Saturday, April 6, 2019
Monday, March 25, 2019
Saturday, February 16, 2019
Sunday, January 13, 2019
నదులు - నీళ్ళు - సముద్రాలు
ఈమద్య అటుఇటు తిరుగుతున్నప్పుడు గమనించిందేమంటే మన నదుల్లో నీళ్ళు
తగ్గిపోతున్నాయి. పూర్వం రైల్లో వెళ్తుంటే గోదావరిలో బోళ్ళు నీళ్లుండేవి, అలాగే
ఇంచుమించుగా కృష్ణాలో కూడా. ఇప్పుడు ఈ నదుల్లో, అంటే రైలు వంతెనల క్రింద నీళ్లు
పారడంలేదు, మహా అయితే కొన్ని నీటి గుంటలు / మడుగులు. ఒక కారణం వర్షాలు తగ్గడం
కావచ్చు లేదా ఆనకట్టల వల్ల నీళ్లు అంతకుముందే ఎక్కడో నిలువచేయబడివుండొచ్చు.
ఇందువల్ల మనం నదుల నీటిని బాగా ఉపయోగించుకుంటున్నామేమో కాని ప్రకృతిసిద్ధమైన
నదులు, సముద్రాలు, వర్షాల క్రమాన్ని దెబ్బతీస్తున్నామేమో అనిపిస్తోంది. కాల
క్రమేణా వర్షాలు తగ్గిపోతున్నాయి. నీటి వనరులు తగ్గుతున్నాయి. ఇలాగే ఇంకొన్నాళ్ళు
జరిగితే పర్యావరణమెలా (పర్యవసానం కూడా) ఉంటుందో :(
~సూర్యుడు
~సూర్యుడు
Saturday, January 5, 2019
Happy New Year 2019
Wish you all a very happy, healthy and prosperous new year 2019
రాబోయే సంవత్సరమంతా మీఅందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలను కలుగచేయాలని కోరుకుంటూ ...
~సూర్యుడు :-)
Saturday, December 8, 2018
మాయావి / మాయావిని సంక్షిప్త నవలలు
చాలారోజుల క్రిందట, అంటే చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లో ఉన్న పాత యువ పత్రికల్లో
చదివిన నవలలు అంటే సంక్షిప్త నవలలు, మాయావి / మాయావిని. తర్వాత అవి ఎలాగో
కనిపించకుండా పోయాయి. తర్వాత అంతర్జాలంలో ఎంత వెతికినా అవి కనిపించలేదు. ఈమధ్య
ఎవరో మళ్ళీ ఆ నవలల గురించ్చి ప్రస్తావిస్తే మళ్ళీ వెతికితే ఎవరో పాత యువ
పత్రికల్ని అంతర్జాలంలో పెడితే వాటిలో 1964 డిసెంబర్ పత్రికలో మాయావి కనిపిస్తే
పొందిన ఆనందం ఇంతా అంతా కాదు :). దురదృష్టవశాత్తు మాయావిని ప్రచురింపబడ్డ 1965
జనవరి పత్రిక దొరకలేదు :(. మళ్ళీ ఒక సారి అరిందముడు, పూల్ సాహెబు, జుమీలియా,
దేవేంద్ర విజయమిత్రుడిని పలకరించి పులకరించి ఇలా మీతో పంచుకోవాలనిపించి, అదీ
సంగతి ...
మీకెవరికైనా 1965 జనవరి యువ పత్రిక దొరికితే దయచేసి తెలుపగలరు :)
~సూర్యుడు :-)
మీకెవరికైనా 1965 జనవరి యువ పత్రిక దొరికితే దయచేసి తెలుపగలరు :)
~సూర్యుడు :-)
Friday, December 7, 2018
The Director / ద డైరెక్టర్
ద ప్రెసిడెంట్ ఈస్ మిస్సింగ్ నవల చదువుదామని మొదలుపెడితే ఎంతకీ ముందుకి
కదలడంలేదు. సరే అని ద డైరెక్టర్ నవల మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఇంక
ఆపాలనిపించలేదు. చాలా ఉత్కంఠంగా ఉండి బాగుంది. మొత్తంమీద చూస్తే చాలా
రంధ్రాలున్నాయి కాని ఇలాంటి నవలల్లో అవన్నీ ఓకే :)
సైబర్ హ్యాకింగ్ ప్రధానాంశంగా చేసుకుని వ్రానసిన నవల. ముఖ్యంగా స్నోడెన్ వ్వవహారం, వికీలీక్స్ తర్వాత అలాంటివి జరిగే అవకాశాన్ని చెప్పటం ఈ నవల ప్రధాన ఇతివృత్తం. అసలు సి.ఐ.ఏ ఎలా ఉద్భవించింది దాని చరిత్ర కొంత.
సో, ఇంక సన్ కింగ్ ఒక్కటే మిగిలింది, David Ignatius నవలల్లో చదవటానికి. అదికూడా చదివేస్తే ఓ పనైపోతుంది :)
~సూర్యుడు :-)
సైబర్ హ్యాకింగ్ ప్రధానాంశంగా చేసుకుని వ్రానసిన నవల. ముఖ్యంగా స్నోడెన్ వ్వవహారం, వికీలీక్స్ తర్వాత అలాంటివి జరిగే అవకాశాన్ని చెప్పటం ఈ నవల ప్రధాన ఇతివృత్తం. అసలు సి.ఐ.ఏ ఎలా ఉద్భవించింది దాని చరిత్ర కొంత.
సో, ఇంక సన్ కింగ్ ఒక్కటే మిగిలింది, David Ignatius నవలల్లో చదవటానికి. అదికూడా చదివేస్తే ఓ పనైపోతుంది :)
~సూర్యుడు :-)
Subscribe to:
Posts (Atom)





