Sunday, March 25, 2012

ఈ మధ్య నవలా పఠనం

 ఈ మధ్య రైలు ప్రయాణంలో క్రొత్తగా పరిచయమైన నవలా రచయితలు, David Baldacci (ఈ పేరు తెలుగులో ఎలా పలకాలో తెలియదు :(), లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ (మొదటిది), మద్య మద్య కొద్దిగా బోరు కొట్టించినా మొత్తంమీద బాగుందనిపించి ఫస్ట్ ఫ్యామిలీ చదివా, ఇది కూడా అంతే, మద్య మద్యలో బాగ బోరు కొట్టిస్తాడీయన. తర్వాత ట్రూ బ్లూ, ఇది బెటరు. ఈ మద్యనే టోటల్ కంట్రోల్ మొదలు పెట్టాను. ఇప్పటిదాకా బాగుంది :)

ఈ నవలల ప్రభావంతో, ఈయన పుస్తకాలో కట్ట కొనుక్కొచ్చా. చదవడానికి సమయం దొరుకుతుందో లేదో చూడాలి :)

ఇంకొక రచయిత, Mark Sullivan. Rogue చదివాను. అంత గొప్పగా అనిపించలేదు. సో, నొ మోర్ బుక్స్ ఆఫ్ హిజ్ ;)

మీరెవరైనా ఈ నవలలు చదివుంటే మీ మీ అభిప్రాయాలు (అవసరమా?) :)

ఓ రోజు ఆలస్యంగా, అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

4 comments:

Rajendra Devarapalli said...

మూడేళ్ళ క్రితం బుక్ సెంటర్ చెట్టిగారు పరిచయం చేసారతన్ని.
డేవిడ్ బాల్డాక్సి అనాలన్నారు.
ఇప్పటివరకు అతని నవలలు దాదాపు అన్నీ చదివా.
అవునూ ఇన్ని పుస్తకాలు చదివే టైం పడుతుందా మీవూరు నుంచి ఇసాపట్నం రాటానికి?

సూర్యుడు said...

@రాజేంద్ర గారు:

:), చాలా రోజుల తర్వాత, ఎలా ఉన్నారు?

ఇక్కడ పుస్తకాల కొట్టాయన అతన్ని బాల్డాసి అన్నాడు :)

రైలు ప్రయాణంలో పరిచయమైన రచయితలు అన్నాను కాని, ఆ నవల్లన్నీ రైల్లో చదివానని చెప్పానా? :)

ఇవన్నీ చదవడానికి ఓ రెండు నెలలు (వరసగా కాదు, ఎప్పుడు వీలుంటే అప్పుడు చదివితే, మీరు మళ్లీ పుస్తకానికో నెలా అనకుండా :)) పట్టింది.

ఈ మద్య మీరెక్కడా బ్లాగ్ప్రపంచంలో కనపడ్డంలేదు, లేకపోతే, నేనే సరిగ్గా ఇక్కడకి రావడంలేదో :)

మీ పలకరింపుకి ధన్యవాదాలు

~సూర్యుడు :-)

louis vuitton replica said...

thank you ...good blog ..

సూర్యుడు said...

@louis vuitton replica:

Thanks for your comment.

BTW, I have completed "Total Control" and by far this is the best of Baldacci that I have read (4).

~సూర్యుడు :-)