Sunday, November 11, 2007

పరకాయ ప్రవేశము

అందరికి హృదయపూర్వక నమస్కారాలు :-)

ఏ మధ్య కొద్దిగ ఖాళీ గా ఉండి (నాలుగు రోజుల దీపావళి శలవలు కారణంగా)వల (అంటే నెట్) లో పడ్డ చేప పిల్లలాగ వలంతా కలియ తిరిగేస్తూ అనుకోకుండా తెలుగు బ్లాగుల్లో పడ్డాను. చదివిన తర్వాత (చేతులు) ఉండబట్టక తోచింది వ్రాసేసాను. కాకపొతె, ఇక్కొడొచ్చిన సమస్యల్లా, నాకు పేరు లేదు (మామూలుగా అయితే, నాది చాలా పెద్ద/పొడవైన పేరు, సాధారణంగా మన ప్రాంతంలోలా). పోనీలే ఏదో ఊరూ పేరూ లేని కుర్రాడు ఏదో రాస్తున్నడని అనుకోకుండా పెద్దలు బాగా చీవాట్లు పెట్టి పంపిచారు. ఈ సందర్భంలొ నాకొక విషయం గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు రాజు-మాంత్రికుని కథలలో, పరకాయ ప్రవేశాలుండేవి, చాల థ్రిల్లింగ్ గా ఉండేవి అవి చదువుతుంటె.

ఈప్పుడా విషయం ఎందుకంటారా :-). ఇలా నాలా పేరు లేకుండా వచ్చి వ్యాఖలు చేసేవారు కూడ వకరకంగా పరకాయ ప్రవేశం చెయ్యొచ్చు, కావాలనుకొంటె. అగమ్యగోచరంగా అయిపోదు అనుకొంటె, ఇక్కడ వేరే విషయాలు ప్రస్తావిస్తాను. ఎన్నిరకాలుగా (నెట్ లో) పరకాయ ప్రవేశం చెయ్యొచ్చు అంటే:

1. పేరులేకుండా (అంటే, మనం ఆకాశ రామన్న/అనామక రూపం లొ మాట్లాడుతున్నమన్న మాట)
2. మారుపేరు (అంటే, కలం పేరో ఇంకేదో రూపం లో, అంటే సూర్యుడు అలా అన్నమాట :-) )
3. మగ వారు ఆడ వారు గ / అటునించిటు (కొద్దిగ, పరకాయ ప్రవేశమే)
4. వేరే వాళ్ళ కంప్యూటర్లలో దూరి వాళ్ళలాగ (ఇది నిజంగా పరకాయ ప్రవేశం)

ఇది చాల గమ్మత్తుగా ఉందికదా :-)

నిజం చెప్పలంటే ఈ విషయం గురించి చాలా వ్రాయొచ్చు కాని, నేను రేపు ప్రొద్దున్నే మా కార్యాలయానికి వెళ్ళాలికదా, ఇప్పటికి ఇంక శెలవా మరి, మళ్ళీ సమయం చిక్కితే, వేరే ఏదైనా వ్రాయటానికి ప్రయత్నిస్తాను.

మీ (వెలుగు రేఖల) భవదీయుడు,
సూర్యుడు :-)

17 comments:

చదువరి said...

మాయ మబ్బుల మాటు నుండి బయటపడ్డ సూర్యుడన్నమాట! ఇక పంచండి వెలుతురూ, వెచ్చదనం!!

చదువరి said...

మరోటుందండి.. "డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్"! :)

Solarflare said...

తె.బ్లా.కి స్వాగతం. బావుంది మీ పరకాయ ప్రవేశం. మీరెంచుకున్న కాయం వేడిగా ఉంటుందేమో! ఐనా అనామకంగా వ్యాఖ్యలు చేసేసి - మీ బ్లాగులో మాత్రం అనామకంగా చేయడానికి కుదరదంటారా! హ్హెంత హ్హనాయ్యం!

@చదువరిగారు - మీ ఉదాహరణ split personalityని సూచించేది, పరకాయ ప్రవేశం కాదు. Most probably the manifestation of పరకాయ ప్రవేశం to others may seem like split or multiple personalities. :)

చదువరి said...

సోలార్‌ఫ్లేర్ గారూ! ఏ రాయైయేతేనేం లెండి..

Anonymous said...

దొరలకి (సదువరి గోరికి, బ్లాగాగ్ని గారికి) దండాలు :-)

బ్లాగు అమరికలు సరిచేయడం మర్చిపోయాను. ఇప్పుడు మీ ఇష్టం, ఏ రూపం లో అంటె ఆ రూపం లో విజ్రుంభించేయండి (దయచేసి, వట్రసుడి ఎలా వ్రాయాలో చెప్తారా)

మీ భవదీయుడు,
సూర్యుడు (అనామక పరీక్షలో)

చదువరి said...

R
ఉదా: kR - కృ

Solarflare said...

అంతే అంతే!!

braahmii said...

చదువరి పై చేసిన వ్యాఖ్యల్లోని భాషలో ఉన్నంత తియ్యదనం ఇక్కడ కనిపించటం లేదు. బహుశా మీకు ఆ శైలిపై బాగా పట్టి దొరికినట్లుంది. నాపాత కోరిక సంగతి ఏం చేశారు..ఈనాడు మీద గ్రంథమో వ్యాసమో .....
""ఏటీ మన ఈనాడు, అబ్బ అదేనండీ, మన తెలుగునాడు, ఇంకా అర్దం కాలేదటండీ, మన పార్టీ పత్రిక, అసలు ఇరగదీసేస్తంది కదా, ఏం వార్తలండీ, టయము లేదు గానీ వొక పుస్తకం రాయొచ్చండి. బాగా సదువుకొన్న బాబులు గద ఏటంతారు""
....నెనర్లతో బ్రాహ్మీ

సూర్యుడు said...

చదువరి గారికి, బ్లాగాగ్ని గారికి నా ధన్యవాదాలు (వట్రసుడి నేర్పినందుకు :-) ). నాకెందుకో, నెనర్లు పదం నచ్చలేదు, ధన్యవాదాలే బాగుంది, బహుశ, అలవాటైపొవటంవల్లేమో.

భ్రాహ్మి గారు, మీకు నా గ్రామ్య భాష నచ్చినందుకు చాల సంతొషం, నాకు కూడ అలానే వ్రాయాలని ఉంటుంది కాని, చాలా సమయం తీసుకుంటొందండి. అసలు, తెలుగులో కొన్ని పదాలు తెలియవు, తెలిసినవి వ్రాయటానికి కష్టంగా ఉంది (వట్రసుడి లాగ).

ఏవో కొన్ని అబిప్రాయాలున్నాయి, వ్రాయాలనుకుంటున్నాను. సమయం దొరికినప్పుడు తప్పకుండా, మీకు వీలైతే, రా. వి. శాస్త్రి గారి కథలు ("సొమ్ములు పోనాయండి" తొ మొదలు పెట్టండి) చదవండి, మీరు తప్పకుండా ఆనందిస్తారు. అలాగే, బీ. నా. దేవి గరి "పుణ్యభూమీ కళ్ళు తెరు" కూడా చాలా బాగుంటుంది. అప్పుడు నేనింక ఆ భాషలో వ్రాయక్కర్లేదు :-)

మీ భవదీయుడు,
సూర్యుడు :-)

చదువరి said...

భవదీయుడు లోనే మీ ఉంది గదా (కాదా?), మళ్ళీ "మీ" అవసరమంటారా?

సూర్యుడు said...

నేను అంత అలోచించలేదు, మీరు చెప్పిందే సరి అనుకుంటా ...

తప్పులు సరిచేసినందుకు, ధన్యవాదాలు :-)

భవదీయుడు,
"తెలుగు నేర్చుకుంటున్న" సూర్యుడు

Anonymous said...

బ్లాగు లోకానికి స్వాగతం..

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది

http://jalleda.com

సూర్యుడు said...

జాలయ్య గారికి ధన్యవాదాలు

బ్లాగాగ్ని గారు,

పరకాయ ప్రవేశం, స్ప్లిట్ పెర్సనాలిటీ, మల్టిపుల్ పెర్సనాలిటీస్ కాదేమో, నిజానికి ఇది దానికి వ్యతిరేకం, అంటే, వకే వ్యక్తి విభిన్న రూపాల్లో :-) . రూపురేఖలే మారుతాయి కాని, గుణ గణాలు మారవు (ఆత్మ ఒక్కటే కదా)

భవదీయుడు,
సూర్యుడు

Solarflare said...

ఒహో సూరీడూ (గారు)... నె సెప్పింది కుడా అదే మరి.
నువ్వుగిట్ల గింకో పారి నే సెప్పింది చదిగితే - గప్పుడు clear ఐతది.

The frame of reference I used was the body - and your frame of reference was ఆత్మ. :)

బ్లాగాగ్ని said...

అయ్యా సూరీడుగారూ. మీ టపాలనూ, ఇతర టపాలల్లో మీరు రాసిన వ్యాఖ్యలనూ చూసి ఇక ఉండబట్టలేక ఇది రాస్తున్నాను. సదరు బ్లాగాగ్నిని నేను. సోలార్ ఫ్లేర్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదని మనవి చేస్తున్నాను.

సూర్యుడు said...

బ్లాగాగ్ని గారికి, అలాగే సోలార్ఫ్లేర్ గారికి నా హృదయపూర్వక క్షమాపణలు. సోలార్ఫ్లేర్ గారికే బ్లాగాగ్ని ఇంకొక పేరేమో అనుకున్నాను. ఇప్పటిదాకా బ్లాగాగ్ని అని సంబొధించినవన్నీ సోలార్ఫ్లేర్ గారికే చెందుతాయని ఇందుమూలంగా సవినయంగా మనవి చెసుకుంటున్నాను :-)

నమస్కారాలతో,
సూర్యుడు

బ్లాగేశ్వరుడు said...

సూరీడు గారు నమస్కరం,
అయ్యా సోలార్‌ఫ్లేర్ ని ఇదివరలొ ఆదిత్యహృదయం అని రాకేశ్వరుడు గారు సంబోధించారు , అది సోలార్‌ఫ్లేర్ ఆమోదమేమో చూడండి