Sunday, November 17, 2019

ఆలోచనలు - నాణ్యమైన పని

ఇదేమి కొత్తగా కనిపెట్టిందేమీకాదు, అందరికి తెలిసిందే. పూర్వం జరిగిన పనులు అంటే కట్టడాలు, అవేమైనా అయ్యుండొచ్చు, నదులమీద వంతెనలు, ఆనకట్టలు, గుడులు, గోపురాలు. అవి ఎన్నిరోజులు నిలిచిఉన్నాయంటే మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కడుతున్న కట్టడాలు ఎన్నిరోజులు నిలబడతాయో చెప్పడం కష్టం, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. దీనికి ప్రధానకారణం పనిలో నాణ్యత లోపించడం. ఏరంగంలో చూసినా పాత తరంకన్నా కొత్తతరం పనితనంతో వెనకపడుతున్నారేమో అనిపిస్తుంది, చేతకాక కాదు, నాణ్యతమీద శ్రద్ధలేక. ఈమాత్రం చాల్లే అనే నిర్లక్ష్యం వల్ల.

బెంగళూరులో ఓ పది సంవత్సరాల క్రితం కట్టిన మెట్రో అప్పుడే బీటలువారుతొంది అంటున్నారు, కారణాలు ఏవైనా కావచ్చు. అలాగే ఓ ఫ్లఐఓవర్ వంతెన కట్టి ఐదుసంవత్సరాలైనా కాకుండా సిమెంట్ అంతా ఊడిపోయి జల్లెడలా తయారైంది. ఇలాంటి ఉదాహరణలు మనదేశంలో బోళ్ళన్ని. కడుతూకడుతుండగానే కూలిపోయినవే బోళ్ళున్నాయి. మరి రహదారుల సంగతి చెప్పనక్కర్లేదు, వేసివెయ్యంగానే తవ్వేసేవారు కొందరు, వర్షాలు గట్టిగా పడితే కొట్టుకుపోయేవి కొన్ని. ఎంత పెద్ద ఊరైనా గతుకులులేని రహదారులు కనపడటం కష్టం.

ఇప్పుడు కొత్తగా వృద్ధిచెందుతున్న software రంగంలో కూడా అభివృద్ధి చేసే ఉత్పత్తిలో నాణ్యత అంతంత మాత్రమే.

ఏపనిలోనైనా నాణ్యత లోపిస్తే జరిగేది ఆర్ధిక నష్టం, కాల నష్టం. చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మరి కొత్తపనులెప్పుడు చేస్తాం, కదా?

ఈ విషయంలో నా అభిప్రాయమేమంటే, దేశవ్యాప్తంగా చేసేపనిలో నాణ్యత పెంచాలనే ఆలోచన ఒక ఉద్యమంలా వస్తేతప్ప నాణ్యతలో మార్పు రాదని. ఒక దేశం అభివృద్ధి పధంలో ముందుకు వెళ్లాలంటే చేసే పనుల్లో నాణ్యత చాలా ముఖ్యమని నాఉద్దేశ్యం. మీరేమంటారు?

~సూర్యుడు :-)

2 comments:

Anonymous said...

Your right. Stringent quality control is needed.

సూర్యుడు said...

Anon: thanks for your comment