Showing posts with label నవలలు. Show all posts
Showing posts with label నవలలు. Show all posts

Sunday, April 14, 2024

వడ్డెర చండీదాస్ నవలలు

నేను చిన్నప్పుడు చాలా తెలుగు నవలలు చదివాను కానీ, వడ్డెర చండీదాస్ గురించి ఎప్పుడు వినలేదు. అందువల్ల చదివే అవకాశం అసల్లేదు. తెలుగు బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పటినుంచే ఇతని గురించి వింటున్నాను. అయినా పెద్దగా చదవాలనిపించలేదు. కానీ ఈమధ్య అతని నవల అనుక్షణికం పరిచయం చదివాక ఎందుకో చదివి చూడాలనిపించింది. అనుక్షణికం, హిమజ్వాల కొని అనుక్షణికం పూర్తిచేశాను.

ఈ నవలకు అనుక్షణికం అనేకన్నా పరాజితులు అని పెడితే సరిపోతుందేమోననిపించింది. ఎవరో ఒకటి రెండు పాత్రలు తప్ప మిగిలినవన్నీ ఫెయిల్ అయిన జీవితాలే. సరే ఫెయిలో పాసో మనం చూసే దృష్టి బట్టి ఉందనుకోండి. 

ఈ నవల వ్రాసిన కాలానికి పాత్రల చిత్రీకరణ, వర్ణనలు కొద్దిగా విప్లవాత్మకమేమో. కొన్ని కొన్ని వర్ణనలు పెద్ద పెద్ద పేరాగ్రాఫ్ లాగా ఉండడంతో మొదట్లో చదివినా తర్వాత్తర్వాత కొన్ని కొన్ని చదవలేదు. మరీ ఎక్కువ కవితాత్మకంగా / (ఆధ్యాత్మికంగా?) అనిపించాయి :)

ఇది చదివిన తర్వాత హిమజ్వాల మొదలుపెట్టాను కానీ కొన్ని పేజీలు చదవంగానే అది మరీ అసహజంగా అనిపించి ఆపేశాను. 

అనుక్షణికం అంత గొప్పగా అనిపించలేదు అలాఅని మరీ చెత్తగా కూడా లేదు. హిమజ్వాల పూర్తిగా చదవలేదు. ఎప్పుడైనా సమయం దొరికితే చూడాలి. 


అనుక్షణికం మొదలుపెట్టకముందు ది అల్కెమిస్ట్ మళ్ళీ చదువుదామనిపించి తీసాను. మొదటిసారి చదివినప్పుడు, "మొదటిసారి చూసినప్పుడద్దరాతిరి చూసుకున్నచూపులన్ని అదోమాదిరి" అన్నట్టు అసలు కథేంటో తెలుసుకోవాలన్న ఉత్సాహంలో ఆ ఫిలాసఫీ అర్ధం చేసుకోడానికి ప్రయత్నించలేదు. మొదటి కొన్ని పేజీలే చదివాను కానీ చాల ఆసక్తికరంగా అనిపించింది. అందులో కథానాయకుడు శాంటియాగో క్రొత్త పుస్తకం తీసుకునే ఆలోచనల్లో అనుకునేదేమిటంటే పుస్తకంలో ఎక్కువ పేజీలుండాలి, ఎక్కువరోజులు చదవచ్చు, ఆ తర్వాత పుస్తకం మొదట్లోనే అన్ని పాత్రలను ప్రవేశపెట్టకూడదని. ఆ తర్వాత అనుక్షణికం చదివినప్పుడు అదే అనిపించింది మొదట్లోనే బోళ్ళన్ని పాత్రలు వచ్చేస్తాయి. 

 ది అల్కెమిస్ట్ మళ్ళీ పూర్తి చేసినతర్వాత ఎలా అనిపించిందో వ్రాస్తాను. 

 

~సూర్యుడు :-)

Sunday, March 25, 2012

ఈ మధ్య నవలా పఠనం

 ఈ మధ్య రైలు ప్రయాణంలో క్రొత్తగా పరిచయమైన నవలా రచయితలు, David Baldacci (ఈ పేరు తెలుగులో ఎలా పలకాలో తెలియదు :(), లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ (మొదటిది), మద్య మద్య కొద్దిగా బోరు కొట్టించినా మొత్తంమీద బాగుందనిపించి ఫస్ట్ ఫ్యామిలీ చదివా, ఇది కూడా అంతే, మద్య మద్యలో బాగ బోరు కొట్టిస్తాడీయన. తర్వాత ట్రూ బ్లూ, ఇది బెటరు. ఈ మద్యనే టోటల్ కంట్రోల్ మొదలు పెట్టాను. ఇప్పటిదాకా బాగుంది :)

ఈ నవలల ప్రభావంతో, ఈయన పుస్తకాలో కట్ట కొనుక్కొచ్చా. చదవడానికి సమయం దొరుకుతుందో లేదో చూడాలి :)

ఇంకొక రచయిత, Mark Sullivan. Rogue చదివాను. అంత గొప్పగా అనిపించలేదు. సో, నొ మోర్ బుక్స్ ఆఫ్ హిజ్ ;)

మీరెవరైనా ఈ నవలలు చదివుంటే మీ మీ అభిప్రాయాలు (అవసరమా?) :)

ఓ రోజు ఆలస్యంగా, అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Monday, April 5, 2010

నేను చదివిన / చూసిన పాత తెలుగు నవలలు

మళ్లీ నేను మర్చిపోకుండా :)

  1. మట్టి బొమ్మలు (తాడిగిరి పోతరాజు)
  2. వైకుంఠపాళి (ద్వివేదుల విశాలాక్షి)
  3. గ్రహణం విడిచింది (ద్వివేదుల విశాలాక్షి)
  4. నానృషిః కురుతే కావ్యం (సి ఆనందరామం)
  5. సంపెంగలూ సన్నజాజులు (అవసరాల రామకృష్ణారావు)
  6. శాంతినికేతన్ (కోడూరి కౌసల్యాదేవి)
  7. విజేత (యుద్ధనపూడి సులోచనారాణి)
  8. ఇడియట్ (కొమ్మూరి వేణుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ)
  9. మాయావి (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
  10. మాయావిని (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
  11. రత్నదీపం (సగం సగం) (బెంగాలీ మూలం: ప్రభాత్కుమార్ ముఖోపాధ్యాయ్)
  12. పూర్వా సంధ్యా ప్రవర్తతే (?)
  13. పుణ్యభూమీ కళ్లుతెరు (బీనాదేవి)
  14. ఇంద్రధనుస్సు (?)
  15. విధి విధానం (?)
  16. చదరంగం (?)
  17. స్త్రీ (ముప్పాళ్ల రంగనాయకమ్మ)
  18. పసిడి హృదయాలు (?)
  19. నాతి చరామి (?)
  20. మ్రోగింది వీణ (అనుమానం) (?)
  21. గుడి గంటలు (అనుమానం) (?)
  22. కన్యాశుల్కం (నాటకం) (గురజాడ అప్పారావు)
  23. వరవిక్రయం (నాటకం) (కాళ్లకూరి నారాయణరావు)
  24. వేయిపడగలు (విశ్వనాథ సత్యన్నారాయణ)
  25. రాజశేఖర చరిత్ర (కందుకూరి వీరేశలింగం)
  26. సమాంతర రేఖలు (పసుపులేటి మల్లికార్జున రావు)
  27. ఎండమావులు (దూర్వాసుల కామేశ్వరి)
  28. చక్రవాకం (కోడూరి కౌసల్యాదేవి)
  29. కెప్టెన్ కథ (బీనాదేవి)
నాకు గుర్తున్నంత వరకు రచయితల పేర్లు ఇచ్చాను. మీకెవరికైనా మిగిలినవాటి రచయితల పేర్లు తెలిస్తే తెలియచేయండి. మా ఇంట్లో ఈ పుస్తకాలన్నీ ఒకప్పుడుండేవి, ఇప్పుడు లేవు, కనీసం పేర్లైనా వ్రాసుంచుకుంటే అని ...

ఇంకా చాలా ఉండాలి, గుర్తొచ్చినప్పుడు వాటిని కూడ జతచేస్తాను.

~సూర్యుడు :-)