Sunday, March 27, 2011

ఆలోచనలు ...

ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళడానికి ఓ గంటన్నర పడుతుంది రోజూ. ఆ పిచ్చి ట్రాఫిక్కులో చెయ్యగలిగేదేముంటుంది, ఆలోచించడం తప్ప :)

కాకపోతే, ఎఫ్.ఎమ్ రేడియో ఉంటుంది, ఆ మధ్య రేడియో సిటీ, ఫీవర్ మొదలైనవి విని విని బోర్‌కొట్టి విన్డం మానేసా, ఈ మధ్యనే 100.1. 101.3 చానల్స్ వింటూన్నాను. మొదటిది, భారతీయ శాస్త్రీయ సంగీత వాహిని, అమృత వర్షిణి, పొద్దున్న 7:30 నుండి 8:00 వరకు మళ్లీ 8:30 నుండి 9:30 వరకు కర్నాటక శాస్త్రీయ సంగీతం వస్తుంది, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటున్నాయి. అలాగే 101.3 (ఆకాశవాణి) రైన్‌బో చానెల్. ఇందులోకూడా కొన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి, కన్నడలో వస్తాయనుకోండి, అర్ధంచేసుకోగలిగితే బాగుంటాయి.

ఇవి వింటూకూడా ఆలోచనల్లోకి వెళిపోతుంటాను. ఈ మధ్య తరచుగా వస్తున్న ఆలోచనేమంటే, రోడ్డుమీడ ఇంతమంది వెళ్తుంటారు కదా, అందులో కారుల్లో వెళ్లేవారినే తీసుకుంటే, అందులో మళ్ళీ ఒకే వయస్సు కలిగిన వాళ్లని తీసుకుంటే కొందరు ఏదో చిన్న మారుతి కారులో వెళ్తుంటే ఇంకొంతమంది హోండా సివిక్‌లో వెళ్లిపోతుంటారు, ఎందువల్ల, ఎందుకు కొంతమంది ఇలా, ఇంకొంతమంది అలా. సరే, వాళ్ళు చదివిన చదువులు వేరే వేరే అయ్యుండొచ్చు, పనిచేసే కార్యాలయాలు వేరే వేరే ఉండొండచ్చు కాబట్టి వీళ్ళనొదిలేసి, ఒకే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను, అందులో ఒకే వయసు కలిగిన వాళ్ళను తీసుకుంటే, కొంతమంది మేనేజర్లై ఉండొచ్చు, ఇంకొంతమంది, ఇంకా ఏ సీనియర్ ఇంజనీరో అయ్యుండొచ్చు, ఎందుకిలా?

ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?

మా కన్నడ మితృడొకడు ఎప్పుడు ఓ కన్నడ సీరియల్ (ముక్త) లో ఓ డయలాగ్ కోట్ చేస్తుంటాడు, అందులో ఓ జడ్జ్ ఓ డబ్బున్నవాడిని ఇలా అడుగుతాడు "ఆ బీదవాడు కూడా కష్టపడి పని చేస్తున్నాడు, వాడికి నీలా ఎందుకు డబ్బులెక్కువ రావట్లేదు" అని. నాకెందుకో ఈ ప్రశ్న అంత అర్ధవంతమైన దానిలా అనిపించలేదు, ఇక్కడ వాళ్లు సృష్టించే విలువలో తేడాలుండొచ్చు, అందువల్ల ఇలా కంపేర్ చెయ్యడం కుదరదు, అసలు కంపేర్ చెయ్యకూడదు (ఆపిల్ కి ఆరెంజ్ కి పోలికా).

సో, ఐ రిపీట్ మై క్వశ్చన్,
ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?

మిగిలిన ఆలోచన్లు మళ్ళీ ఇంకోసారి ...

~సూర్యుడు

2 comments:

Indian Minerva said...

I think the answer lies in the different ways people react to certain events and choices they make in wake of the events.

You made me think on this :D

Tejaswi said...

ప్రధానంగా ప్రతిభే కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ప్రతిభ ఉన్నా ఎదగలేనివాళ్ళు చాలామంది ఉంటారు. క్రమశిక్షణ లేకపోవడం, inter-personal relationshipsలో బలహీనం కావడం, emotional quotient తక్కువగా ఉండడం, ఉన్నతమైన లక్ష్యాలు లేకపోవడం వంటి కారణాల వలన చాలామంది - ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా - ఉంటారని నా అభిప్రాయం.