Saturday, September 8, 2012

ఆర్టీసీ బస్సులో ప్రయాణం ...

మీరెప్పుడైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని చూశారా/చదివారా?

 నేనీమద్య రోజూ చూస్తున్నాను, ఆఫీసుకెళ్ళే త్రోవలో ఎదో ఒక ఎపియస్ ఆర్టిసి బస్సు వెనకాల పడి.

ఆర్టిసి బస్సులో ప్రయాణం సురక్షితం అంటే సరే, 98% ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఈమద్య ఆర్టిసి బస్సుల ప్రమాదాల శాతం తక్కువగా ఉంటోంది కాబట్టి. సుఖమయం అంటే ఎంతవరకు ఒప్పుకోవచ్చో తెలీదు, కాని గరుడ బస్సులు వోల్వో వాళ్లవి కాబట్టి అదీ 60 శాతం ఒప్పుకోవచ్చు, అన్నీ వోల్వోలు కావుకదా :)

కానీ, ఆర్టీసి బస్సులో ప్రయాణం శుభప్రదమెందుకవుతుందో అర్ధం కాలేదు, మీకెవ్వరికైనా తెలిస్తే ... :)

మీరెవరైనా బెంగళూరులో ఉండేవారైతే, ఎఫ్‌ఎం రేడియో శ్రోతలైతే, 100.1 MHz,  భారతీయ శాస్త్రీయ సంగీత వాహిని, అమృత వర్షిణి ఉదయం, 7:30 నుండి 8:00 వరకు, కొన్ని కొన్ని రోజుల్లో (ఈ శుక్రవారమొచ్చింది) రాగ రస చింతన, లక్ష్య లక్షణ అనే కార్యక్రమమొకటి వస్తుంది, వ్యాఖ్యాత, శ్రీ ఆర్. విశ్వేస్వరన్. చాలా బాగుంటుంది, వినండి :)

~సూర్యుడు :-)

1 comment:

సూర్యుడు said...

ఓ తప్పు చేసా, అమృతవర్షిణి 100.1 లో వస్తుంది, 101.1 లో కాదు, ఇప్పుడు సరిచేసా. తెలుగు చదవలేని వాళ్ళకి, http://www.mouthshut.com/review/Amruthavarshini-100-1-Bangalore-review-qusrsolnon