తెలుగు భాషను మరచినవారు తప్ప గుర్తున్నవారు అడగవలసిన ప్రశ్న కాదిది. సంవాదము లేక సంవాదోపకరణం అంటే 'communication' లేక 'communication tools' లకు దగ్గరగా ఉంటుంది. తెలుగులో ప్రతి సందర్బానికి ఈ 'communication'కు పర్యాయ పదం ఉంటుంది. ఆంగ్లంలో చాలా విరివిగా అసందర్బోచితంగా ఈ 'communication' పదాన్ని వాడతారు. అంతేకాని ఆంగ్లంలాగా ఇష్టం వచ్చినొట్లుగా వాడడానికి మన తెలుగు భాష చిల్లరైన సులువు భాష కాదని మీరు గ్రహించాలి. మన భాషా సంపద... కాదు కాదు మీలాంటివారు నాలాంటివారు మరచిన భాషా విలువలు వెలకట్టలేనిది.
6 comments:
అయ్యా,

ఇట్లు, తెలంగాణ పౌరుడు
అయ్యా తెలంగాణా పౌరుడు గారు :)
ఏదో ఒకటిలెండి, పోనీ తెలుగు భాషను మర్చిపోయాననుకోండి :)
సంవాదమంటే డిబేటో, ఆర్గ్యుమెంటో అంటారేమో కదా?
భావ వ్యక్తీకరణ అని నాకనిపించింది, అసలు వేరే ఏదైనా పదముందేమో తెలుసుకుందామని అడిగాను.
మీ సమాధానానికి ధన్యవాదములు :)
ప్రసారం కావొచ్చు.
సందర్భాన్ని బట్టి వేర్వేరు అర్ధాలున్నాయి. 1. ప్రసారం(టెక్నికల్) 2. సమాచారం(జనరల్). భావ వ్యక్తీకరణను expressiveness అంటారుకదా.
@Tejaswi:
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
ప్రసారానికి సరిఐన పదం ట్రాన్స్మిషనేమో? అలాగే, సమాచారం కి ఇన్ఫర్మేషనుంది.
ఎక్స్ప్రెస్సివ్నెస్ అంటే వ్యక్తీకరణ అయ్యుండొచ్చు. ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అంటుంటారు కదా, అలా.
వేరే పదమేదో ఉండేఉంటుంది, మనకి గుర్తుకురావడంలేదంతే :-)
భావప్రకటన
https://www.shabdkosh.com/dictionary/english-telugu/communication/communication-meaning-in-telugu
Post a Comment