వాట్సాప్ లో ఎవరో ఓ meme పంపించారు - "నూతన సంవత్సరం అయిపోయిందా, ఏమైనా దొరికిందా, ఏమైనా మారిందా" అని. నిజమేకదా, సంవత్సరం సంఖ్య మారుతుంది కానీ డిసెంబర్ 31 నుండి జనవరి 1, ఇంకొక రోజు, మిగతా రోజులు మారినట్టే. సంవత్సరం మారితే ఏం మారుతుంది, మనం మారితే ఏదైనా మారుతుంది కానీ.
కాని, జనవరి 1 అంటే అదొక ప్రత్యేకం. అవును మనకి ఉగాదికూడా ప్రత్యేకమే. సంవత్సరం మారగానే మన జీవితాల్లో ఏదో మార్పు వస్తుందని ఏదో ఆశ. ఆశ అనేదే లేకపోతే జీవనం కష్టం కదా.
కానీ జీవితంలో ఎదో మార్పు వస్తుందని డిసెంబర్ 31 వరకు ఎందుకు ఆగాలి? రేపే మన జీవితంలో మార్పు వస్తుందని ఎందుకు అనుకోకూడదు? అలా రోజూ అనుకుంటే, అలాంటి మార్పుకోసం రోజూ ప్రయత్నిస్తే, జీవితం / రోజులు ఎందుకు మారవు?
~సూర్యుడు :-)
No comments:
Post a Comment