Sunday, March 27, 2011

ఆలోచనలు ...

ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళడానికి ఓ గంటన్నర పడుతుంది రోజూ. ఆ పిచ్చి ట్రాఫిక్కులో చెయ్యగలిగేదేముంటుంది, ఆలోచించడం తప్ప :)

కాకపోతే, ఎఫ్.ఎమ్ రేడియో ఉంటుంది, ఆ మధ్య రేడియో సిటీ, ఫీవర్ మొదలైనవి విని విని బోర్‌కొట్టి విన్డం మానేసా, ఈ మధ్యనే 100.1. 101.3 చానల్స్ వింటూన్నాను. మొదటిది, భారతీయ శాస్త్రీయ సంగీత వాహిని, అమృత వర్షిణి, పొద్దున్న 7:30 నుండి 8:00 వరకు మళ్లీ 8:30 నుండి 9:30 వరకు కర్నాటక శాస్త్రీయ సంగీతం వస్తుంది, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటున్నాయి. అలాగే 101.3 (ఆకాశవాణి) రైన్‌బో చానెల్. ఇందులోకూడా కొన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి, కన్నడలో వస్తాయనుకోండి, అర్ధంచేసుకోగలిగితే బాగుంటాయి.

ఇవి వింటూకూడా ఆలోచనల్లోకి వెళిపోతుంటాను. ఈ మధ్య తరచుగా వస్తున్న ఆలోచనేమంటే, రోడ్డుమీడ ఇంతమంది వెళ్తుంటారు కదా, అందులో కారుల్లో వెళ్లేవారినే తీసుకుంటే, అందులో మళ్ళీ ఒకే వయస్సు కలిగిన వాళ్లని తీసుకుంటే కొందరు ఏదో చిన్న మారుతి కారులో వెళ్తుంటే ఇంకొంతమంది హోండా సివిక్‌లో వెళ్లిపోతుంటారు, ఎందువల్ల, ఎందుకు కొంతమంది ఇలా, ఇంకొంతమంది అలా. సరే, వాళ్ళు చదివిన చదువులు వేరే వేరే అయ్యుండొచ్చు, పనిచేసే కార్యాలయాలు వేరే వేరే ఉండొండచ్చు కాబట్టి వీళ్ళనొదిలేసి, ఒకే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను, అందులో ఒకే వయసు కలిగిన వాళ్ళను తీసుకుంటే, కొంతమంది మేనేజర్లై ఉండొచ్చు, ఇంకొంతమంది, ఇంకా ఏ సీనియర్ ఇంజనీరో అయ్యుండొచ్చు, ఎందుకిలా?

ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?

మా కన్నడ మితృడొకడు ఎప్పుడు ఓ కన్నడ సీరియల్ (ముక్త) లో ఓ డయలాగ్ కోట్ చేస్తుంటాడు, అందులో ఓ జడ్జ్ ఓ డబ్బున్నవాడిని ఇలా అడుగుతాడు "ఆ బీదవాడు కూడా కష్టపడి పని చేస్తున్నాడు, వాడికి నీలా ఎందుకు డబ్బులెక్కువ రావట్లేదు" అని. నాకెందుకో ఈ ప్రశ్న అంత అర్ధవంతమైన దానిలా అనిపించలేదు, ఇక్కడ వాళ్లు సృష్టించే విలువలో తేడాలుండొచ్చు, అందువల్ల ఇలా కంపేర్ చెయ్యడం కుదరదు, అసలు కంపేర్ చెయ్యకూడదు (ఆపిల్ కి ఆరెంజ్ కి పోలికా).

సో, ఐ రిపీట్ మై క్వశ్చన్,
ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?

మిగిలిన ఆలోచన్లు మళ్ళీ ఇంకోసారి ...

~సూర్యుడు

Monday, March 21, 2011

తీరికగా ఉన్న ఓ వారాంతం

సరే, ఈ వారాంతం అనేది ఆంగ్ల వీకెండ్ కి మక్కీ కి మక్కీ అయినా వేరే పదమేదీ గుర్తుకురాలేదు. ఈ శని, ఆది వారాలు కొద్దిగా తీరిక దొరికి, సినేమా మేళా అని నిశ్చయం చేసి, శని వారం ఉదయాన్నే "ద అన్‌టచబుల్స్" అనే చిత్రరాజంతో మొదలు పెట్టి, తర్వాత సాల్ట్, ఆ తర్వాత నో వన్ కిల్డ్ జెస్సికా, ఆ తర్వాత వాల్ స్ట్రీట్ చూసేసి ఓ పనయ్యిందనిపించా.

ద అన్‌టచబుల్స్ గురించి చెప్పాల్సిందేమీ లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే, సూపర్. ఇలాంటి వాళ్లు మన దేశంలో ఉంటారా అనుకుంటుండంగానే, నో వన్ కిల్డ్ జెస్సికా లో ఓ పోలీసు ఆఫీసర్ కనిపించి ఆశ్చర్యం కలిగించాడు.

సాల్ట్ సినేమా గురించి కూడా చెప్పడానికేమీలేదు. నాకు స్పై సినేమాలిష్టం కాబట్టి, ఓకె అదర్వైస్, టైం వేస్ట్.

వాల్ స్ట్రీట్ సినేమా పర్వాలేదు. ఈ మధ్య ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దీనిమీద ఓ బొచ్చెడు పుస్తకాలు కొనేసి, ప్రస్తుతానికి ఏనిమల్ స్పిరిట్స్ చదువుతున్నాను. నా చిన్నప్పుడొక తెలుగు ఉపన్యాసకులు, ఓ సభలో మాట్లాడుతూ, "లెక్కలు చదుకున్నవాళ్లు, ఎకనామిక్స్ చదువుకున్న వాళ్లు, ఎప్పుడు అప్పులపాలైపోకూడదు, అలా అయితే ఆ చదువుకి అర్ధంలేదు" అని. మరి ఈ రోజుల్లో ఏ ఖర్చైనాఅప్పే (అదే "క్రెడిట్" కార్డ్ మీదే కదా) కాని తీర్చగలిగినంతకాలం ఓకె.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఇన్సెప్షన్ అనే సినేమా చూద్దామని మొదలుపెట్టి కళ్లు మూతలు పడిపోతుంటే అర్ధమయ్యింది, ఇది పట్టపగలు చూస్తేనే అర్ధంచేసుకోడానికి టైం పట్టేట్టుంది, ఈ అర్ధరాత్రి చూస్తే అంతా కలలోఉంటుందనిపించి అప్పటికాపా.

ఆదివారం టైమ్స్ ఆఫ్ ఇండియా లో సెంటర్ పేజ్ లో రెండు ఆర్టికల్స్, ఓకటి శోభా డే ది ఇంకోటి, ఎస్ ఏ అయ్యర్. మొదటిది ప్రస్తుతం భారతదేశంలో జరిగిపోతున్న అవినీతి గురించి, ఎందుకింకా మన భారత విద్యార్ధులు నిరశన ప్రదర్శనలు మొదలు పెట్టడంలేదని అనుకుంటా, సరిగ్గా దీనికి సమాధానమా అన్నట్లు, ఎస్ ఎ అయ్యర్ గారి కాలం, మన జనాభానే అంత. ఇప్పటికి మనవాళ్లు వచ్చిన ప్రతీ ప్రత్యామ్నాయాన్నీ ప్రయత్నించారు. ఒకే ఒక్క చాన్స్, అన్న వాళ్లనీ ట్రై చేసి, అందరూ ఇంతే అన్న భావనకి వచ్చేసారు. తప్పు ఒక్క రాజకీయ నాయకులదే కాదు, మొత్తం జనాభాది. ప్రతి ఒక్కడూ "ఒక్క" చాన్స్ కోసం ఎదురుచూసేవాడే, ఎందుకు? సేవ చెయ్యడానికా, హు, దోచెయ్యడానికి. ఇప్పుడున్న వాడ్ని దింపేస్తే ఇంకొకడు, ఇలా కొనసాగాల్సిందే మళ్లీ ఏదో దేశం మనల్ని కంట్రోల్ చెయ్యడం మొదలుపెట్టేదాకా.

ఈ వారాంతపు తీరికలు ఇలానే కొనసాగితే ఇంకొన్ని సినేమాలు, పుస్తకాలు పూర్తవుతాయి :)

~సూర్యుడు