Thursday, January 11, 2024

ప్రజాస్వామ్యము - ఓటు హక్కు వినియోగము

ఎన్నికలు వస్తున్నాయనగానే పత్రికల్లోనూ, ప్రచారసాధనాల్లోనూ అందరూ హోరెత్తించేమాట, ఓటుహక్కు ఉన్నవాళ్ళందరూ తప్పకుండా ఓటు వెయ్యాలని. అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని. ఎన్నికలు పూర్తయి ప్రభుత్వ ఏర్పాటు అవ్వకముందునుంచే అవతలి పక్ష ప్రజా (?) ప్రతినిధుల్ని ఎలా కొనేయాలని అన్ని రాజకియపక్షాలు ప్రయత్నిస్తుంటే, ధనానికో మరొకదానికో ఆశపడి ప్రజా ప్రతినిధులు వేరే పక్షానికి దూకేస్తుంటే అది ప్రజాస్వామ్యమని ఎలా అనిపించుకుంటుంది?

ప్రజలు ఒక పక్షానికిచెందిన అభ్యర్థిని గెలిపించినప్పుడు, వారి అభిప్రాయాన్ని కాదని ఆ అభ్యర్థి వేరే పక్షానికి దూకేస్తే అతనికి ఓట్లేసినవారి పరిస్థితేమిటి? వారి ఓటుకున్న విలువేంటి? ఆమాత్రందానికి అందరు ఓటు వెయ్యాలని చెప్పడం దేనికి? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా దాని సంగతే ఎవరు మాట్లాడడం లేదు. ప్రజాస్వామ్యానికే అమ్మలాంటి ప్రజాస్వామ్యమంటే ఇదేనా?

ఇంతకుముందు ఇలా జరగలేదా అని ప్రశ్నించొచ్చు కానీ ఇంతకుముందు జరిగిన తప్పులే మళ్ళీ చేస్తుంటే ఇంక తేడా ఏముంది, పురోగతేముంది?

ఒక్క ఓటుతో గెలిచినా పూర్తికాలం అభ్యర్థిగా కొనసాగే హక్కెలాఉంటుందో ఒక్క సీటు మెజారిటీతో గెలిచినా ఆ పక్షానికి పూర్తి కాలం పరిపాలించే హక్కుండాలి.


మీరేమంటారు?


~సూర్యుడు :-)

4 comments:

Zilebi said...

ఏమివోయ్ ఓటరు

పోతేపోనీ అని ఓటు వేయటానికి అనుమతిస్తే ఇలాంటి చెత్త ప్రశ్నలేస్తున్నావ్ ?
ఖబడ్దార్ ! చేతిలో పెట్టిన దస్కం గప్చిప్ గా పెట్టేసుకుని ఓటిటు వేసి వెళ్లు. హక్కూ గిక్కూ అంటూ వాగేవా కిక్కే యిక.

సూర్యుడు said...

మీ సలహాకు ధన్యవాదాలు :-)

అందుకే నేనుకూడా మన హక్కులగురించి మాట్లాడలేదు. రాజకీయ పక్ష హక్కులగుంచే అడిగాను :)

bonagiri said...

ప్రజాస్వామ్య మనెడి మేడిపండు
పొట్ట విప్పి చూడ రాజకీయ నాయకులుండు.

సూర్యుడు said...

@bonagiri గారు, టపా చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.


ఎందుకు ఇలా అవుతోందో?