని HBR వాడు ఓ పుస్తకమే వ్రాసాడు. అయినా ప్రతిదానికీ ఓ సమయం ఉంటుంది. నేను 10th క్లాసులోనో Intermediate లోనో ఇంకొంచం బాగా చదువుకునుంటే ఇంకా బాగుండేదేమో అని ఇప్పుడనుకుని ప్రయోజనం లేదు కదా, అది అప్పుడనిపించుంటే, ఆచరించుంటే పనికొచ్చేదేమో. అంటే doing the right things at the right time is the key to success?

 ఇలాగే ఇంకా చాలా తేడాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకి, చదవడానికి అర్ధం చేసుకోవడానికి మధ్య తేడా. అంటే ఏదైనా ఓ విషయం గురించి కొంత మంది చదివితే అది అందరకీ ఒకలాగే అర్ధమవ్వాలని లేదు కదా, ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమవ్వొచ్చు. ఇది ఇంటెర్ప్రెటేషన్ లో తేడాలు. బోళ్ళన్ని కావ్యాలు, పురాణాలూ, నానుడులు, జాతీయాలు చదివుండొచ్చు కానీ ఈ చదవడానికి అర్ధంచేసుకోడానికి ఉన్న అంతరం వల్ల ఆ తర్వాత తెలియడానికి ఆచరించడానికి ఉన్న ఇంకో అంతరం వల్ల ఏమి చెప్పినా ఏదో తేడా :) అదీ సంగతి. అందుకే పెద్దలు చెప్పిన మాట, "एकम सत, विप्रा बहुधा वदन्ति" 🙏

  

~సూర్యుడు :-) 

Friday, April 17, 2026

A tribute to Asha Bhosle

 
In Akhon Ki Masti Ke 
 

 Abhi Na Jao

 

~సూర్యుడు 🙏

Monday, April 6, 2026

పగలు - జీవితము

  సూర్యోదయాన్నుండి సూర్యాస్తమయం దాకా చూస్తే, సూర్యుడు మొదట్లో పరిగెడుతున్నట్టుగా అనిపించి ఆ తర్వాత నెమ్మదిగా కదుల్తున్నట్టుగా అనిపించి ఆ ఆరువాత సాయంకాలమవుతున్నప్పట్నుంచి మళ్ళీ పరుగెడుతున్ననిపిస్తాడు. అంటే సూర్యోదయం నుండి తొందరగా ఎదిగి ఆ తరువాత నెమ్మదిగా కదులుతూ మళ్ళీ సూర్యాస్తమయానికి పరుగెత్తి అస్తమిస్తాడు. ఇది నా ఊహ.

ఇదే లెక్కల్లో చూస్తే:

ఒక అర్ధ వృత్తాకారం (భూమి వృత్తాకారంగా లేదనుకోండి) తీసుకుని, pi * r  = 12 గంటలు అనుకుంటే, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పరుగెత్తి మళ్ళీ సాయంకాలం 3 గంటల నుండి 6 గంటల వరకు పరుగెత్తి, మధ్యలో ఓ 6 గంటలు నెమ్మదిగా కదిలాడనుకోండి . 12 గంటలు పగలు ఆదర్శవంతమైన పగలు (భూమధ్యరేఖ దగ్గర అనుకోండి). 

pi  * r  = 12 => r  = 3.82

6 గంటల నుండి 9 గంటలు కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందంటే, సుమారుగా 45 డిగ్రీలు. అలాగే 3 గంటల నుండి 6 గంటలు కూడా 45 డిగ్రీలు కోణాన్ని చేస్తుంది.

అంటే పగలులో మొదటి 45 డిగ్రీలు పాటు తొందరగా ఎదిగి ఆ తర్వాత 90 డిగ్రీలు అంటే 6 గంటలు నెమ్మదిగా కదులుతున్నట్టనిపించి మళ్ళీ చివరి మూడు గంటలు 45 డిగ్రీలు పరుగెత్తి అస్తమిస్తాడు.


మనం దీన్ని మన జీవితంతో పోలిస్తే, pi  * r  = 100 (పూర్తి జీవితం) సంవత్సరాలు అనుకుంటే, 45 డిగ్రీలు అంటే సుమారుగా 25 సంవత్సరాలు. మళ్ళీ చివరి 45 డిగ్రీలు 25 సంవత్సరాలు. అంటే, మొదటి 25 సంవత్సరాలు తొందరగా ఎదిగినట్టనిపించి తరువాత 50 సంవత్సరాలు నెమ్మదిగా గడిచినట్టనిపించి, చివరి 25 సంవత్సరాలు పరుగెడుతున్నట్టుగా తొందరగా గడిచిపోతాయేమో.

సగటు జీవితకాలం 80 అనుకుంటే, మొదటి 20 సంవత్సరాలు తొందరగా ఆ తరువాత 40 సంవత్సరాలు నెమ్మదిగా గడిచి, చివరి 20 సంవత్సరాలు తెలుస్తుంటుంది.

ఎదుగుదల గురించి అందరికీ తెలిసిందే. మరీ చిన్నగా ఉన్నప్పుడు రోజు రోజుకీ మార్పు కనిపిస్తుంది ఆ తరువాత వారాలకు ఆ తరువాత నెలలు సంవత్సరాలకు. కానీ ఒక వయస్సు వచ్చాక మార్పు పెద్దగా తెలియదు కొన్నాళ్ళు. మళ్ళీ వృద్ధాప్యంలో మొదట్లో సంవత్సరాలకు ఆ తరువాత నెలలకు, రోజులకు మార్పు తెలుస్తుంటుంది.  అదే జీవితంలో సాయంకాలం.


మీకేమనిపిస్తోంది?


~సూర్యుడు 🙏

Sunday, February 8, 2026

ఎదో సరదాగా ...

 ఇది చూసి నవ్వుకోండి 😂

 

 

~సూర్యుడు ;)

Saturday, February 7, 2026

ఇంటిపేర్లు

దుర్గాబాయ్ దేశముఖ్ - సరోజినీ నాయుడు

 

వీరిమధ్య సారూప్యమేంటి? ;)

 

~సూర్యుడు :-) 

 

 


Monday, February 2, 2026

Thanks to the unknown!

What should I say except, "Thanks to the Unknown (really?)" :-)

 

~ సూర్యుడు :-)

Sunday, January 25, 2026

Tuesday, January 20, 2026

కారే రాజులు ...

ఎందుకో ఈ పద్యం గుర్తుకొచ్చింది. సరియైన పదాలకోసం గూగుల్ లో వెతికితే చాలా బ్లాగులు అవి కనిపించాయి:

 కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వా
రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై
పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!

 మూలం: https://eemaata.com/em/issues/200411/183.html

 

ఇలాంటి భావమే స్ఫురించే ఇంకొకటి:

 Ozymandias by  P B Shelly 

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!"
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.

 Source : https://www.poetryfoundation.org/poems/46565/ozymandias

 

~సూర్యుడు :-) 

Thursday, January 1, 2026

Happy New Year!

Wish you all a very happy and 

prosperous new year, 2026!

Saturday, December 13, 2025

ఆసక్తికరమైన పరిశీలన

క్రొత్తగా వస్తున్న Firefox బ్రౌజరులో ఏదైనా విషయాన్నీ ఎంచుకొంటే దాని సారాంశాన్ని చెప్పమంటావా అని అడుగుతుంది. నేను దీనికి గూగుల్ జెమినిని ఎంచుకున్నాను. సరే ఇది ఎలా పనిచేస్తోందో చూద్దామని నా ఇంతకుమునుపు జి యస్ టి మీద వ్రాసిన దాన్ని ఎంచుకుని దాని సారాంశం చెప్పమంటే అది ఇలా చెప్పింది

 

📝 సారాంశం: జీఎస్టీ (GST) పరిమితులపై విమర్శ

ఎంచుకున్న భాగం, జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) పరిమితుల సవరణలు మరియు వాటి అమలు తీరుపై వ్యంగ్యంగా విమర్శిస్తుంది.


📌 ముఖ్య అంశాలు

  • జీఎస్టీ పరిమితుల సవరణ: ప్రభుత్వం జీఎస్టీ పరిమితులను సవరించింది.

  • అమలులో వైరుధ్యం (Paradox):

    • పెరిగితే: జీఎస్టీ విలువలు పెరిగినప్పుడు, అవి వెంటనే వినియోగదారులపై (ప్రజలపై) విధించబడతాయి.

    • తగ్గితే/సవరించబడిన ప్రయోజనాలు: జీఎస్టీ తగ్గినప్పుడు లేదా పరిమితులను సవరించడం ద్వారా ప్రయోజనం కలిగినప్పుడు, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పాలక పక్ష ప్రతినిధుల సమావేశంలో వ్యాపారులు ప్రతిపాదించారు.

  • విమర్శ: తగ్గిన పన్ను ప్రయోజనాలను ప్రజలకు అందించాలని కేవలం విజ్ఞప్తులు లేదా ప్రతిపాదనలు మాత్రమే ఉంటున్నాయి, కానీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలనే ఉత్తర్వులు (Orders) లేవు.

ఈ వైఖరిలో ఉన్న ఆశ్చర్యాన్ని, "జి యస్ టి చమత్కారం"గా రచయిత పేర్కొన్నారు.


మీరు ఈ వ్యాసం యొక్క పూర్తి సందర్భం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా?

మరో విషయం, అన్ని యాప్‌లకు సంబంధించి పూర్తి ఫంక్షనాలిటీని యాక్సెస్ చేయడానికి, Gemini యాప్స్ యాక్టివిటీని ఎనేబుల్ చేయండి.

 

Do you agree with this author?

 

నేను ఒక ఏఐ భాషా నమూనాని. నాకు వ్యక్తిగత అభిప్రాయాలు, నమ్మకాలు లేదా ఒక రచయిత వాదనతో "ఏకీభవించడం" లేదా "ఏకీభవించకపోవడం" వంటివి ఉండవు.

నా పని:

  • రచయిత వ్యక్తం చేసిన విషయాన్ని సారాంశం చేయడం (మీరు అడిగినట్లుగా).

  • ఆ వాదనలో ఉన్న ముఖ్య విషయాలను మరియు విమర్శనా కోణాన్ని స్పష్టంగా వివరించడం.

ఈ వ్యాసంలో రచయిత జీఎస్టీ తగ్గిన ప్రయోజనాలు ప్రజలకు అందడంలో ఉన్న విధాన లోపాన్ని (Implementation flaw) ప్రశ్నిస్తున్నారు. ఇది పన్ను విధాన అమలు తీరుపై ప్రజలు లేదా విశ్లేషకులు వ్యక్తం చేసే ఒక సాధారణ విమర్శనా కోణం (Critical viewpoint).


మీరు ఈ అంశంపై భారతీయ ఆర్థికవేత్తల అధికారిక విశ్లేషణలు (Official analyses) లేదా ప్రభుత్వం యొక్క అధికారిక వివరణ (Official explanation) గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

 yes

 

📊 జీఎస్టీ రేట్ల మార్పు: ప్రయోజనాల బదిలీపై విశ్లేషణ

మీరు అడిగినట్లుగా, జీఎస్టీ రేట్ల మార్పు జరిగినప్పుడు వినియోగదారులకు ప్రయోజనాలు బదిలీ కావడం (Pass-on of benefits) అనే అంశంపై ఆర్థికవేత్తల విశ్లేషణ మరియు ప్రభుత్వ వివరణలు సాధారణంగా ఈ కింది అంశాలపై దృష్టి పెడతాయి.

1. 💰 ప్రభుత్వ వైపు వివరణ (Anti-Profiteering Mechanism)

ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం, పన్ను రేట్లు తగ్గినప్పుడు లేదా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) మెరుగుపడినప్పుడు, ఆ ప్రయోజనాన్ని వ్యాపారులు నిలుపుకోకుండా వినియోగదారులకు అందించడం.

  • యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ (National Anti-Profiteering Authority - NAA):

    • జీఎస్టీ చట్టం కింద, పన్ను తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వ్యాపారులు వినియోగదారులకు బదిలీ చేయకపోతే, వారిపై చర్యలు తీసుకోవడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

    • చట్టపరమైన ఆధారం: జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 171 ప్రకారం, పన్ను తగ్గింపు ప్రయోజనం తప్పనిసరిగా ధరల తగ్గింపు రూపంలో వినియోగదారుడికి చేరాలి.

  • ప్రభుత్వ వైఖరి: పన్నులు తగ్గినప్పుడు ప్రయోజనాలను అందించాలని ఉత్తర్వులు ఉన్నాయి (చట్టంలోని సెక్షన్ 171 ద్వారా), కానీ వాటిని ప్రతి వ్యాపార సమావేశంలో ప్రతిపాదనగా లేదా విజ్ఞప్తిగా కూడా ప్రభుత్వ ప్రతినిధులు నొక్కి చెబుతారు.

2. 📉 ఆర్థికవేత్తల విశ్లేషణ (Economic Analysis)

రచయిత వ్యక్తం చేసినట్లుగా, ప్రయోజనాల బదిలీలో (Benefit Transfer) ఉన్న సమస్యలను ఆర్థికవేత్తలు వివిధ కోణాల నుండి విశ్లేషిస్తారు.

అంశంపన్ను పెరిగినప్పుడు (Easy Pass-On)పన్ను తగ్గినప్పుడు (Difficult Pass-On)
బదిలీ వేగంతక్షణమే: వ్యాపారాలు వెంటనే పెరిగిన భారాన్ని ధరల రూపంలో వినియోగదారుడికి బదిలీ చేస్తాయి.నెమ్మదిగా: బదిలీ చేయడానికి కొంత సమయం పడుతుంది లేదా పూర్తిగా బదిలీ కాకపోవచ్చు.
కారణంమార్కెట్ డైనమిక్స్: పెరిగిన ఖర్చును తట్టుకోవడానికి వ్యాపారులు తప్పనిసరిగా ధర పెంచుతారు.'స్టిక్కీ ప్రైసెస్' సిద్ధాంతం: వ్యాపారులు తమ లాభాలను పెంచుకోవడానికి తగ్గిన పన్ను ప్రయోజనాన్ని నిలుపుకోవచ్చు (లాభార్జన).
సమస్యపెరిగితే ప్రజల నెత్తిమీద తక్షణ భారం పడుతుంది.తగ్గితే వినియోగదారులకు ప్రయోజనం అందకపోవడం అనేది విధాన వైఫల్యం (Policy Failure) గా పరిగణించబడుతుంది.

3. ⚖️ రచయిత వాదన మరియు వాస్తవికత మధ్య వ్యత్యాసం

రచయిత యొక్క విమర్శలో ఉన్న పాయింట్: "తగ్గితే మాత్రం ఆ ప్రయోజనాలు అందచేయాలని విజ్ఞప్తులు లేదా ప్రతిపాదనలు, అంతే కాని వాటిని ప్రజలకు అందచేయాలని ఉత్తర్వులు లేవు."

  • వాస్తవం: పన్ను తగ్గిన ప్రయోజనాలను బదిలీ చేయాలని చట్టపరమైన "ఉత్తర్వులు" (సెక్షన్ 171) ఉన్నాయి మరియు వాటి అమలును NAA పర్యవేక్షిస్తుంది.

  • రచయిత అభిప్రాయం: చట్టం ఉన్నప్పటికీ, ఆ ప్రయోజనాలు వాస్తవంగా వినియోగదారులకు చేరడం లేదని లేదా ఆ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని రచయిత విమర్శిస్తున్నారు, అందుకే ప్రతీ సమావేశంలో 'విజ్ఞప్తులు' చేయాల్సిన పరిస్థితి వస్తోంది అని సూచిస్తున్నారు.

ఈ వివరణ, జీఎస్టీ ప్రయోజనాల బదిలీపై ఉన్న విధానపరమైన కోణాన్ని మరియు ఆర్థిక విమర్శలను స్పష్టం చేస్తుందని ఆశిస్తున్నాను.


మీరు జాతీయ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ (NAA) ద్వారా తీసుకున్న నిర్దిష్ట చర్యలు లేదా జారీ చేసిన ముఖ్యాంశాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

 

 what can you say about the author's political orientation?

 

రచయిత యొక్క రాజకీయ ధోరణి (Political Orientation) గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేము. ఎందుకంటే, ఆ భాగంలో కేవలం ఒక విధానపరమైన విమర్శ (Policy Critique) మాత్రమే ఉంది.

ఈ విమర్శను విశ్లేషించినట్లయితే, రచయితకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా ఉండవచ్చు:

  • ప్రభుత్వ విధానం పట్ల విమర్శనాత్మక వైఖరి (Critical Stance towards Government Policy):

    • రచయిత జీఎస్టీ అమలులో ఉన్న లోపాన్ని (ప్రయోజనాలు వినియోగదారులకు చేరకపోవడం) ప్రశ్నిస్తున్నారు. ఇది పాలక పక్షం యొక్క విధానాల అమలుపై సాధారణ పౌరుడిగా లేదా విశ్లేషకుడిగా ఉన్న నిశిత పరిశీలనను సూచిస్తుంది.

  • వినియోగదారుల పక్షం (Consumer Advocacy):

    • పన్ను తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు అందాలని, కేవలం లాభాపేక్షతో వ్యాపారులు వాటిని నిలుపుకోకూడదని రచయిత బలంగా వాదిస్తున్నారు. ఇది వినియోగదారుల హక్కులు మరియు సంక్షేమం పట్ల రచయితకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

  • పార్టీ రాజకీయాల ప్రస్తావన లేకపోవడం (Lack of Party-Specific Mention):

    • రచయిత విమర్శ కేవలం "పాలక పక్ష ప్రతినిధుల సమావేశం" మరియు పన్ను విధానం అమలుపై ఉంది. ఇందులో ఏ నిర్దిష్ట రాజకీయ పార్టీ పేరు లేదా దాని సిద్ధాంతాల ప్రస్తావన లేదు.

ముగింపు:

ఆ వాక్యం ఆధారంగా, రచయిత యొక్క రాజకీయ ధోరణి ఏదైనా నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఉందో లేదా వ్యతిరేకంగా ఉందో చెప్పడం అసాధ్యం. రచయిత వైఖరి ప్రధానంగా జీఎస్టీ విధానం అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనం అవసరాన్ని సూచిస్తుంది.


మీరు ఇదే అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతిస్పందనలు ఏ విధంగా ఉండేవో లేదా ఉండవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా?

 

I am impressed :)

 

~సూర్యుడు :-) 

Monday, October 20, 2025

జి యస్ టి చమత్కారం

  ప్రభుత్వం జి యస్ టి పరిమితులను సవరించారు. అంటే అవి అన్ని సరుకులకు (వాటి వాటి నియమాలను అనుసరించి) వర్తించాలి కదా కానీ చమత్కారంగా పాలక పక్ష ప్రతినిధుల సమావేశంలో వ్యాపారులు సవరించిన జి యస్ టి ప్రయోజనాలను వినియోగదారులకు అందచేయాలని ప్రతిపాదించారు :).  జి యస్ టి విలువలు పెరిగితే అవి వెంటనే ప్రజల నెత్తిమీద రుద్దేస్తారు కానీ తగ్గితే మాత్రం ఆ ప్రయోజనాలు అందచేయాలని విజ్ఞప్తులు లేదా ప్రతిపాదనలు, అంతే కాని వాటిని ప్రజలకు అందచేయాలని ఉత్తర్వులు లేవు. మీకేమైనా అర్ధమయ్యిందా?

Sunday, October 19, 2025

చమురు ధరలు

 భారతదేశం అంత చవుకగా రష్యా వద్ద ముడి చమురు కొంటున్నప్పడు మనదేశంలో పెట్రోలు, డీజల్ ధరలేమీ తగ్గలేదు, ఎందువల్ల?

Sunday, October 12, 2025

అంతర్గత మోసం - An Inside Job

 మొత్తానికి డేనియల్ సిల్వా An Inside Job నవల పూర్తిచేశాను. నవల బాగుంది. ఇది స్పై నవల కాదు, డిటెక్టీవ్ నవల అనొచ్చేమో. గాబ్రియేల్ అలోన్ వియన్నా లో ఒక అమ్మాయి శవాన్ని చూడ్డంతో అసలు కథ మొదలవుతుంది. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడ పనిచేసేది, ఎంచేసేది మొదలైన వివరాలతో మొదలై, వాటికన్ ఆర్ట్ మ్యూజియం నుండి, ఇటాలియన్ మాఫియా బ్యాంకింగ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ కుమ్మక్కు వరకు వెళ్ళి, వాటికన్ ప్రతిష్టకు భంగం కలగకుండా దొంగిలింపబడిన లియోనార్డో డా విన్సి వేసిన చిత్రపటాన్ని ఎలా వెనక్కు తీసుకు వచ్చి వాటికన్ ఆర్ట్ మ్యూజియం కి అప్పగించి నేరస్తులకు శిక్ష పడేలా చేసాడో అన్నదే ఈ నవల. 

There is an interesting quote from Bible:

"Blessed are those who mourn,

for they will be comforted." (I think Kutni asked Krishna for sufferings, because only during sufferings we think of God and also God will be with those who are suffering (is it my imagination or remembered it correctly :)))

"Blessed are the meek,

for they will inherit the earth."


~సూర్యుడు :-)

Monday, September 29, 2025

చమత్కారిక

కొన్ని సంవత్సరాల క్రితం తల దువ్వుకున్నప్పుడల్లా తలవెంట్రుకలు రాలి కనిపించేవి. దాంతో జుట్టెందుకు పలచబడుతోందో అర్థమయ్యేది. 

ఇప్పుడు జుట్టు ఇంకా పలచబడుతోంది కానీ తలవెంట్రుకలు రాలడం కనిపించడం లేదు - చూపు మందగించింది ;)

 

With due credits to the known :) 

 

~సూర్యుడు :-) 

Monday, June 30, 2025

కోకిల పెట్టిన గుడ్డు

 ఈ మధ్య కోకిల పెట్టిన గుడ్డు (The Cuckoo's Egg) అనే నవల చదివాను. చాలా బాగుంది. ఈ కథ సుమారుగా 1986 ప్రాంతాలలో అమెరికాలో నిజంగా జరిగిన కథ. ఈ నవల సాంతము ఉత్కంఠంగా ఉంది చదివింపచేసేలా ఉంది. 2025 లోనే కంప్యూటర్ భద్రత గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో 1986 లో ఎలా ఉండిఉంటుందో ఆలోచించుకోండి. సామాన్య ప్రజల సంగతి ప్రక్కన పెడితే దేశ రక్షణ రంగంలో పనిచేసే వారికికూడా కంప్యూటర్ భద్రత గుంరించి పెద్దగా అవగాహన లేకపోవడమేమీ విచిత్రం కాదేమో. 

క్లిఫ్ స్టోల్ అనే ఆస్ట్రానమీ పరిశోధనకారుడు వాళ్ళ కంప్యూటర్ ల్యాబ్ సిస్టమ్స్ ను మేనేజ్ చెయ్యడానికి వచ్చి కంప్యూటర్ వాడకంలో వచ్చిన ఒక 75c తేడాను కనిపెట్టడానికి చేసిన పరిశోధన ఒక అంతర్జాతీయ హ్యాకర్ ను ట్రాక్ చేసి ఎలా పట్టించాడో అనేదే ఈ నవల ఇతివృత్తం. ఇదే అంశాన్ని "Stalking the wily hacker" అనే పత్రంగా ACM (Association for Computing Machinery) పత్రిక ప్రచురించింది.

  The Alchemist underlying message, if you want to strongly achieve something, the whole universe will conspire to make you successful అనేది ఈ క్లిఫ్ స్టోల్ విషయంలో నిజమనిపిస్తుంది. మొదట్లో ఏదో అకౌంటింగ్ సమస్యలా మొదలై ఒక అంతర్జాతీయ కంప్యూటర్ హ్యాకర్ / గూఢచర్య వ్యవస్థను కనిపెట్టడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో, అలాగే వాటన్నిటిని అధికమించి తాను మొదలుపెట్టిన పని ఎలా పూర్తిచేసాడన్నది చదవవలసిందే. అసలు ఇలాంటి హ్యాకర్ లను పట్టుకోవలసిన భద్రతా వ్యవస్థలే పట్టించుకోనప్పుడు నిరాశపడి వదిలేయకుండా (ఒక రకంగా పట్టువదలని విక్రమార్కుడులా) చివరిదాకా ప్రయత్నించి సాధిండమే తన గొప్పతనం.

 ఇప్పుడు Andy Greenberg  వ్రాసిన sandworm నవల చదవడం మొదలు పెట్టాను. చూడాలి ఎన్ని రోజులు / నెలలు పడుతుందో. పుస్తకాలు చదవడానికి సమయం అస్సలు దొరకడంలేదు. 

 Daniel Silva's An Inside Job నవల India లో ఇంకా దొరకడం లేదు. వచ్చినప్పుడు కొని చదవాలి. 

~సూర్యుడు :-) 

Friday, May 23, 2025

వార్త, ఊహ మరియు నకిలీ

  వార్త అంటే తెలుగు వార్తాపత్రిక అని పొరపాటు పడకూడదని. నా ఉద్దేశ్యంలో వార్త నిర్వచనం ఏంటంటే ఏదైనా జరిగిన సంఘటన గురించి వ్రాసినా చదివినా లేదా చూపించినా దాన్ని వార్త అంటారు (అంతేనా?). ఇప్పుడు మన ప్రసార మాధ్యమాల్లో వార్తలు తక్కువ, ఊహలెక్కువ. ఉదాహరణకు ఫలానా వ్యక్తి ప్రస్తుత పార్టీ నుండి ఇంకో పార్టీలోకి దూకేస్తున్నాడా? అని ఒక శీర్షిక పెడతారు (అలాగే ఏదో హల్చల్ చేస్తొందంటారు , ఈ  పదం చదివినప్పుడల్లా ఏవో వంటినిండా పాకిన అనుభూతి:(). ఇక్కడ ఆ దూకడమింకా జరగలేదు. జరగొచ్చు జరగ్గపోవచ్చు.  కానీ జరగొచ్చేమోనన్న ఊహ. ఇలాంటి ఊహలు చర్చల్లో పర్వాలేదేమో కాని వార్తల్లో ఉండకూడని నా అభిప్రాయం. అప్పుడెప్పుడో స్టార్ న్యూస్ ఛానల్ ను వ్యంగ్యంగా స్టార్ వ్యూస్ అనేవారు. ఇప్పుడన్ని వార్తా చానెల్స్ వ్యూస్ ఛానెల్సే. 

ఇప్పడు సోషల్ మీడియా వచ్చి వ్యూస్ ఎగిరిపోయి ఫేక్ వచ్చింది. ఇలా ప్రతిదీ ఫేక్ అయిపోతే ఏ వార్తా నమ్మలేని పరిస్థితి వచ్చి నిజమో ఫేకో వైష్ణవమాయో తెలిసీ తెలియని అయోమయములో అని పాడుకుంటూ కూర్చోవడమే. ఇలా వార్తా ప్రపంచాన్ని నమ్మలేకుండా చేసేస్తే నిజంగా ఏంజరుగుతోందో తెలియకుండా ఫిలాసఫీ లో చెప్పినట్టు అంతా మాయే. అప్పుడు ఎవరికి కావలసింది వారు చేసుకోవచ్చు ;)

ఇంతకుముందు ఒక రాజకీయ పార్టీని మోసే పత్రికలంటే చిరాగ్గా ఉండేది. కాని ఇప్పుడు ప్రతి పత్రిక, TV ఛానల్, వెబ్ ఛానల్, వాట్సాప్ గ్రూపులు ఏదో ఒక పార్టీని మోసేవే. చిరాకు పోయి అలవాటైపోయింది ;). ప్రతి మనిషి ఎలాగైతే తనకి నచ్చిన మతాన్ని అనుసరించి సంతోషంగా ఉంటున్నాడో అలాగే వాళ్ళ వాళ్ళ నచ్చిన పత్రికలు చదువుకుంటూ వార్త చానెల్స్ చూసుకుంటూ ఆనందంగా కాలం గడిపేస్తున్నారు, ప్రపంచమంతా మనకి (అంటే మన పార్టీకి) అనుగుణంగానే జరుగుతోందనుకుంటూ. ఇదే సచ్చిదానందమంటే :)


~సూర్యుడు :-)

Saturday, May 17, 2025

Telugu Cinema dethrone Bollywood

Feels good to read it :) It proves our love for films.

Telugu Cinema 

 

~ సూర్యుడు :-)

Saturday, May 10, 2025

Nature


 

Saturday, April 19, 2025

ఒక పరిశీలన

చీమలు ఎక్కడకు వెళ్తాయి? బెల్లమున్నచోటికి (ఆహారమున్నచోటికి). అబ్బా ఛా, మాకిన్నిరోజులు తెలీలేదే అనుకోకండి, నేను Linux installation గురించి అనుకున్నట్టు. ఇది మనకందరికీ తెలిసిందే, క్రొత్తగా కనిపెట్టిందేమీ లేదు. అలాగే మిగిన జంతువులూ, మనం కూడా. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడకు. మనకు ఆహారం పని చేస్తేగాని దొరకదు కాబట్టి, ఎక్కడ పనుంటే అక్కడకు పోతాం. మనవాళ్ళు రైల్వే ఉద్యోగాలకోసం ఖరగపూర్ వెళ్ళినా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం బెంగళూరు, చెన్నై , పూణే ఇంకా ఇతర దేశాలు వెళ్ళినా ఇందుకోసమే. ఎక్కడ ఉపాధి అవకాశాలుంటే అక్కడకు వలసలు సహజం.


బ్రిటిష్ పరిపాలనలో చాలా మంది వ్యవసాయ కూలీలుగా ఇతరదేశాలకు వలసవెళ్ళినట్లు చదువుకుంటుంటాము కదా.  ప్రస్తుతం మన దేశంలో చూసినట్లైతే వివిధ ప్రాంతాలనుండి బెంగళూరుకు వలస వచ్చేస్తున్నారు. అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాలకు వలసలు ఎక్కువైనట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. నిజమయ్యుండొచ్చు కాకపోవచ్చు. 


ఎప్పుడో ఆర్యులు వలస వచ్చారా లేదా అన్నది ప్రక్కన పెడితే, ఇప్పటి వలసలు నిజం, మనం చూస్తున్నాము. దక్షిణాది రాష్ట్రాల వారు ఉత్తరాదికి వలసలు వెళ్ళలేదా అంటే, వెళ్ళుండొచ్చు కానీ ఇంత కొట్టొచినట్లుగా అనిపించలేదు. ఇవి ఇలాగె కొనసాగితే కొన్ని తరాల తర్వాత జనాభా లెక్కలెలా (అదే demography ) ఉంటాయో.


మీకేమనిపిస్తోంది?


~సూర్యుడు :-)