సరే, ఈ వారాంతం అనేది ఆంగ్ల వీకెండ్ కి మక్కీ కి మక్కీ అయినా వేరే పదమేదీ గుర్తుకురాలేదు. ఈ శని, ఆది వారాలు కొద్దిగా తీరిక దొరికి, సినేమా మేళా అని నిశ్చయం చేసి, శని వారం ఉదయాన్నే "ద అన్‌టచబుల్స్" అనే చిత్రరాజంతో మొదలు పెట్టి, తర్వాత సాల్ట్, ఆ తర్వాత నో వన్ కిల్డ్ జెస్సికా, ఆ తర్వాత వాల్ స్ట్రీట్ చూసేసి ఓ పనయ్యిందనిపించా.
ద అన్‌టచబుల్స్ గురించి చెప్పాల్సిందేమీ లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే, సూపర్. ఇలాంటి వాళ్లు మన దేశంలో ఉంటారా అనుకుంటుండంగానే, నో వన్ కిల్డ్ జెస్సికా లో ఓ పోలీసు ఆఫీసర్ కనిపించి ఆశ్చర్యం కలిగించాడు.
సాల్ట్ సినేమా గురించి కూడా చెప్పడానికేమీలేదు. నాకు స్పై సినేమాలిష్టం కాబట్టి, ఓకె అదర్వైస్, టైం వేస్ట్.
వాల్ స్ట్రీట్ సినేమా పర్వాలేదు. ఈ మధ్య ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దీనిమీద ఓ బొచ్చెడు పుస్తకాలు కొనేసి, ప్రస్తుతానికి ఏనిమల్ స్పిరిట్స్ చదువుతున్నాను. నా చిన్నప్పుడొక తెలుగు ఉపన్యాసకులు, ఓ సభలో మాట్లాడుతూ, "లెక్కలు చదుకున్నవాళ్లు, ఎకనామిక్స్ చదువుకున్న వాళ్లు, ఎప్పుడు అప్పులపాలైపోకూడదు, అలా అయితే ఆ చదువుకి అర్ధంలేదు" అని. మరి ఈ రోజుల్లో ఏ ఖర్చైనాఅప్పే (అదే "క్రెడిట్" కార్డ్ మీదే కదా) కాని తీర్చగలిగినంతకాలం ఓకె.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఇన్సెప్షన్ అనే సినేమా చూద్దామని మొదలుపెట్టి కళ్లు మూతలు పడిపోతుంటే అర్ధమయ్యింది, ఇది పట్టపగలు చూస్తేనే అర్ధంచేసుకోడానికి టైం పట్టేట్టుంది, ఈ అర్ధరాత్రి చూస్తే అంతా కలలోఉంటుందనిపించి అప్పటికాపా.
ఆదివారం టైమ్స్ ఆఫ్ ఇండియా లో సెంటర్ పేజ్ లో రెండు ఆర్టికల్స్, ఓకటి శోభా డే ది ఇంకోటి, ఎస్ ఏ అయ్యర్. మొదటిది ప్రస్తుతం భారతదేశంలో జరిగిపోతున్న అవినీతి గురించి, ఎందుకింకా మన భారత విద్యార్ధులు నిరశన ప్రదర్శనలు మొదలు పెట్టడంలేదని అనుకుంటా, సరిగ్గా దీనికి సమాధానమా అన్నట్లు, ఎస్ ఎ అయ్యర్ గారి కాలం, మన జనాభానే అంత. ఇప్పటికి మనవాళ్లు వచ్చిన ప్రతీ ప్రత్యామ్నాయాన్నీ ప్రయత్నించారు. ఒకే ఒక్క చాన్స్, అన్న వాళ్లనీ ట్రై చేసి, అందరూ ఇంతే అన్న భావనకి వచ్చేసారు. తప్పు ఒక్క రాజకీయ నాయకులదే కాదు, మొత్తం జనాభాది. ప్రతి ఒక్కడూ "ఒక్క" చాన్స్ కోసం ఎదురుచూసేవాడే, ఎందుకు? సేవ చెయ్యడానికా, హు, దోచెయ్యడానికి. ఇప్పుడున్న వాడ్ని దింపేస్తే ఇంకొకడు, ఇలా కొనసాగాల్సిందే మళ్లీ ఏదో దేశం మనల్ని కంట్రోల్ చెయ్యడం మొదలుపెట్టేదాకా.
ఈ వారాంతపు తీరికలు ఇలానే కొనసాగితే ఇంకొన్ని సినేమాలు, పుస్తకాలు పూర్తవుతాయి :)
~సూర్యుడు

4 comments:
నాక్కూడా ఈ మధ్య చరిత్ర(రెండవ ప్రపంచయుద్ధము), ఆర్ధికశాశ్త్రము చదవాలని అనిపిస్తుంది. మీకేమైనా పుస్తకాలు తెలిస్తే సూచించగలరు.
@Indian Minerva:
Thanks for your comment. I haven't read much on 2nd WW related history except read fiction around that :)
I enjoy fiction more than the reality :D
On economics related, I just bought bunch of books, and it stopped there :)
BTW, I bought "Wealth of Nations" By Adam Smith (if you want, you can get it on net for free @ http://www2.hn.psu.edu/faculty/jmanis/adam-smith/Wealth-Nations.pdf)
and Capital by Karl Marks (this also you can get online @ http://www.marxists.org/archive/marx/works/download/pdf.htm
Other than these two books there are some others like False Economy and few others.
If you have read or come across any interesting books, please suggest to me
~సూర్యుడు
Thank you. Wealth of Nations ని ఇంకా చదువుతున్నారా? I mean అది outdate అయిపోలేదా? I don't think I can read Das Capitol or for that matter any communist theories - I am scared of the phrases they use. :D. I think I'll try this False Economy thing.
@Indian Minerva:
:) Thanks for your comment.
Wealth of Nations మరీ పాత సిద్దాంతమంటారా? :) నాకు దీనిగురించి పెద్దగా తెలీదు కాబట్టి ఓకె. Animal Spirits చదువుతుంటే నాకర్ధమయ్యిందేమంటే Adam Smith's theory is still relevant.
Capital ని మార్క్సిష్టు సిద్దాంతపరంగా చదవట్లేదు, అసలాయనేంచెప్పాడో తెలుసుకుందామని :)
కౌటిల్యుని అర్ధశాస్థ్రం కూడా కొన్నా, అదీ చదవాలి :)
~సూర్యుడు
Post a Comment