ఈమధ్య మా ఆఫీసుకి వెళ్లే ప్రయాణ సమయంలో ముసురుకొనే ఆలోచన్లను కాస్త మీతోకూడా
పంచుకుందామని, ఇలా :)
మీరెప్పుడైనా క్యూల్లో నుంచున్నట్లైతే, ఎప్పుడూ, మన ప్రక్క క్యూ మన క్యూ కన్నా
ఫాస్ట్ గా కదులుతున్నట్టనిపిస్తుంటుంది కదా :), ఇది రోడ్డుమీద వాహనాల
క్యూలక్కూడా వర్తిస్తుంది. ఇండియాలో డ్రైవింగు, లేన్ డిసిప్లేన్ అనేవి
ఆక్సీమోరన్ లాంటివని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా కదా, సరే మనమేళ్లే
లేన్ ఫాస్ట్ గా కదలకపోతే, ప్రక్క లేన్ లోకి దూకు అనేది మనలాజిక్కు, అదీ
కదలకపోతే ఆ ప్రక్కలేన్లోకో లేకపోతే ఈప్రక్క లేన్లోకో దూకుతూ దూకుతూ ఎలాగోలా
ఆఫీసుకి టైంకి చేరామా లేదా అనేదే ప్రశ్న. ఇలా దూకడంలో అప్పుడప్పుడూ
ఈప్రక్కవాడినో ఆప్రక్కవాడినో ముద్దెట్టేసుకుని వాడితో ఓ నాలుగనిపించుకుని భలే
మజా వస్తూంటుంది :)
ఇలా దూకుతూ దూకుతూ వెళ్తూండగా, లేటుగా అయినా లేటెస్టుగా కనిపెట్టిందేమంటే,
ట్రాఫిక్కు సిగ్న్ల్సనేవి నార్మలైజేషన్ పాయింట్లు. మనమెంత కంగారుగా
వెళ్దామన్నా, వేరే ఎవరైనా వెళ్లిపోదామనుకున్నా, ట్రాఫిక్కు సిగ్నల్దగ్గరో,
జాంలోనో ఇటూ అటూ చూస్తే మళ్ళీ వారే :). సో, ఎంత కంగారుపడినా, మళ్లీ అక్కడే, అదీ
సంగతి ... (ఈ మూడు చుక్కలగురుంచొకసారి చెప్పుకోవాలి, పిట్టకథ: చిన్నప్పుడు
పరీక్షల్లో ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పడానికి ఈ చుక్కలు పెట్టేవాళ్లం కదా,
పరీక్ష పేపర్ ఇంకా సరిగ్గా నిండటంలేదని అనుమానమొచ్చినప్పుడు, ఈ చుక్కల సంఖ్య
పెరిగిపోతుండేది :), అంటే ఓ పది పదిహేను చుక్కలు, ప్లేసు సరిపోకపోతే ఓ రెండు
చుక్కలు, ఈ టైపులో నడిపించుకొచ్చేస్తుంటే, ఓ క్రొత్త క్లాసులో ఓ క్రొత్త
మాష్టారొచ్చి, ఈ చుక్కల సూత్రం చెప్పారన్నమాట, మీ ఓపిక్కొద్దీ చుక్కలుకాదు,
ఎప్పుడైనా మూడే చుక్కలుపెట్టాలని, అంతే, అక్కడనుండి, మన పరీక్ష పేపర్ సైజ్
రిక్వైర్మెంట్ తగ్గిపోయింది, చుక్కలతోపాటుగా :))
ఇలా లేన్లు దూకినట్టే కొంతమంది కంపెనీలే దూకేస్తుంటారు, కెరీర్ గ్రోత్తో, సాలరీ
గ్రోత్తో, ఇంకేదో గ్రోత్తో అనుకుంటూ, గోతిలో పడుతూంటారు, ఈ నార్మలైజేషన్
టెక్నిక్కులు అర్ధంచేసుకోలేక :), ఇది నాఅపోహ లేక నిజమేనా, మీకేమనిపిస్తోంది?
1 comment:
సార్.. పోస్టు స్టార్టింగ్ చదివి ఎండింగ్ లో ఏ కామెంట్ రాద్దామను కున్నానో.. మీ ఫినిషింగ్ అచ్చు ఆ కామెంట్ తోనే కంక్లూడ్ చేశారు.. హహహ... మళ్లీ మూడు చుక్కలు... నేను ఎబియన్, టి.న్యూస్, హెచ్ఎంటివికి మారాను.. నిజానికి బొక్కా బోర్లా పడ్డానో.. నిటారుగా నిలుచుంటానో గానీ.. ఆ ట్రాఫిక్ సూత్రం కూడా నాకు వర్తిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కిచ్చుకొని ఎన్నిసార్లు డివైడర్ ని చుంబించానో.. పాపం మూగది నాలుక్కాదుకదా ఒక్కమాటా అన్నపాపాన పోలేదు.. నాలాగా.. కానీ నేను సిగ్నల్ దగ్గర ఆగేసరికి నా బ్యాచ్ మెంట్స్(సారీ సహ వాహన చోద(రు)లెవరూ పక్కన లేరు... కానీ నేను గమ్యం చేరిన తరువాత హెల్మెట్(ముసుగు) తీసి చూస్తే కాస్త ముందో వెనుకో నన్ను చేర వచ్చిన వాళ్లే.. ఎవరి గమ్యం వారిది..కాకుంటే ఎవరి శక్తి కొద్ది వారి స్పీడ్ లో వెళుతారు.. ఎవరి ఆనందం వారిది.. ఎవరి అనంతం వారిది.. ఇది "భావ" సారూప్యం గల వారికే తెలియాలి.. ( మళ్లీ పెన్ను పుచ్చుకొని ఎడిట్ చేయొద్దు ప్లీజ్... అయినా మీకా ఛాన్స్ లేదులే..)
Post a Comment