ఆమధ్య ఎప్పుడో వాట్సాప్ లో తెలుగు పుస్తకాల లింకులు వచ్చాయి. అందులో ఒకటి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ - జ్ఞాపకాలూను. అప్పుడే డౌన్లోడ్ చేసినా ఇప్పటివరకు చదవడానికి కుదర్లేదు. ఈ మధ్యనే మళ్ళీ కనిపిస్తే చదవాలనిపించి చదివాను. ఇలాంటి పుస్తకాలు చదివానని చెప్పుకోవడమే తప్పిస్తే అవి ఎలా ఉన్నాయో చెప్పగలిగే అర్హతలు లేకపోవడంవల్ల నాకేమనిపించిందో గుర్తున్నవి వ్రాస్తాను.
మొదటిగా ఆయన ఆర్థికపరిస్థితి, అదీ చివరిదశలో ఎలా ఉండిందో తెలుసుకొని చాలా బాధ అనిపించింది. కళాకారులకేదో శాపం ఉండుంటుంది. ఎవరో కొద్దిమందిని మినహాయిస్తే చాలావరకు కళాకారుల ఆర్థికపరిస్థితి ఇంతేనేమో.
వ్రాసిన తెలుగు భాష సరళంగా ఉంది, గ్రాంధికం కాకుండా. ఆయన విద్యాభ్యాసం అప్పటి పరిస్థితులగురించి చాలా వివరంగా వ్రాసారు. ఇప్పటివాళ్లకి తెలుసుకోవడానికి బాగుంటాయి. పాతకవుల గురించి ప్రస్తావించారు కానీ అందులో పోతన లేకపోవడం నాకెందుకో నచ్చలేదు.
ఆయన సంస్కృతంలో చదువుకుని తెలుగులో వ్రాయడంవల్ల ఏది గొప్పదో లేక ముఖ్యమో
అన్నవిషయంలో ఆయన ఇచ్చిన వివరణ నాకు సరిగ్గా అర్ధంకాలేదు. అలాగే పద్యం వ్రాసినవాడే
కవా లేక వచనం వ్రాసినవాడు కూడా కవేనా అన్న విషయంలో చాలా వివరణ ఇచ్చారు కానీ
నాక్కూడా పద్యం వ్రాసినవాడే కవని ఘాట్టి నమ్మకం :). అసెంబ్లీ లాంగ్వేజ్
(శ్లేషనింటెండెడ్) గొప్పదా పైథాన్ లాంగ్వేజ్ గొప్పదా అనడిగితే ఏంచెప్తారు,
ఏది వ్రాసేవాళ్ళు అదిగొప్పదంటారు, అదే సహజం కానీ దేని గొప్ప దానిదే, దేని ఉపయోగం
దానిదే.
విమర్శ గురించి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో కోడ్ రివ్యూలలో పాటిస్తున్నారు. అదే, వ్రాసినదాంట్లో తప్పులని విమర్శించాలి కానీ వ్రాసినవాడిని విమర్శించకూడదని. ప్రామాణికమైన మాట (ఈ మాట సరైనదేనా?).
అష్టావధానాలని తీసిపారేయడం నాకునచ్చలేదు, నాకవంటే ఇష్టంగాబట్టి. ఇదిచెప్తూ, ఇవి సామాన్య ప్రజలని ఆకట్టుకుంటాయి కానీ గొప్పవికావన్నారు. కానీ జనరంజకంకాని కళకు సార్ధకం ఏమిటి?
వాట్సాప్ లో తిరుగుతున్న శ్రీ పిడపర్తి దక్షిణామూర్తి గారి కోర్టు సీను ఇందులోదే. మరి ఆరోజుల్లో (గొల్లపూడి మారుతీ రావు గారు అనే వరుసలో అనుకోండి :)) అలాంటి గొప్పవారు ఉండేవారేమో. ఎప్పుడైతే విద్య వాణిజ్యమైపోతుందో అప్పుడే దాని శక్తి, విలువ తగ్గిపోతాయనుకుంటా.
ఈయనకీ కాంగ్రెస్ అంటే పడదనుకుంటా :)
ఈయన వ్రాసిన పుస్తకాలేవీ ఇంతకుముందు చదవలేదు, దొరికితే కొని చదవాలి.
నాఅభిప్రాయాలు ఎవరినీ కించపరచడానికికావని తెలియచేసుకుంటూ, ఏమైనా తప్పులుంటే
మన్నించేయండి 🙏
~సూర్యుడు 😷 :-)
2 comments:
PLEASE SEND ME LINK
https://www.universallibrary.org/download/sripada-subrahmanya-sastri-anubhavalu-jnapakalunu/Sripada%20Subrahmanya%20Sastri_Anubhavalu%20Jnapakalunu.pdf
Post a Comment